ముస్లిం రిజర్వేషన్ల కోసం టిడిపి కట్టుబడి ఉంది

Spread the love

-మసీదు, ఈద్గా అభివృద్ది కి వైసిపి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు
-టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముస్లీంలకి ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం
-జగన్ పాలనలో మైనార్టీల పై 46 దాడులు, 10 హత్యలు
-ఉర్దూ లో ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తాం
-మదనపల్లి నియోజకవర్గం ఎనుమువారిపల్లిలో మైనార్టీలతో నారా లోకేష్ ముఖాముఖి

వడ్డీ లేని రుణాలు జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదు.వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసిపి నాయకులు కబ్జా చేస్తున్నారు.ఉర్దూ ఇంటర్, డిగ్రీ కాలేజీ లు ఏర్పాటు చేయాలి.మసీదు, ఈద్గా అభివృద్ది కి వైసిపి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు.రంజాన్ తోఫా, విదేశీ విద్య పథకాలను ఆపేసారు. లోకేష్ మాట్లాడుతూ..దేశంలోనే మొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి.జగన్ ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసింది.టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముస్లీంలకి ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. వడ్డీ లేని రుణాలు అందిస్తాం. జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మైనార్టీలను మోసం చేసారు.మైనార్టీలను ఆర్థికంగానూ, రాజకీయంగానూ ఆదుకుంది టిడిపి మాత్రమే.డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఉన్నారు. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ఉన్నారు. కానీ ముస్లిం ల సమస్యలు వారికి పట్టవు. వక్ఫ్ ఆస్తులను వైసిపి నేతలు కబ్జా చేస్తుంటే వైసిపి మైనార్టీ ప్రజాప్రతినిధులు కనీసం ప్రశ్నించడం లేదు.

జగన్ పాలనలో మైనార్టీల పై 46 దాడులు, 10 హత్యలు జరిగాయి
పుంగనూరు లో 12 మంది మైనార్టీల పై అక్రమ కేసులు పెట్టి కొట్టి జైలుకి పంపారు.అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.మస్జిద్ భూములు కోసం పోరాడిన ఇబ్రహీం ని నడి రోడ్డు మీద చంపేశారు.హజీర ను అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజు వరకూ కనీసం ఆమె తల్లి కి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు.చదువుల తల్లి మిస్బా ని వైసిపి నేత వేధించి ఆత్మహత్య చేసుకునే లా చేశారు.

రంజాన్ తొఫా ఇచ్చింది, దుల్హన్ పథకం, విదేశీ విద్య, మస్జిద్, ఈద్గా అభివృద్ది కి నిధులు ఇచ్చింది టిడిపి.షాదిఖానా లు అభివృద్ది చేసింది టిడిపి.ఖబర్ స్థాన్ లు అభివృద్ది చేసింది టిడిపి.ఇమామ్, మోజమ్ల కు గౌరవ వేతనం ఇచ్చింది టిడిపి.మైనార్టీలను ఆదుకున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసింది జగన్.ఉర్దూ టీచర్ పోస్టులు భర్తీ చేసింది. ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు, ముస్లీం మహిళలకు ప్రత్యేక మధర్సాలు ఏర్పాటు చేసింది టిడిపి.ఉర్దూ లో ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తాం. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడటానికి బోర్డు కి జ్యుడిషియల్ పవర్ కల్పిస్తాం. సభలో ప్రశ్న అడిగి జై హింద్ అన్న ముస్లీం యువకుడి తో మాట్లాడుతూ లోకేష్ చేసిన వ్యాఖ్యలుమైనార్టీల సభ లో జై హింద్ అన్నానని వైసిపి వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తున్నారు.

వైసిపి వాళ్ళు మైనార్టీలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు.దేశంలో పుట్టి, దేశ అభివృద్ది లో భాగస్వామ్యం అయిన మైనార్టీలు జై హింద్ అంటే తప్పేంటి. దేశం తరువాతే ఏదైనా. దేశ భక్తి ని కూడా తప్పు బట్టే నీచమైన వాళ్ళు వైసిపి వాళ్ళు.బిజెపి తో రెండున్నర ఏళ్ళు పొత్తు లో ఉన్నా ఏనాడూ మైనార్టీ ల పై టిడిపి హయాంలో దాడులు జరగలేదు. మీ నిధులు పక్కదారి పట్టించలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల్లో పేదరికం లేకుండా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి ముస్లీం లకి ప్రత్యేకంగా భూములు కేటాయించి పారిశ్రామికవేత్తలు గా మారుస్తాం.వైసిపి ప్రభుత్వం కనీసం కోర్టు లో వాదన వినిపించడానికి కూడా ముందుకు రాలేదు. టిడిపి మాత్రమే సొంత డబ్బు తో మైనార్టీల రిజర్వేషన్ల కోసం పోరాడుతుంది.

Leave a Reply