Suryaa.co.in

Andhra Pradesh

యువగళం పాదయాత్ర విజయవంతం కావాలి

-టీడీపీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
-వెయ్యి కిలోల భారీ కేక్ కట్ చేసి నారా లోకేశ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని, నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలోని పున్నమి ఘాట్లో టీడీపీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. 108 జంటలతో 11 రకాల హోమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్. రాజు, టిఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతంగాని నరసింహ ప్రసాద్ దంపతులు పాల్గొన్నారు.

అనంతరం శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కె.ఎస్.జవహర్, పీతల సుజాత, పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కైకలూరు ఇంఛార్జి జయమంగళం వెంకటరమణ, జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం, అధికార ప్రతినిధి నాగుల్ మీరా, మద్దిపాటి వెంకట్రాజు, కేశినేని చిన్ని, తదితర టీడీపీ నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో 1000 కిలోల భారీ కేక్ కట్ చేసి నారా లోకేశ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత శివపార్వతుల కళ్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

LEAVE A RESPONSE