Suryaa.co.in

Telangana

బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తా

– అన్ని పార్టీలూ బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలి
– సర్వేలో పాల్గొనని వారికి మైకు ఇవ్వొద్దు
– సర్వేకి కేటీఆర్, హరీష్‌రావు భయపడ్డారు
– అందుకే సర్వేలో పాల్గొనలేదు
– దేశానికి ఆదర్శం కులగణన
– ఈ ఘనత రాహుల్‌గాంధీదే

– సామాజిక, ఆర్ధిక, ఉపాధి, విద్య రాజకీయ మరియు కుల సర్వే- 2024 నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
– కుల సర్వే- 2024 నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

కుల సర్వేను మొత్తం నాలుగు భాగాలుగా విభజించినట్లు తెలిపారు. వాటిలో మొదటి మూడు భాగాలను సభలో ప్రవేశపెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. నాలుగో భాగంలో పౌరుల వ్యక్తిగత సమాచారం ఉన్నందున, వ్యక్తిగత గోప్యత చట్టం ప్రకారం దానిని సభలో ప్రవేశపెట్టలేమని ఆయన స్పష్టం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు కుల గణన సర్వేలో పాల్గొనలేదని విమర్శించారు.

అసెంబ్లీలో సామాజిక, ఆర్థిక, కుల గణనపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతలు సర్వేలో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని.. సర్వేలో పాల్గొనని వారికి, ఈ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని సభాపతికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలు పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కూడా సర్వేలో పాల్గొనలేదని రేవంత్ రెడ్డి తెలిపారు.సర్వే ఫా

రంలో భూముల వివరాలు అడిగే కాలమ్ ఉన్నప్పటికీ, ఎవరూ సమాచారం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. భూముల వివరాలు అడిగితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు భయపడి సర్వేలో పాల్గొనలేదని ముఖ్యమంత్రి ఆరోపించారు.

దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదు. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదు. జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు పొందుపరచలేదు.

అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం. కులగణన ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ నివేదికను సభలో ప్రవేశపెట్టాం.

ప్రతీ గ్రామంలో, తండాల్లో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారు. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్ గా గుర్తించి, ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించాం. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారు.

రూ.160 కోట్లు ఖర్చుచేసి ఒక నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించాం. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టాం. 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందించడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా.

రాష్ట్రంలో డేటా ఎంట్రీ 20.11.2024న ప్రారంభమై 25.12.2024న పూర్తయింది. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం 36 రోజులు పట్టింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సర్వే అన్ని అంశాల్లో ఒక సంవత్సరం లోపున విజయవంతంగా పూర్తి చేయబడింది. ఇది సమర్థవంతమైన అమలు మరియు సకాలంలో లక్ష్యాల సాధనను ప్రతిబింబిస్తుంది.

సర్వే నుండి లభించిన డేటా ఫలితాలు

ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలు పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్యుమరేటర్లకు స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి: ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం లో సామాజిక వర్గాల వారీగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది…

* SC లో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తం లో 17.43 శాతం గా ఉంది.

* ST లో 37,05,929 ఉండగా ఇది మొత్తం లో 10.45 శాతం.

* BC (ముస్లిం మైనారిటీ మినహా) లో 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25 శాతం గా ఉంది.

* ముస్లిం మైనారిటీల లో మొత్తం 44,57,012 ఉండగా ఇది మొత్తం లో 12.56 శాతం గా ఉంది.

* ముస్లిం మైనారిటీ లో BC లు 35,76,588 ఉండగా, ఇది మొత్తం లో 10.08 శాతం గా ఉంది.

* ముస్లిం మైనారిటీ లో OC లు 8,80,424 ఉండగా ఇది మొత్తం లో 2.48 శాతం గా ఉంది.

* OC లో 56,01,539 మంది ఉండగా ఇది మొత్తం లో 15.79 శాతం గా ఉంది.

* OC లలో ముస్లిం మైనారిటీ లు 8,80,424, ఇది మొత్తం లో 2.48 శాతం గా ఉంది.

* ముస్లిం మైనారిటీ మినహా OC లు 47,21,115 ఉండగా ఇది మొత్తం లో 13.31 శాతం గా ఉంది.

ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది.

ఈ చర్య సమానతా వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల విభిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది. ఇది డేటా ఆధారిత, సమగ్రత మరియు పారదర్శకత ప్రాతిపదికగా నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది.

LEAVE A RESPONSE