Suryaa.co.in

నకిలీ వీసాలతో గల్ఫ్‌ వెళ్లేందుకు యత్నం..
Crime News Telangana

నకిలీ వీసాలతో గల్ఫ్‌ వెళ్లేందుకు యత్నం..

-44 మంది మహిళలు అరెస్టు
శంషాబాద్‌‌: నకిలీ వీసాలు, ధ్రువపత్రాలతో గల్ఫ్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు పట్టుకున్నారు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న కొంత మంది దళారులు డబ్బులు తీసుకొని నకిలీ వీసాలు, ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు. వీరందరికీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి టికెట్లు బుక్‌ చేశారు. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మహిళల వీసాలు, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన ఇమిగ్రేషన్‌ అధికారులు అవన్నీ నకిలీవని తేల్చారు. పట్టుబడ్డ మహిళలను ఇమిగ్రేషన్ అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం మహిళలను ఆర్జీఐఏ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

LEAVE A RESPONSE