– రూ.48 వేల కోట్లకు అకౌంట్స్ లేవు
– ఏడాది క్రితమే చెబితే ఎగతాళి చేశారు
– అప్పులు పెరిగాయి, ఆదాయం పెరిగింది, ఖర్చు మాత్రం తగ్గింది
– ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది?
– కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాం
– పయ్యావుల కేశవ్
రాష్ట్ర ప్రభుత్వ గత రెండు బడ్జెట్ లలో ఖర్చులు, ఆదాయం గురించి కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టారు. అకౌంట్స్ ఫైనలైజేషన్ స్టేజ్ లోనే దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వానికి సర్టిఫికెట్ ను కాగ్ ఇచ్చింది. ఆడిట్ మొత్తం మీద సర్టిఫికెట్ ఇచ్చేప్పుడు 3 రకాలు ఉన్నాయి. ఒకటి క్వాలిఫైడ్, రెండోది అన్ క్వాలిఫైడ్ ఒపీనియన్ అంటే.. లెక్కలు అంతుబట్టనప్పుడు ఇచ్చేది. మూడోది అడ్వర్స్ ఒపీనియన్. పరిస్థితి చేయి దాటిపోయేటప్పుడు చెప్పేది.
ఇప్పడు గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వని క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చే స్టేజ్ కి కాగ్ వచ్చింది. గతేడాది మే నెలలో నేను ఏం చెప్పానంటే రూ.48 వేల కోట్లకు సంబంధించి రికార్డులు లేవని చెప్పాను. దీనిపై వెటకారం చేశారు. ఏడాది తర్వాత కాగ్ ఏం రాసిందో ఆర్థికమంత్రి సమాధానం చెప్పాలి.
The gross amount transacted through the Special Bills was ₹48,284.31 crore అని కాగ్ చెప్పింది. నేను ఆ రోజే చెప్పాను. They were processed through “Special Bills” in the CFMS, which is not an authorised type of a bill as per the Treasury Code అని కాగ్ చెప్పింది. ఇవి ఇంకా అబ్జర్వేషన్సే. సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా భయపడుతూ.. క్వాలిఫైడ్ సర్టిఫికెట్ ఇస్తూ ఇది రాశారు. ఇది ఆథరైజ్డ్ టైప్ ఆఫ్ బిల్లు కాదు అని చెప్పారు. అనుమానాలు నివృత్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వినిపించుకోలేదు. ఒక దొంగ తనకు లేని అధికారాన్ని ఇచ్చుకుని ఇది సక్రమమే అని ఆయనకు ఆయనే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారని కాగ్ చెప్పకనే చెప్పింది.
దీని వల్ల ఏం నష్టమంటే These irregular accounting entries are fraught with the risk of inflating the Government expenditure besides possible misappropriations. 48 వేల కోట్లకు అకౌంట్స్ లేవంటే.. రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా? కాగ్ చెప్పిన తర్వాత కూడా బుకాయిస్తారా?
శాసనసభలో బడ్జెట్ పై భజన చేసుకుంటున్నారు. ఇవా సర్టిఫికెట్లు? బడ్జెట్ లో అన్ని అబద్ధాలు చెప్పారు. ఉద్యోగులు జీతాలు పెంచమంటే.. ఆదాయం లేదంటారు. చంద్రబాబు గారు మీకు అధికారం ఇచ్చే నాటికి రూ.1,14,870 కోట్ల రిసిప్ట్స్. ఈ రోజు మీరు చూపిస్తున్న ఆదాయం రూ.1,91,225 కోట్లు. కేంద్రం నుంచి వచ్చే నిధులు రెట్టింపయ్యాయి.
ఎక్సైజ్ ఆదాయం రెట్టింపు దాటిపోయింది. చెత్త, ఇంటి పన్నులతో ప్రజలను బాదేస్తున్నారు. 80శాతం ఆదాయం పెరిగింది. పరిమితి దాటి అప్పులు చేశారు. కాగ్ కూడా చెప్పింది. దీనిపైనా ప్రభుత్వం సమాధానం చెప్పారు. కేంద్రం ఇంకా మౌనంగా ఉంటుందా? కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ డబ్బులు ఎక్కడ పెట్టారు? ఇరిగేషన్ లో చంద్రబాబు ఒక ఏడాదిలో పెట్టిన దానికి మీరు మూడేళ్లలో పెట్టిన దానికి సమానం.
