అమరావతి,9 మార్చి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఈనెలాఖరుకు ఖాళీ అవుతున్న 7 ఎంఎల్ఏ కోటా ఎంఎల్సి స్థానాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 7గురు అభ్యర్ధులు వారి నామినేష్లను ధాఖలు చేశారు.గురువారం వెలగపూడిలోని అసెంబ్లీ భవనంలో రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి మరియు ఎంఎల్సి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పివి.సుబ్బారెడ్డి వద్ద వారు నామినేషన్లు ధాఖలు చేశారు. నామినేషన్లు ధాఖలు చేసిన వారిలో వరుసగా జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, సిహెచ్.ఏసురత్నం, బొమ్మి ఇజ్రాయిల్, కోలా గురువులు, పోతుల సునీత, పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణ రాజు రిటర్నింగ్ అధికారికి వారి నామినేష్లను సమర్పించారు.
ఎంఎల్సి అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్ధుల వెంట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి,రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు,ఎంపి నందిగం సురేశ్,రాజ్యసభ ఎంపి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎంఎల్సి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, తలసిల రఘురామ్, ఎంఎల్ఏలు ఉండవల్లి శ్రీదేవి, రోశయ్య, మాజీమంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.