బెంగాల్ లో రాజకీయ మూలభూత మార్పు జరుగుతున్న సందర్భంలో.. ఓసారి చరిత్రలోకి తొంగిచూద్దాం !
దేశ విభజన నేపథ్యంలో మౌంట్ బాటన్ కు అసలు సమస్య..పంజాబ్ కాదు అది కలకత్తా. సైన్యాన్ని కలకత్తాకు పంపటం నిష్ప్రయోజనం. అక్కడ మురికి నీళ్లలో, మురికివాడలో, కిక్కిరిసిన బజార్లలో గొడవలు మొదలయితే ఎందరు సైనికులున్నా నియంత్రించలేరు. అయితే..అతడు దేశంలో మత ఘర్షణలు మొదలైతే..అతడు నమ్మదగిన సైనికుల యూనిట్లనింటినీ పంజాబ్ లోనే ఉంచడానికి నిశ్చయించుకున్నాడు.ఆనాడు కలకత్తాలో గొడవలు మొదలైతే జరిగిఉండే రక్తపాతం ముందు..పంజాబ్ చాలా చిన్నది అని మౌంట్ బాటన్ భావనే అయినా..!
కలకత్తాలో ఏర్పడబోయే ప్రమాదం చాలా పెద్దది. దానిని నియంత్రించడానికి అవసరమైన ప్రత్యామ్నాయ వనరులు పరిమితంగానే ఉన్నాయి.ఆ పరిస్థితి నుంచి బయటపడాలీ అంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే ! ఆ నగరంలో మతకల్లోలాలకు అడ్డుకట్ట వేయాలంటే..’తన పిచ్చుక’ మహాత్మా గాంధీని వినియోగించాలని ఎత్తుగడ వేశాడు !
మౌంట్ బాటన్..తన ఆలోచనలను జూలైలోనే గాంధీకి చెప్పాడు. తన బౌండరీ సైన్యంతో పంజాబ్ లో ఉత్పన్నమయ్యే గొడవలను నియంత్రించగలనని, అయితే కలకత్తాలో గొడవలు మొదలైతే మనం మునిగిపోతాము..నేను ఏమీ చేయలేను.ఒకవేళ కలకత్తాలో మంటలు చెలరేగితే అది కాలిపోతుంది..అని వివరించాడు గాంధీకి మౌంట్ బాటన్ !
అప్పటి దేశ విభజనను వ్యతిరేకిస్తున్న గాంధీ..”ఔను మిత్రమా, అది నీ విభజన పథకం యొక్క ఫలితం ” అని అన్నాడు.
అది నిజమే అవ్వచ్చు,అయితే ప్రత్యామ్నాయాలు తక్కువగా ఉన్నాయి. ..”ఇప్పుడు మీరు అక్కడ కొంత చేయగలరు”. ‘మీరు నా ఒకే వ్యక్తి సైన్యంగా’అక్కడ ఉండాలి అని మౌంట్ బాటన్ కోరాడు.
మౌంట్ బాటన్ అలా వేడుకున్నప్పటికీ..గాంధీకి కలకత్తాకి వెళ్లాలని లేదు. స్వతంత్ర దినం నాడు తాను బెంగాల్ లోని నవకాలీ అల్పసంఖ్యాక హిందువులకు నూతన సంవత్సరం రోజు హామీ ఇచ్చినట్టుగా భయంతో వణికిపోతున్న వారి మధ్య చరకాపై నూలు ఉడుకుతూ, ప్రార్థన చేసుకుంటూ గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు
అయితే ఇక్కడ విచిత్రం ఏమంటే..భయంతో వణుకుతున్న ఆ కలకత్తా మురికివాడలకు వెళ్ళమని గాంధీని అలా అడిగిన వారిలో మౌంట్ వాటిని ఒక్కడే లేడు. గాంధీని అలా కోరిన మరోవ్యక్తి.. మహాత్మా గాంధీకి రాజకీయంగా ఏమాత్రం మిత్రుడు కానివాడు,అతని జీవనశైలికి,అతని ఆశయాలకు విరుద్ధంగా నడుచుకునేవాడు అయిన సుహ్రవర్ధి కూడా ఉన్నాడు.
ఈ 47 సంవత్సరాల సుహ్రావద్దీ అవినీతి రూపుదాల్చిన రాజకీయ నాయకుడు. అతడి రాజకీయ సిద్ధాంతం అతి సాధారణం.తాను ఎన్నిక కాబడటానికి, తాను అధికారంలో కొనసాగటానికి..ప్రజాధనాన్ని ఉపయోగించి..రౌడీ మూకలను తయారుచేసి..అతడి రాజకీయ విరోధుల తలలు పగులగొట్టి నోరు మూయించడమే!
