రాజకీయాలకు మీడియాను అడ్డం పెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పత్రిక స్వేచ్ఛ అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుతూ వి6 ఛానల్ ను నిషేధిస్తామని చెప్పడం సరికాదు. నిజాలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచే నైతిక బాధ్యత మీడియా సొంతం.
కానీ వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తే వేధించడం నిషేధించడం ప్రజాస్వామ్యంలో ప్రమాదకర ఘటన. ఆ విషయానికి వస్తే కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సొంత పత్రిక, ఛానల్ టి న్యూస్ నమస్తే తెలంగాణ పత్రిక విషయంలో వారు ఇష్టానికి వ్యవహరిస్తున్న విషయం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంది.
పత్రిక విలువల గురించి మాట్లాడుతూనే.. కేంద్ర ప్రభుత్వం బీబీసీని నిషేధించిన విషయాన్ని ఎత్తి చూపిన సమావేశంలోనే మంత్రి తారక రామారావు గారు టీ న్యూస్ పై నిషేధపు ఆజ్ఞలు విధించడం విడ్డూరం. ఇలాంటి చర్యలు వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT) మంత్రిగారికి సూచిస్తుంది. పత్రిక విలువలు కాపాడి ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు పై ఉంది.