తమిళనాడులో పాలనాపరమైన అనిశ్చితి.. రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి అవకాశం ఇవ్వడం లేదు. మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించలేదు కాబట్టి అవకాశం ఇవ్వలేం అంటున్నారు గవర్నర్.
ప్రస్తుత పరిస్థితుల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉన్న టీవీకే పార్టీ, తర్వాత అత్యధిక స్థానాలు సాధించిన డీఎంకే.. మూడవస్థానంలో గణనీయమైన స్థానాలు గెలుచుకున్న అన్నాడీఎంకే ఉన్నాయి.
పార్టీల వారిగా ఉన్న అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
టీవీకే (విజయ్)
కాంగ్రెస్ లెఫ్ట్ సహా మరో పార్టీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం..
బీజేపీకి తలొగ్గి అన్నాడీఎంకే తో కలిసి మద్దతు తీసుకోవడం..
డీఎంకేతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం..
సుప్రీం కోర్టు కు వెళ్ళి వేచిచూడటం…
తాను సహా ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లడం..
డీఎంకే (స్టాలిన్)
అన్నాడీఎంకే తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.. లేదంటే అన్నా డీఎంకే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
టీవీకే విజయ్ తో చేతులు కలిపి లేదా మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం..
అన్నాడీఎంకేతో కలయికతో విజయ్ ను అడ్డుకోవడానికి రజనీకాంత్ కు మద్దతు ఇవ్వడం..
ఎవరితో కలిసినా కుమారుడికి ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇప్పించడం..
ఎవరితో కలవలకుండా సైలెంట్ గా ఉండి.. తదుపరి పరిణామాలను అంచనావేస్తూ వేచిచూడటం..
అన్నాడీఎంకే(పళనిస్వామి)
డీఎంకే తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎక్కువ భాగస్వామ్యం తీసుకోవడం..
టీవీకే తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం..
(ఈ పార్టీకి సంబంధించి ఏదైనా బీజేపీ పెద్దల సూచనల మేరకు ఉంటుంది కాబట్టి వారి ఆదేశాలకనుగుణంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి.)
కాంగ్రెస్
డీఎంకే తో బెడిసి కొట్టిన సంబంధాలు మెరుగుపరుచుకొని టీవీకే కు మద్దతు ఇచ్చేలా చూడటం..
ఉన్నది ఐదు సీట్లు మాత్రమే కాబట్టి కొంత సైలెంట్ గా ఉండటం..
* * *
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సుస్థిర ప్రభుత్వం కోసం ప్రజలు చూస్తారు కాబట్టి టీవీకే అన్నాడీఎంకే లేదా టీవీకే డీఎంకే కలయికను అంగీకరించే అవకాశం ఉంది.
స్టాలిన్ కు సంబంధించి కేంద్ర రాష్ట్ర రాజకీయాలు ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవచ్చు. కుమారుడికి అనుకోని అవకాశం వస్తే అంగీకరించే స్థితిలో ఉన్నారు. తమకు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ ను తిరిగి దెబ్బకొట్టాలంటే.. బీజేపీ నీ అడ్డుకోవాలంటే.. టీవీకే కు మద్దతు ఇవ్వడమే ఆయనకున్న ప్రధాన అవకాశం. ఒకవేళ విజయ్ ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉంటే.. ఆయన అన్నాడీఎంకే తో చేతులు కలపవచ్చు.
రజనీకాంత్ ను సీఎం చేస్తే విజయ్ పార్టీపై ప్రభావం చూపడం మాట ఎలా ఉన్నా.. భవిష్యత్తులో ఆయన అన్నా డీఎంకే కు పెద్ద దిక్కుగా మారితే, తమకే నష్టమనే భయం కూడా స్టాలిన్ కు ఉందని చెబుతున్నారు.బీజేపీ ప్రస్తుతం కాంగ్రెస్ కు కొత్త ప్రభుత్వంలో ఎట్టిపరిస్థితుల్లో స్థానం ఉండకూడదని చూస్తోంది.
దక్షిణాదిలో మొన్న కేరళం కూడా గెలుచుకున్న కాంగ్రెస్ కీలకమైన కర్ణాటక తెలంగాణ లో కూడా అధికారంలో ఉంది. తమిళనాడు కూడా కాంగ్రెస్ కు అధికారంలో వాటా ఉంటే తమకు నష్టం జరగవచ్చని అంచనాలు బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.
డీఎంకే లేదా అన్నాడీఎంకే తో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ముందుగా ఆయనను కాంగ్రెస్ తో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనే షరతు విధిస్తారు. అన్నాడీఎంకే కు 47 సీట్లు ఉన్నాయి కాబట్టి డీఎంకే అవసరం కూడా ఉండదు. కానీ అక్కడ తమ అధీనంలో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒకటే బీజేపీ లక్ష్యం కాదు! డీఎంకే ను తనవైపు తిప్పుకోవడం కూడా!
చూడాలి ఏంజరుగుతుందో..!
– శ్యాంసుందర్ ఆకుల
9010746999