బిజెపి జిల్లా కార్యాలయంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 121వ జయంతి వేడుకలు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం కార్యాలయం వద్ద మొక్కలు నాటడం జరిగింది.
ఈసందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… చనిపోయిన తర్వాత ప్రజల్లో నిలిచిపోయిన అతికొద్దిమంది వ్యక్తుల్లో ముఖర్జీ ఒకరు. ఆర్టికల్ 370ని వ్యతిరేకించి కాశ్మీర్ వెళ్ళి అనుమానాస్పదంగా చనిపోయారు. జాతీయత, దేశ సమగ్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని మహానీయుడు. భారతదేశంలో ఆర్టికల్ 370 వ్యతిరేకించి దేశమంతా ఒకటే జెండా ఒకటే రాజ్యాంగం అమలు కావాలని అహర్నిశలు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి. దేశ సమైక్యత మరియు అభివృద్ధి కోసం పాటుబడిన గొప్ప వ్యక్తి. జమ్మూకాశ్మీర్ లో తాను దేశంకోసం నమ్మినదానికి ప్రాణాలనే అర్పించారు. భారతదేశ సార్వభౌమత్వం కోసం ఆయన చేసిన కృషి అసామాన్యం. ముఖర్జీ కన్న కలలే మోడీ నాయకత్వంలో సఫలీకృత మవుతున్నాయి.
ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, యడ్లపాటి రఘునాథ బాబు, దారా సాంబయ్య,అమ్మిశెట్టి ఆంజనేయులు, రమాకుమారి, రాచుమల్లు భాస్కర్, కుమార్ గౌడ్, అప్పిశెట్టి రంగా, భీమినేని చంద్రశేఖర్, పాలపాటి రవికుమార్,వెలగలేటి గంగాధర్, ఈమని మాధవరెడ్డి, కంతేటి బ్రహ్మయ్య, ఈదర శ్రీనివాసరెడ్డి, ఏల్చురి వెంకటేశ్వర్లు, సాయి, ఆవుల రాము, ఉయ్యాల శ్యాంవరప్రసాద్, అనుమొలు ఏడుకొండలు,కన్నా రవిదేవరాజ్, ఖుద్దుస్, నాగుల్ మీరా, అబ్దుల్లా లక్ష్మణ్, చిరుమామిళ్ల అశోక్,కొక్కెర శ్రీనివాస్,నరసింహమూర్తి, పవన్ కుమార్, రాజేష్, రోశయ్య, ఇండ్ల శ్రీధర్, జితేంద్ర, కరుణశ్రీ, ఏలూరి లక్ష్మీ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.