Suryaa.co.in

Andhra Pradesh

యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్య దర్శి నాగ శ్రవణ్ కిలారు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ శాసనమండలి చైర్మన్ శ్రీ షరీఫ్, ఎమ్మెల్సీ శ్రీ అశోక్ బాబు, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి గురజాల మాల్యాద్రి, తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ శ్రీ దారపనేని నరేంద్ర, టీడీపీ నేతలు బొద్దులూరి వెంకటేశ్వరరావు, కట్టా జనార్ధన్, పంతగాని నరసింహ ప్రసాద్, ధారు నాయక్ , పాతర్ల రమేష్, హసన్ బాషా, దేవినేని శంకర్ నాయుడు మరియు తెలుగు యువత సభ్యులు గద్దె సుశీల్, పెద్ది శరత్, బండి సాయి, కందెల శివరాం, వర్ధన్, బసవయ్య అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

పాదయాత్రలో పరిణితితో కూడిన లోకేశ్ రాజకీయం కనిపిస్తోంది : బుచ్చయ్య చౌదరి
“నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా, వారికి చేయూత అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, యువత, మహిళలు ఇలా అన్నివర్గాల వారు లోకేశ్ ను ఆదరిస్తున్నారు. నేటితో యువగళం పాదయాత్ర 3వేల కిలోమీ టర్లు పూర్తైంది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడిపై పెట్టిన తప్పుడు కేసుల వల్ల పాదయాత్రకు మధ్యలో విరామం వచ్చింది. పరిణితితో కూడిన రాజకీయం లోకేశ్ పాదయాత్రలో కనిపిస్తోంది. ఎండావాన లెక్కచేయకుండా, రాత్రిపగలు తేడా లేకుండా, తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా లోకేశ్ ముందుకు సాగుతున్నారు.

లోకేశ్ నాయకత్వంలో యువతకు పార్టీలో అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అరాచక ఆటవిక పాలన వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు వెళ్లింది. భారతదేశంలో ఎక్కడా లేనంత అవినీతి ఈ రాష్ట్రంలో ఉంది. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ అస మర్థ పాలన వల్ల జరిగిన నష్టమే ఎక్కువ. ఈ ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్రం, ప్రజల జీవితాలు అంధకారమయ్యాయి. వీటన్నింటికి పరిష్కారం టీడీపీ అధికా రంలోకి రావడమే. టీడీపీ రాగానే ఒకనిర్దిష్టమైన లక్ష్యంతో రాష్ట్ర అభివృద్ధిని కొనసాగిస్తూనే అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంది.” అని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

టీడీపీ అధికారంలోకి వస్తే ఏంచేస్తుందనే భరోసా యువగళం ద్వారా ప్రజలకు దొరికింది : మొహమ్మద్ షరీఫ్
“యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. ఎప్పుడూ లేని విధంగా లోకేశ్ అవలీలగా పాదయాత్ర చేస్తున్నారు. అన్ని సామాజికవర్గాలతో సమావేశమవుతూ వారి సాదక బాధకాలు తెలుసుకుంటున్నారు. అలానే భవిష్యత్ లో ఏం చేస్తామో చెబుతూ వారికి అండగా నిలుస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏంచేస్తుందనే భరోసా యువగళం ద్వారా ప్రజలకు దొరికింది. నారా లోకేశ్ టీడీపీని 30, 40 ఏళ్ల పాటు ముందుకు తీసుకెళ్లేలా స్థిరమైన నాయకుడిగా ఎదిగారు.

భవిష్యత్ లో టీడీపీని ఎదుర్కోలేకనే ఈ ప్రభుత్వం చంద్రబాబునాయుడిని అన్యాయంగా జైల్లోపెట్టింది. అలానే యువగళం పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించింది. ప్రజల మద్ధతు తో గెలవలేమని తెలిసే .. వైసీపీ దొంగఓట్లను నమ్ముకుంది. భవిష్యత్ లో డబ్బు, రౌడీయిజంతో పోలింగ్ బూత్ లు ఆక్రమించి గెలవాలనే దురాలోచన చేస్తోంది. వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది.” అని షరీఫ్ చెప్పారు.

పాదయాత్ర పూర్తయ్యాక లోకేశ్ అసలు సినిమా మొదలెడతారు : నాగ శ్రవణ్ (తెలుగుయువత నేత)
“ లోకేశ్ యువత తరుపున తన గొంతు వినిపించడానికి పాదయాత్ర చేపడితే ఈ ప్రభుత్వం ఆయన్ని అనేక ఇబ్బందులు పెట్టింది. ఆఖరికి నిలవడకుండా చేయడానికి స్టూళ్లు కూడా లాక్కున్నారు, మాట్లాడకుండా మైక్ లాక్కున్నారు. ఎన్ని చేసినా లోకేశ్ వెనకడుగు వేయలేదు. 220 రోజులుగా లోకేశ్ సారథ్యంలో యువత ఆయన వెన్నంటే నడిచింది. జగన్ రెడ్డిని ప్రశ్నించడంలో ముందు ఉంటోంది. ప్రజల్లో తిరిగి లోకేశ్ కొత్త విషయాలు నేర్చుకున్నారు. పాదయాత్ర పూర్తయ్యాక లోకేశ్ అసలు సినిమా మొదలుపెడతారు.” అని శ్రవణ్ చెప్పారు.

LEAVE A RESPONSE