ఒకటి వద్దు..మూడే ముద్దు….

హే వీరాధి వీరుడా సూరాధి సూరుడా
ధీరాది ధీరుడా, జగనన్న
హీరోలకే హీరోవి నాయకులకే నాయకుడివి
నువు గ్రేటంటే గ్రేటు..మా జగనన్న ,,

హే ఒకటి రెండు మూడు… ఈ జగనన్న అందరివాడు
హే ఒకటి రెండు మూడు… ఈ జగనన్న అందరి వాడు
నాడు నేడు ఎపుడూ… నమ్మింది చేస్తుంటాడు
వింటాడు గోడు, ఓఓ ఓ… ఉంటాడు తోడు, ఓఓ ఓ
హే గుండెల్లో లోడు, ఓఓ ఓ… తగ్గించుతాడు, ఓఓ ఓ

హే టెన్షన్లు తెప్పించి… ఫంక్షన్లు పెట్టిస్తే, జంక్షన్లో జామ్ అవుద్దిరో
హే వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ చిందు వెయ్
అరె చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చిత్తు చెయ్
హే ఒకటి రెండు మూడు… ఈ జగనన్న అందరి వాడు
నాడు నేడు ఎపుడూ… నమ్మింది చేస్తుంటాడు

హే వీరాధి వీరుడా సూరాధి సూరుడా
ధీరాది ధీరుడా, జగనన్న
హీరోలకే హీరోవి నాయకులకే నాయకుడివి
నువు గ్రేటంటే గ్రేటు..మా జగనన్న ,,

హే పరిత్రాణాయ సాధునాం… వినాషాయ చ దుష్కృతాం
ధర్మ సంస్తాపనార్ధాయ సంభవామి యుగే యుగే
అచ్చ తెలుగులో సెలవిస్తా… ఏకీకరణమిక తొలగిస్తా
వికేంద్రీకణతో పరుగెత్తిస్తా… ఇక లోకమంతా సుఖే సుఖే

బాసు బాసు బాగుంది బాసు… అరె నీలో ఫోర్సు ముందే తెలుసు
హెయ్ బాసు బాసు మీరిక ఆడాలి ఢంకా పలాసు… అందుకే ఇచ్చారు 151..
బాసు బాసు రావాలి ఇక బిల్లు…
అడ్డొస్తే కారాలిగా పులుసు
హే ఒకటి రెండు మూడు… ఈ జగనన్న అందరి వాడు
నాడు నేడు ఎపుడూ హే నమ్మింది చేస్తుంటాడు

హే సిమెంట్లోన తగు ఇసకేసి… పునాదుల్లో అది నింపేసి
ఇటుకపై ఇటుక పెట్టేస్తే… అందమైన రాజధానవతదా
మనసుపై ముసుగు తీసేసి… మమతనే దాన్ని జతచేసి
మనిషిగా మనిషిగా అన్ని ప్రాంతాలను బ్రతుకు నిస్తే…
వికేంద్రీకరణతో ఇక ఆంధ్రాలో జయే జయే..

అన్నా అన్నా మెచ్చాము మిమ్మే… అరే నీకే నీకే ఇచ్చాము మా గుండె
హే అన్నా అన్నా నచ్చావు అన్నా… నువ్వే నువ్వే మా ముఖ్య మంత్రి
మూడు రాజధానులతో చేస్తారు ఇస్త్రీ…
సోకు సొమ్ము డాబుబాబుల కవతాది ఇక స్టీము ఇస్త్రీ,,

హే ఒకటి రెండు మూడు… ఈ జగనన్న అందరి వాడు
నాడు నేడు ఎపుడూ అరె నమ్మింది చేస్తుంటాడు
వీరాధి వీరుడా సూరాధి సూరుడా
ధీరాది ధీరుడా జగనన్న ,,
హీరోలకే హీరోవి నాయకులకే నాయకుడివి
నువు గ్రేటంటే గ్రేటు..మా జగనన్న ,,

కాబట్టి,,,కాబట్టి,.కాబట్టి..తగ్గేదేల్యా..ఝుక్ తా నహీ,,,
ఒకటి వద్దు..మూడే ముద్దు….

– Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.