- రౌడీ షీటర్ విషయంలో తప్పు చేసిన పోలీసుల్ని ఏమీ చేయలేక బ్రాహ్మణ టెక్నీషియన్ పై వేధింపులు, అక్రమ కేసులతో బ్రాహ్మణ బలి పశువు
- రాష్ట్ర డిజిపి కి తప్పు చేసిన పోలీసులు పై చర్యలు తీసుకునే దమ్ము లేదు
- చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ
అమరావతి: గుంటూరు నగరంలో వైసిపి నాయకులు, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు పోలీస్ రాచ మర్యాదల అంశంలో తప్పు చేసిన పోలీసులపై నేటి వరకు ఒక కేసు కూడా నమోదు చేయకుండా, పోలీసుల తప్పులను ఎత్తి చూపిన వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించి తొలుత ఐదు రోజుల క్రితం 41 నోటీస్ ఇచ్చి అదే రోజు రాత్రి ఇంట్లో వారికి సమాచారం ఇవ్వకుండా ఒక బ్రాహ్మణ టెక్నీషియన్ బృగుబండ శేషగిరిరావు అనే నాలుగు రోజుల నుంచి అజ్ఞాతంలో దాచిపెట్టి పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చి శారీరిక దాడులు నిర్వహించడం జరిగింది. కుటుంబ సభ్యులు గుంటూరు నగరంలో పోలీస్ స్టేషన్లో అన్ని విచారణ చేస్తే మీ వాన్ని మేము తీసుకురాలేదని చెప్పి అబద్ధాలు చెప్పడం జరిగింది.
దీనిపైన కుటుంబ సభ్యులు బ్రాహ్మణ చైతన్య వేదికను సంప్రదించగా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ కేంద్ర మంత్రివర్యులు తమసాని చంద్రశేఖర్ గారితో నేటి ఉదయం మాట్లాడగా జిల్లా ఎస్పీ మంత్రి మారని కూడా ఖాతరు చేయని క్రమంలో రమణ చేతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం లో కూడా పోలీసు వ్యవస్థ చాలా అసహ్యంగా, దారుణంగా ఉందని, కొన్ని రోజుల క్రితమే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేసినా గాని మార్పులు రాలేదని బోరుగడ్డ అనిల్ విషయంలో పోలీసులు తప్పులు చేసి రిమాండ్ లో ఉన్న ఖైదీకి రాజమర్యాదలు ఎలా చేశారని, పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో ఇది నేరం కాదా అని శ్రీధర్ ప్రశ్నించారు ఉన్నతాధికారులు నేరం చేసిన పోలీసులపై పోలీసులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని శ్రీధర్ ప్రశ్నించారు. పోలీసులు వైఫల్యాలని ఎండగట్టిన వారిపై రివర్స్ కేసులు పెట్టడం ఎంతవరకు చదవమని కూటమి ప్రభుత్వాన్ని శ్రీధర్ ప్రశ్నించారు.
దీనికోసం అయినా వివిధ సామాజిక వర్గాలు కోట ప్రభుత్వానికి ఓట్లు వేశాయ అని ప్రశ్నించారు. ఇట్లాంటి తప్పులు జరుగుతున్న కూటమి ప్రభుత్వం కళ్లు మూసుకొని ఉంటే ప్రభుత్వం మనుగడ కష్టమని, బోరుగడ్డ అనిల్ విషయంలో తప్పు చేసిన పోలీసులు వదిలేసి జర్నలిస్టులు బ్రాహ్మణ యువకునికి పై కేసులు పెట్టడం చాలా దారుణమైన అంశమని దీనికి డిజిపి సమాధానం చెప్పాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ, పోలీసు అధికారుల వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు, ప్రభుత్వం దగ్గర మెప్పు పొందేదుకోసం బెదిరించి కేసులు కట్టడాన్ని ఫ్రెండ్లీ పోలీస్ అనుకోవాలా అని శ్రీధర్ ప్రశ్నించారు.
పోలీసుల వైఫల్యాన్ని ఎండగట్టిన పవన్ కళ్యాణ్ గారిని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారిని కూడా కేసులు కట్టి అరెస్ట్ చేస్తారని శ్రీధర్ ప్రశ్నించారు. బ్రాహ్మణ జాతి ఏమీ చేయలేదు అనే చులకన భావంతో పోలీస్ శాఖ ఇదంతా చేసిందని శ్రీధర్ ప్రశ్నించారు. దీనిపైన హైకోర్టులు హెబీఎస్ కార్పస్ పిటిషన్ వేస్తామని, తప్పు చేసిన అధికారులపై హైకోర్టులో పిటిషన్లు వేస్తామని చట్టపరంగా దీనిపైన పోరాడుతామని శ్రీధర్ హెచ్చరించారు. గత వైసిపి జగన్ ప్రభుత్వంలో అడుగులకు మడుగులెత్తి, తొత్తులుగా ఉన్న అధికారులే నేడు కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికార పెత్తనాన్ని చలామణి చేయటం కూటమి ప్రభుత్వం ఏ విధంగా భావిస్తుందో తెలియని అగమ్యగోచరంలో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి శ్రేణులు ఉన్నారని, ఓట్లేసిన ప్రజలు కూడా దీనిపైన హాస్యాస్పదంగా మాట్లాడుకుంటున్నారని శ్రీధర్ ప్రభుత్వానికి తెలియజేశారు. ఇప్పటికైనా కూటం ప్రభుత్వం గత ప్రభుత్వ లోపాలను సరి చేసుకో లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని శ్రీధర్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నేతలు వావిలాల రామ్ కుమార్ శర్మ, పెద్దింటి కృష్ణ చైతన్య శర్మ, రామరాజు సుధాకర్ శర్మ, ఐలూరి సంపత్ కుమార్, చిలుమూరు ఫణి శర్మ, న్యాయవాది ఎండపల్లి శరత్, వడ్లమూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.