Suryaa.co.in

Andhra Pradesh

కాంగ్రెస్ కు ఫోటోస్టాట్ వైఎస్ఆర్

-జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ జీ
-వైసీపీ, టీడీపీ అండర్ స్టాండింగ్ పాలిటిక్స్
-బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

బీజేపీ బలోపేతం అయితే తమ అస్ధిత్వం ప్రమాదంలో పడుతుందని కుటుంబ పార్టీలు భావిస్తున్నాయని బిజెపి నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. బూత్ స్వశక్తీకరణ్ అభియాన్ సమావేశం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అధ్యక్షతన రాష్ట్రస్ధాయి సమావేశం జరిగింది. ఈunnamed సందర్భంగా అధ్యక్షోపన్యాసం చేస్తూ బీజేపీ బలోపేతం చెందింతే తొలినష్టం వైసీపి చూడాల్సివస్తుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వం లో కొండంత సంక్షేమం చేస్తే, జగన్ గోరంత మాత్రమే చేస్తున్నారు.కేంద్రప్రభుత్వం చేస్తున్న సంక్షేమం ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలన్నారు.

బిజెపి కార్యకర్తలు పటిష్టంగా ప్రచారం నిర్వహిస్తే మూడు ఎమ్మెల్సీ స్ధానాల్లో బిజెపి గెలుపు సునాయసం అన్నారు. బిజెపి రాష్ట్ర స్ధాయి ఉధ్యమం చేస్తే తట్టుకోలేని పరిస్థితిలో అధికార పార్టీ ఉందని వివరించారు. అందువల్లనే అధికార పార్టీ, శాశన సభలోని ప్రతిపక్ష పార్టీ రెండు అండర్ స్టాండింగ్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నాయని వివరించారు. బిజెపి మాత్రమే ప్రజల తరపున ఉధ్యమం చేస్తుండడంతో ఈ రెండు పార్టీలు ఉల్కిపడుతున్నాయన్నారు.

బిజెపి స్టేట్ కాల్ ఇచ్చి కార్యక్రమం నిర్వహించిన ప్రతి సందర్భలోను రెండు ప్రాంతీయ పార్టీల దుర్భుద్ది వెలుగుచూస్తోందని వివరించారు. అసలు సమస్యలు పక్కదారి మళ్లించడానికి వీరు చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఏ ప్రాంతాల్లో పటిష్టమైన పోలింగ్ బూత్ కమిటీలు ఉన్నాయి అక్కడ జరుగుతున్న పనితీరు ను ఈ సందర్భంగా వివరించారు. బూత్ స్ధాయిలో పార్టీని పటిష్టం చేయాలంటే శక్తి కేంద్రాల ప్రముఖ్ లు పాత్ర కీలక మన్నారు.

ఈ కార్యక్రమానికి పర్యవేక్షులుగా హాజరైన అరవింద్ మీనన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ కు ఫొటో స్టాట్ కాపీగా ఆంగ్లంలొ పేర్కొనగానే బిజెపి నేతలు కరతాళ ధ్వనులతో సమావేశంలో హోరెత్తించారు. కాంగ్రెస్ కు కుంభకోణాల్లో విశ్వవ్యాప్తంగా గోల్డు మెడెల్ ఇవ్వచ్చన్నారు అదే దిశగా వైసిపి పయనం ఉందన్నారు. పోలింగ్ బూత్ కమిటీలు ఏవిధంగా నియమించాలి నియమించిన తరువాత పోలింగ్ బూత్ స్ధాయిలో ఏవిధంగా పనిచేయాలన్న విషయాలను వివరించారు. జాతీయ కార్యదర్శి, ఎపి సహ ఇంఛార్చి సునీల్ దేవదర్ మాట్లాడుతూ పోలింగ్ బూత్ స్ధాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు ఒటర్ లిస్ట్ లోని ఒక్కో పేజీకి ఒక్కో ఇంచార్జిని నియమించాల్సిన అవసరం ఉందన్నారు
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ తదితరులు మాట్లాడారు.

LEAVE A RESPONSE