1942లో బెంగాల్లో సంభవించిన కరువు సమయంలో.. కలకత్తాలో ఆకలిగొన్న లక్షణాది ప్రజలకు చేరవలసిన ఆహారాన్ని కొల్లగొట్టి బ్లాక్ మార్కెట్లో అమ్మి..అలా కొన్ని మిలియన్ రూపాయలు సంపాదించాడు. అతడు సిల్క్ సూటు, ముసలి చర్మపు చెప్పులు ధరించేవాడు. తరచూ వ్యభిచార గృహాలను సందర్శించేవాడు.
అన్నింటికీ మించి అతని చేతులు ఎప్పుడూ..రక్తంతో తడిసే ఉండేవి.సెలవు ప్రకటించిన రోజు అతడి ‘ముస్లిం లీగ్ ‘ సభ్యులకు మాత్రం, అతడు ఎక్కడ ఉన్నాడో తెలిసినా..పోలీసుల దృష్టి మరెక్కడికో మరలించబడేది !
జిన్నా 1946 ఆగస్టులో ‘డైరెక్షన్ యాక్షన్ డే ‘ గా ప్రకటించినరోజు కలకత్తాను అల్లకల్లోలం చేసిన హత్యలకు అతడే కారణం.అయితే..ఆ హత్యలకు హిందువులు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకో పోతున్నారనే భయం.. అతన్ని ఇప్పుడు గాంధీ వద్దకు చేర్చి..మత సామరస్యం కాపాడమనే అభ్యర్థనతో మౌంట్ బాటన్ తో గొంతుకలిపేలా చేసింది !
గాంధీ యొక్క సోద్ పూర్ ఆశ్రమానికి పరిగెత్తి..గాంధీ నవకాలీ కి బయలుదేరుతుండగా పట్టుకుని..కలకత్తాలో ఉండమని వేడుకున్నాడు. కలకత్తాను ముంచెత్తబోతున్న మారణ హోమం నుండి తమరు మాత్రమే అడ్డుకోగల సమర్థులని వేడుకున్నాడు.” మీ మీద హిందువులకు ఎంత అధికారం ఉందో, ముస్లింలకు కూడా అంతే అధికారం ఉంది. నీవు ఎల్లప్పుడు ముస్లింలు, హిందువులు సమానమేనవి చెప్తుంటావు ” అని అర్థించాడు.
గాంధీ..తాను కలకత్తాలో ఉండాలoటే రెండు నిబంధనలు అమలు చేయాలని అతనికి షరతులు పెట్టాడు.
* ఒకటి.నవకాలీలో..వారి మధ్య నివసిస్తున్న అల్పసంఖ్యాక హిందువులకు రక్షణ కల్పిస్తామని నవకాలీల ముస్లింల నుండి హామీ ఇచ్చేటట్లు చేయాలి.
* రెండు..నేను కలకత్తాలో ఉన్నంతకాలం సుహ్రవద్దీ కూడా రాత్రీపగలూ కూడా తానున్న గుడిస లోనే.. తనపక్కనే ఎలాంటి ఆయుధం, ఎలాంటి రక్షణ లేకుండా తనతో ఉండాలి (ఇందుకే కదా గాంధీ అద్భుతమైన ఎత్తుగడ,జిత్తులమారి అనడానికి అర్హుడైంది) అని రెండవ నిబంధనగా పెట్టాడు !
సుహ్రవర్ధి..తన నిబంధనలకు అంగీకారాన్ని తెలుపగానే..గాంధీ ఢిల్లీకి ఇలా రాశాడు. “నేనిక్కడ ఇరుక్కుపోయాను.నేను ఇక్కడ తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాను. ఏమి జరుగుతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది ” అని !
అలా..ఆనాడు..కలకత్తా నగరపు శాంతికొరకు..ఎలాంటి పోలికాలేని..ఆ ఇద్దరూ కలసి నిలబడాల్సి వచ్చింది !
*. *. *
* తాజాకలం : ఈనాటి పశ్చిమ బెంగాల్ లో జరిగిన రాజకీయ మూలభూత మార్పుతో..ఆనాటి కలకత్తా ను..ఈనాటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తం ప్రతిధ్వనిస్తుందా ? ప్రతిఫలిస్తుందా? ఎలా సర్దుబాటు చేసుకుంటుందీ అనేది వేచి చూడాలి !
( ఈ పోస్ట్ కు మూలం..FREEDOM AT MIDNIGHT..గ్రంథం) – DRK
* * *
ఎన్నడూ లేనన్ని కంపెనీల కేంద్ర భద్రతా బలగాల మధ్య, సాక్ష్యాత్తు ప్రధాని, హోం శాఖ మంత్రి వెళ్లి ఓటర్లకు ధైర్యం చెప్పి, నేరుగా అసాంఘిక శక్తులకు చేసిన హెచ్చరికల మధ్య తాజాగా ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. ఇంకా రెండు నెలలు అక్కడే కేంద్ర బలగాలు ఉంటాయి. అయినా మమతను ఓడించిన నేత పీఏ హత్య జరిగింది.
-చాకిరేవు