Suryaa.co.in

Andhra Pradesh

పేదల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ: మంత్రి ఆర్ కె రోజా

12 ఏళ్ల ముందు వైఎస్ ఆశయాల మీద నాటిన పునాది వైసీపీ జెండా అన్నారు మంత్రి ఆర్ కె రోజా. అలుపెరకుండా శ్రమించిన ధీరుడు మన జగనన్న. ఈ 12 ఏళ్లలో ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం ప్రజలకోసం పని చేస్తున్నారు. పేదల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ అన్నారు రోజా. 2024 ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. పార్టీని మరోసారి గెలిపించుకుని అధికారంలోకి తీసుకురావాలి. చంద్రబాబు వెబ్ సైట్ నుంచి మ్యానిఫెస్టో తీసేశాడు. కానీ మ్యానిఫెస్టోను భగవద్గీతలా భావించిన వ్యక్తి జగన్. నాయకుడంటే ఎలా ఉండకూడదో చంద్రబాబు ఒక ఉదాహరణ.

నాయకుడంటే ఎలా ఉండాలో జగన్ ను చూసి నేర్చుకోవాలి. గెలిచిన తర్వాత కార్యకర్తలను గాలికి వదిలేసిన వ్యక్తి చంద్రబాబు. కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చిన వ్యక్తి జగన్. ప్రజలను రాచి రంపాన పెట్టిన వ్యక్తి చంద్రబాబు. మేం అధికారంలోకి వస్తే వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసేస్తామని చెబుతున్నాడు అచ్చెన్నాయుడు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు గురివింద సామెత గుర్తుచేస్తున్నారు. విచంద్రబాబు,పవన్ లకు రోజా సవాల్ విసిరారు. మీకు దమ్ముంటే రండి…ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. ఢిల్లీలో చక్రం తిప్పానని చంద్రబాబు కబుర్లు చెబుతాడు. కానీ గల్లీలో కూడా గౌరవం దక్కక ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మీటింగ్ లకు జనాలు రావడం లేదు. చంద్రబాబు మమ్మల్ని చూసి భయపడుతున్నాడు. కరోనా సమయంలో ప్రజల కష్టాలు చంద్రబాబుకి గుర్తు రాలేదు. వైసీపీ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే ప్రతిపక్షాలు పారిపోవడం ఖాయం. ప్రభుత్వం పేదలకు మంచి చేస్తుంది కాబట్టే కాలర్ ఎగరేసి మరీ ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాం. చంద్రబాబులా జగన్ ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబును నమ్ముకున్నందుకు కార్యకర్తలకైనా బుర్ర ఉండాలి.

చంద్రబాబు అనే చీడ పురుగును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి. అధికారంలోకి రావడం కోసం పవన్ కళ్యాణ్ తో పాటు అందరి కాళ్లూ పట్టుకుంటున్నాడని విమర్శించారు రోజా. ఒకరు రెండు చోట్ల ఓడిపోయారు. కానీ జగన్ మోహన్ రెడ్డిని ఓడిస్తానంటాడు. మరొకరేమో సొంత కొడుకునే గెలిపించుకోలేని అసమర్ధుడు. 2024లో మళ్లీ జగన్ ను సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు మంత్రి రోజా.

LEAVE A RESPONSE