ప్రతి డిపార్ట్ మెంట్ లో మీకన్నా మేం ఎక్కువ పెట్టాం. మీ కేబినెట్ మంత్రులు దీనిపై సమాధానం చెప్పగలరా? 2018-19లో కేపిటల్ ఎక్స్ పెండిచర్ 20వేల కోట్లు ఖర్చు చేస్తే.. మీరు 2019-20లో కేవలం 12 వేల కోట్లే. ఇప్పుడు ఇంకా పడిపోయింది. రైతులకు ఐదేళ్లలో చంద్రబాబు గారు ఖర్చు చేసిన దాంట్లో జగన్ రెడ్డి 30శాతం కూడా ఖర్చు చేయలేదు. వ్యవసాయశాఖను మూసేసే దిశగా తీసుకెళ్తున్నారు. 12 వేల కోట్లలో 7 వేల కోట్లు రైతు భరోసా.
ఇందులో కూడా 3వేల కోట్లు కేంద్రానివి. జీతాలు పోను మీరు ఖర్చుపెడుతున్నది రైతు భరోసాకు మాత్రమే. ఇలాంటివి వందశాఖల గురించి నేను చెప్పగలను. రైతులకు సంబంధించి కేంద్రం 11 పథకాలకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇరిగేషన్ కు టీడీపీ రూ.60వేల కోట్లు ఖర్చు పెట్టింది. మీరెంత పెట్టారు? ఇవాళ మిస్ అప్రాప్రియేషన్స్ కు తీసుకెళ్లారు. అసలు బడ్జెటే బూటకం. దీనిని నేను నిరూపిస్తాను. అప్పులు పెరిగాయి, ఆదాయం పెరిగింది, ఖర్చు మాత్రం తగ్గింది. అంటే డబ్బంతా ఎక్కడికి పోయింది?
శాసనసభ భజనకే పరిమితం అయింది. భజన కార్యక్రమానికి నిరసనగా విజిల్ బ్లోయర్ గా మారాం. సమస్యలు వినపడాలని మేం విజిల్స్ వేశాం. ఒక్క సమస్యపై కూడా చర్చ చేపట్టే ధైర్యం చేయలేదు. 151 మంది ఎమ్మెల్యేల్లో వేగం తగ్గిపోయింది. ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత అసెంబ్లీలో కనపడింది. సారా మరణాలను సహజ మరణాలని ఏవిధంగా అంటారు? వైసీపీవి ఏదీ సహజంగా లేవు.ఇకనైనా ఆర్థికమంత్రి తప్పులను సరిచేయాలి.
తాగుడు ఆదాయాన్ని మాత్రమే జగన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు. మీ ఆర్థిక విధానాలు సరిగా లేవు. డబ్బులు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదు. ఆధారాలతో నేను మాట్లాడితే ఎగతాళి చేశారు. ఇవాళ కాగ్ చెప్పింది. దేశంలో మొట్టమొదటి సారిగా కాగ్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చే స్థితికి వచ్చారంటే మీ ఆర్థిక విధానాలు ఏవిధంగా ఉన్నాయో అర్థమవుతోంది.
ఇకనైనా కళ్లు తెరవండి. రూ.48 వేల కోట్లంటే, 30శాతం బడ్జెట్ కు అకౌంట్స్ లేవు. ఏం సమాధానం చెబుతారు? కాగ్ కు చెప్పనివాళ్లు ప్రజలకు ఏం చెబుతారు? కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. ఆర్థిక అవకతవకలపై సీరియస్ గా అధ్యయనం చేయంచాలని కోరతాం. దేశంలో మొట్టమొదటి సారిగా కాగ్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చే స్థితికి వచ్చారంటే జగన్ రెడ్డి ఆర్థిక విధానాలు ఏవిధంగా ఉన్నాయో అర్థమవుతోంది.