Suryaa.co.in

Andhra Pradesh

భువనేశ్వరి గురించి మేం మాట్లాడితే బాబు వెక్కి వెక్కి ఏడుస్తాడు

– భారతి గురించి మీ చెంచాలతో వాగిస్తే బాబుకు తగిన బుద్ధి చెబుతాం
– నిజాలు రాసే సాక్షిని చూస్తే టీడీపీకి -చంద్రబాబుకు భయం
– భారతి మంచి బిజినెస్ ఎంటర్ పెన్యూర్ గా ఉన్నారు
– జగన్ కుటుంబ సభ్యుల్ని రాజకీయాల్లోకి లాగి బాబు శునకానందం
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత

తాడేపల్లి: ప్రెస్‌మీట్‌లో సునీత ఏం మాట్లాడారంటే..:
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు నాయుడు శునకానందం పొందుతున్నాడు. అదే మేము భువనేశ్వరి గురించి మాట్లాడితే వెక్కి వెక్కి ఏడుస్తాడు. మహిళలను మోసం చేయడం, వారిని వంచించడం ఇదే తెలుగుదేశం పార్టీ నైజం. అది చంద్రబాబునాయుడు నేర్పించిన విద్య. అలాంటివి గతంలో చాలా చూశాం. చాలా మందిని అణిచివేసి, హింసించారు కూడా.

డీజిల్, గ్యాస్, పెట్రోల్‌ ధరలు పెంచారని అనిత విమర్శించారు. వాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఆమెకు కనీసం అవగాహన లేదు. అలాంటి ఆమె భారతి గురించి మాట్లాడారు. నిజం చెప్పాలంటే అవన్నీ చంద్రబాబునాయుడు మాట్లాడిస్తున్నవే. నిజానికి చంద్రబాబు చేసిన నీతిమాలిన రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిశాయి. అందుకే తెలుగుదేశం పార్టీ వారికే నిజాలు రాసే సాక్షిని చూస్తే భయం పట్టుకుంది. వారు తప్పులు చేశారు కాబట్టి. కుట్ర రాజకీయాలు చేశారు కాబట్టి, వారికి భారతిగారిని చూస్తే భయం.

అలాగే వారికి బాధ కూడా ఉంటుంది. జగన్‌ ఇంత చిన్న వయసులో ఇంత మంచి పరి పాలన చేస్తున్నారు కాబట్టి, చంద్రబాబుకు, ఆయన కొడుక్కి బాధ పట్టుకుంది. అలాగే వారు అన్నీ కుట్ర రాజకీయాలు చేశారు కాబట్టి, భారతిగారి గురించి భయపడుతున్నారు. జగన్‌ పేద ప్రజల కోసం, ఎక్కడా అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా రూ.1.65 లక్షల కోట్లు, నేరుగా పేద ప్రజల ఖాతాల్లోజమ చేశారు.

చంద్రబాబు, ఎల్లో మీడియా అదే పనిగా జగన్‌పైనా, ఈ ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తున్నారు. విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్, టీవీ5 అంతా కలిసి కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. చంద్రబాబు ఇకనైనా తన పద్ధతి మార్చుకోకపోతే, ప్రజలు తగిన బుద్థి చెబుతారు. మహిళలను అక్కచెల్లెమ్మలు అని సంబోధించి, వారిని ఎంతో గౌరవించి, ఆదరించే జగన్‌గారి సతీమణిని బయటకు లాగడం దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు తన వైఖరి మార్చుకోకపోతే, మహిళలే బుద్ధి చెబుతారు.

అదే విధంగా సూట్‌కేసుల్లో డబ్బులు తీసుకున్న చరిత్ర చంద్రబాబుది. చివరకు పోలవరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నాడు. దోచుకోవడం, దాచుకోవడమే చంద్రబాబు పాలన. అమరావతి పేరుతో కోట్లు సంపాదించాడు. ఆయన అవినీతి, దుర్మార్గ పాలన చూసిన ప్రజలు ఆయనను గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. అసభ్య పదజాలంతో ఎవరు పడితే వారితో మాట్లాడిస్తున్న చంద్రబాబు అనైతికంగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా ఆయన నీతిమాలిన రాజకీయాలు వీడాలి. భారతిగారి గురించి మరోసారి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE