• ఏ ఒక్క ఘటనలోనూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిందితులను శిక్షించలేదు.
• అబ్దుల్ సత్తార్, అబ్దుల్ సలాం, హాజరాబీల ఘటనలు మొదలు, నిన్నటి అక్బర్ బాషా ఉదంతంలో ప్రభుత్వం ఏనాడూ అసలు దోషులను శిక్షించలేదు.
• అక్బర్ బాషాని పరామర్శించడానికి వెళ్లిన ఫారూక్ షుబ్లీని అరెస్ట్ చేయడం, ముస్లింలను అరెస్ట్ చేయడమే.
• షుబ్లీని ప్రభుత్వం వెంటనే బేషరతుగా విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నా.
* టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక ముస్లిం మైనారిటీలపై 43 దురాగతాలు (దాడులు, హత్యలు, అత్యాచారాలు) జరిగాయని, ఆయా ఘటనల్లో ఏఒక్కదానిపైకూడా ముఖ్యమంత్రి ఏనాడూ స్పందించి, కారకులైనవారిని శిక్షించిందిలేదని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ స్పష్టంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ప్రతిపక్షాలు, మీడియా ఆయాఘటనలను వెలుగులోకి తీసుకొచ్చి, బాధితులకున్యాయం చేయాలని డిమాండ్ చేస్తే, వాటిని ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి కప్పిపుచ్చడానికి, నిందితులకు బాధితులకు మధ్యన రాజీకుదర్చడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప, చట్టపరంగా మైనారిటీలకు అన్యాయంచేస్తున్న వారిని శిక్షించడంలేదు.
కడపజిల్లా మైదుకూరులో జరిగిన అక్బర్ బాషా ఉదంతంలో సీఐ కొండారెడ్డిపై ప్రభుత్వం ఎలాంటిచర్యలు తీసుకోలేదు. బాషాని, అతని భార్యని కొండారెడ్డి దారుణంగా హింసిస్తే, ప్రభుత్వం అతన్ని కేవలం రెండురోజులు వీఆర్ కి పంపి సరిపెట్టుకుంది. బాషా పొలాన్ని ఆక్రమిం చుకోవడానికి ప్రయత్నించిన తిరుపాల్ రెడ్డి స్వయంగా వై.ఎస్.విజయ మ్మకు బంధువు. అతన్ని అరెస్టు చేయాలి. అతనికి సహకరించిన సీఐ కొండారెడ్డిని సస్పెండ్ ఈ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయాడు? చేయలేకపోయాడు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో అలీషా అనేయువకుడిని స్థానిక సీఐ దారుణంగా కొట్టిహింసించాడు. అలీషా కాళ్లుచేతులపై నుంచి మోటార్ సైకిల్ నడిపారు. అంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? పోలీస్ దెబ్బలు, వేధింపులతో చివరకు అలీషా మరణించాడు. ఆ కుటుంబం రోడ్డున పడింది.
కానీ అలీషా చావుకి కారకుడైన సీఐపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఈ విధంగా జగన్ ముఖ్యమంత్రయ్యాక ముస్లిం మైనారిటీలపై అనేకఘటనలు జరుగుతూనేఉన్నాయి. అబ్దుల్ సలాం, అబ్దుల్ సత్తార్, హాజరాబీ సంఘటనలపై చర్యలు లేవు. ఈ ఘటనలు ఎంత ఘోరమైనవో అందరం చూశాము. గతంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనను గద్దె దింపడానికి ముసుగు మనుషులను పెట్టి హత్యలు, మతకల్లోలాలు జరిగే లాచేశాడని, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మర్రిచెన్నారెడ్డి స్వయంగా చెప్పాడు. అదే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు అమలుచేశాడని ముస్లింలు జీవిత కాలం ఫిదా అవుతారా?
వక్ఫ్ భూములను అన్యాక్రాంతంచేశాడు. తండ్రి బాటలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వక్ఫ్ భూములు, ఖబరిస్తాన్, దర్గా భూములను కొల్లగొడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి తమకేం చేశాడో, ఎంత అన్యాయం చేస్తున్నాడో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఆలోచించాలని కోరుతున్నాం. అక్బర్ బాషాని కలవడానికి వెళుతున్న ఫారూక్ షుబ్లీని ప్రభుత్వం ఎందుకు అడ్డుకుం ది? ఫారూక్ షుబ్లీని అరెస్ట్ చేయడమంటే మొత్తం ముస్లిం సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయాలనుకుంటున్నాడా?
అక్బర్ బాషాకుఅన్యాయం చేసిన తిరుపాల్ రెడ్డి, సీఐ కొండారెడ్డిలను వదిలేసి, న్యాయంచేయాలని అడుగుతున్న వారిని అరెస్ట్ చేయడమేంటి? సముద్రం కంటే శాంతం, సహనం గొప్పవంటారు.. ముస్లింలుకూడా ఇప్పుడు అవే ఓర్పు, సహనాలతో ఉంటున్నారు. వారు ఆగ్రహించిన మరుక్షణం ఈ ముఖ్యమంత్రి ఎక్కడుంటాడో కూడా తెలియదు. మైనారి టీల ఓట్లకోసం ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని జగన్ చెప్పాడు. షాదీముబారక్ అన్నాడు, కానీ అది అమలుకాలేదు. జగన్ జమానాలో ఒక్క ముస్లిం కుటుం బానికైనా సరే, స్వయంసహాయక రుణం అందిందా? ఒక్క ముస్లిం అయినా ప్రభుత్వ అండంతో స్వయం ఉపాధి పొందుతున్నాడా? ఇవన్నీ కూడా ముస్లింసోదరులు ఆలోచించుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక ప్రభుత్వంగా మారింది.
చంద్రబాబునాయుడి హయాంలో ముస్లిం మైనారిటీలకు అమలుచేసిన అనేక సంక్షేమపథకాలను జగన్ అర్థంతరంగా రద్దుచేశాడు.
విదేశీవిద్య, విద్యోన్నతి, దుల్హన్, దుకాన్ మకాన్, కుట్టుమిషన్ల పంపిణీ, పారిశ్రామిక రంగంలో ముస్లింయువతకు శిక్షణనిచ్చే కార్యక్రమం, ఉర్దూ భాషాభివృద్ధి, షాదీఖానాల అభివృద్ధికి ఇచ్చే నిధులు, రంజాన్ తోఫా, వక్ఫ్ భూముల పరిరక్షణకు ఏర్పాటుచేసిన నిధి, ఖబరిస్తాన్, మసీదుల కు మరమ్మతలకు ఇచ్చిన నిధులు, ఇవన్నీ చంద్రబాబునాయుడి హాయాంలో అమలయ్యాయి.. వాటన్నింటిని రద్దు చేసి ముస్లింలకు అన్యాయం చేశాడు.
ముస్లిం మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నదేమీలేదు. వారికి తీరని అన్యాయంచేస్తూ, అదనంగా తప్పుడుకేసులతో వేధిస్తున్నారు. మైనారిటీలపై దాడులకు పాల్పడేవారిని, వేధించేవారిని, వారిఆస్తులను కాజేసేవారిని ప్రభుత్వమే రక్షిస్తోంది. నంద్యాల అబ్దుల్ సలాం ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తామన్నారు..కానీ అమలుకాలేదు. ముస్లింలు అంటే జగన్ దృష్టిలో కేవలం ఓటుబ్యాంక్ మాత్రమే. అది ఆయన మాటలు చేతల్లోనే అర్థమవుతోంది. ముస్లిం సమాజంలో జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైంది. అది ఎంతపెరిగితే అంత నష్టపోయేది ఈ జగన్మోహన్ రెడ్డే..
ఈ ప్రభుత్వం, ఈముఖ్యమంత్రి ఈ రెండున్నరేళ్లలో ముస్లింమైనారిటీలకు ఏంచేశారో వాస్తవాలువెల్లడిస్తూ, శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంజాద్ బాషాని ముఖ్యమంత్రి ఉత్సవవిగ్రహంగా మార్చాడు.తనవద్దకు వస్తే ముస్లింల కు న్యాయం చేయలేనని ఉపముఖ్యమంత్రిగా ఉన్న బాషానే చెబుతు న్నాడు. అతనికి సరైన శాఖ ఇవ్వలేదు. అంటే ముస్లింలు సమర్థులు కారా? జగన్మోహన్ రెడ్డికి ముస్లింపై ఎలాంటిప్రేమాభిమానాలు లేనే లేవు. ఫారూక్ షుబ్లీపై పెట్టిన తప్పుడుకేసులను ప్రభుత్వం వెంటనే తొలగించాలి. అతను పోలీస్ కస్టడీలో ఉన్నసమయంలోనే కానిస్టేబుల్ ను కారుతో గుద్ది చంపడానికి ప్రయత్నించాడని 307కేసుపెట్టారు. ముస్లిం సమాజం ఎల్లకాలం తనవెంటే ఉంటుందని జగన్ భ్రమల్లో ఉన్నట్లున్నాడు. తన హయాంలో ముస్లింపై జరిగిన 43 ఘటనలపై ముఖ్యమంత్రి ఏంసమాధానం చెబుతాడు? ముస్లిం సమాజం ఆగ్రహావేశాలకు జగన్, ఆయన ప్రభుత్వం ఆహుతి అయ్యేరోజు దగ్గర్లోనే ఉంది.