మరోమారు క్లీన్ స్వీప్ లక్ష్యంగా ముందడుగు
జిల్లాలో పార్టీ బలంగా ఉంది
ఎంపీ విజయసాయిరెడ్డి
తిరుపతి,సెప్టెంబరు,29: తిరుపతి జిల్లాలో 2019లో లాగానే 2024 ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకోని పార్టీని గెలుపించుకోవాలని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, దక్షిణ కోస్తా జిల్లాల పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి జిల్లా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి జిల్లాకి వచ్చిన ఆయన పట్టణంలో పార్టీ నేతలతో ఆయన సమావేశం అయ్యారు.
ఇప్పటికే జిల్లా పరిధిలో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలతో ఇప్పటికే తాడేపల్లిలో విజయసాయిరెడ్డి గారు విడివిడిగా సమావేశం అయ్యారు. అలాగే శుక్రవారం నాడు శ్రీకాళహస్తి, వెంకటగిరి, తిరుపతి, గూడూరు శాసన సభ నియోజకవర్గాల పార్టీ సమీక్ష సమావేశాలను విడివిడగా నిర్వహించారు.
ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, సీఎం గారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చి జరిగింది..వివిధ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు సమన్వయకర్తలు ద్వితీయ తృతీయ స్థాయి నేతలతో ఎన్నికలకు ఎలా సిద్దం కావాలన్న దానిపై వారికి దిశానిర్దేశం చేశారు. 2024లో జగన్ ని మరోసారి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి అందరు సన్నద్ధం కావాలని చెప్పారు..నాయకుల మధ్య బిన్నాభిప్రాయలు ఉంటే పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలు ముఖ్యంగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని నిర్ధేశం చేశారు.
జగన్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు ద్వారా ప్రజలు ఆదాయ వ్యయాలు పెరగడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు.. రాష్ట్రంలో అభివృద్ధి అనేది స్పష్టంగా కనిపిస్తుందన్న ఆయన రాజకీయంగా అన్ని వర్గాలకు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో 88% ఇళ్లకు సంక్షేమ పధకాలు అమల అవుతున్నాయి…ప్రతి మహిళకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లు, ఆసుపత్రుల రూపురేఖలు మారిపోతున్నాయి.. విద్య వైద్యం వ్యవసాయం తదితర రంగాల్లో మన ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు పూర్తిస్థాయిలో ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు..
బాలాయపల్లి మండల పి.హెచ్.సికి రూ 2.5 కోట్లు సి.ఎస్.అర్ నిధులు
వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి (పి.హెచ్.సి)రూ. 2.5. కోట్లు నిధులను మంజూరు చేస్తున్నట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.
ఈ సమీక్ష సమావేశాలలో తిరుపతి ఎంపి గురుమూర్తి, జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్,ఎమ్మెల్యే టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, వరప్రసాద్ రావు, ఎమ్మెల్సీలు మెరిగ మురళీధర్, పి చంద్ర శేఖర్, సిపాయి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు..