ఈ కుర్రోడి పేరు శుభ్ పటేల్(ఎన్ఆర్ఐ), వయసు: 12 సంవత్సరాలు. ఆస్ట్రేలియన్ ఫుట్ బాల్ క్రీడాకారుడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ బాలుడు రుద్రాక్ష మాల ధరిస్తాడు. అయితే, రుద్రాక్ష మాల ధరిస్తే ఫుట్ బాల్ మ్యాచ్ లను ఆడనివ్వనని, అంతేకాకుండా తనను డిస్ క్వాలిఫై చేస్తానని ఫుట్ బాల్ రెఫరీ బెదిరించాడు.
కానీ…శుభ్ పటేల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ మాల తీసివేస్తే తన హిందూ ధర్మాన్ని తానే అవమానించినట్లని చెప్పి, న్యాయపోరాటం ప్రారంభించాడు. ఈ విషయం ఆస్ట్రేలియా మీడియాలో సంచలనం సృష్టించింది. దీనితో ఈ విషయం పై విచారణ జరిపిన ఆస్ట్రేలియన్ ఫుట్ బాల్ కమిటీ శుభ్ పటేల్ తో పాటు అతని కుటుంబానికి కూడా క్షమాపణలు చెప్పి, బాలుడిని మరలా టీం లోకి తీసుకోవడం విశేషం. శుభ్ పటేల్ కు 12 సంవత్సరాల వయస్సు ఐనప్పటికీ, తన మాతృ ధర్మమైన హిందుత్వానికి ఇచ్చిన గౌరవానికి అభినందనలు తెలుపుదాం.
కేవలం మాలతో చేసిన దేవుడి హారాన్ని మెడలో ధరించినందుకు మైదానం నుండి వెనక్కిపంపేయబడ్డాడు…కానీ దానికి #శుభ్ ఇచ్చిన సమాధానము “నేను కేవలం కేవలం ఒక సాకర్ ఆట కోసం నా ధర్మాన్ని వదలలేను అవసరమయితే శాశ్వతంగా ఆటను వదులుకోవడానికి కూడా సిద్ధం”అని నిక్కచ్చిగా చెప్పేసాడు..ఆ మాటతో వయసులో చిన్నవాడు అయిన ఎంతో మంది పెద్దలకన్నా చాలా పెద్దవాడు అయ్యాడు..బస్తా బియ్యనికి , డబ్బులకి, ఏదో ఒక ఆశకోసం వాగుడు ప్రలోభాలకు లొంగే వెధవ నాయళ్లకు ఈ చిన్నోడు చెప్పిన మాటలు ఒక గుణపాఠం….