– అభివృద్ధి జట్టు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు
– గొప్ప ప్రణాళికలు డబుల్ ఇంజన్ సర్కార్ సొంతం
– వందేళ్ళ దేశ, రాష్ట్ర భవిష్యత్ వైపు అడుగులు
– వికసిత భారత్, వికసిత ఆంధ్ర వైపు ప్రయాణం
– ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్
విజయవాడ: దేశం, రాష్ట్రం సంపూర్ణ సంక్షేమం, అభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు జట్టుగా ఏర్పడి పాలనలో దూసుకుపోతున్నారని, ఈ 100 రోజుల అడుగులు 100 ఏళ్ళ దేశ, రాష్ట్ర భవిష్యత్తు వైపు ఆశ కల్పిస్తున్నాయని, కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ తో ప్రయాణం సాగిస్తున్నారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… వికసిత భారత్, రాష్ట్రంలో వికసిత ఆంధ్ర వైపు ప్రయాణం సుస్పష్టం.
ప్రధాని మోడీ దేశంలో 15 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల లక్ష్యంగా 100 రోజుల్లో మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులకు అంకురార్పణ. 100 రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి ప్రణాళికలు వేగవంతం చేశారు. 100 రోజులలో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి పవన్ కల్యాణ్ పంచాయితీలకు ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేశారు.
దేశంలో పేదలకు మూడు కోట్ల కొత్త గృహాల నిర్మాణం, 80 కోట్ల మందికి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కొనసాగింపు, మహిళలను లాక్ పతి దీదీలుగా అభివృద్ధి కోసం ప్రధాని మోదీ అడుగులు వేశారు. 100 రోజులలో అన్న క్యాంటీన్లతో పేదలకు ఆహారం, అర్హులైన వారికి 4000 పెన్షన్, అకాల వరదలతో అతలాకుతలమైన ప్రజలను ఆదుకోవడం వంటి సేవలను సీఎం చంద్రబాబు నాయుడు అందించారు.
దేశం మొత్తం 2030 నాటికి ప్రధాని గ్రీన్ ఎనర్జీ పెట్టుబడుల లక్ష్యం 30 లక్షల కోట్లయితే అందులో 10 లక్షల కోట్లు ఏపీ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించడం శుభాపరిణామం.