– ఎందుకు రైతు వారోత్సవాలు చేస్తుందో చెప్పాలి
– రైతుల వడ్లు కొననందుకా ? .. రైతులకు యూరియా ఇవ్వనందుకా?
– పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయనందుకు వారోత్సవాలు చేస్తున్నారా?
– రైతులతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: మండల పరిధిలోని రాంరెడ్డి గూడెం మిల్లు వద్ద వడ్లు అమ్మకం చేసేందుకు వాహనాల్లో సంచులు పెట్టుకొని ఎదురు చూస్తున్న రైతులతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.
రైతుల్లో భరోసా నింపేందుకు పాదయాత్ర నిర్వహించాలని అనుకున్నాం. త్వరలోనే పార్టీ ముఖ్య నాయకులూ కూర్చొని ప్రణాళిక విడుదల చేస్తాం. పాదయాత్ర ద్వారా ప్రతి రైతును కలుస్తము. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం వివరిస్తాము. రైతులకు గిట్టు బాటు ధర ఇవ్వాలని..రైతులకు సకాలంలో యూరియా..కరెంటు ఇవ్వాలని.. రైతు బందు ఇవ్వాలని.. పండించిన పంట సకాలంలో కొనుగోలు చేయడంతో పాటు మద్దతు ధర ఇవ్వాలని.. రైతు చనిపోతే రైతు భీమా ఇవ్వాలని.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే డిమాండ్ ల తో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం భారతం పడతాము. ప్రజలందరితో కలిసి పోరాటం చేస్తాము. ప్రజా సమస్యలు వదిలేసి సర్పంచ్.. కార్పొరేటర్లు.. నాయకులను కొనుగోలు చేయాలనీ చూస్తున్నారు. రైతులు అధైర్య పడవద్దు.ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ వరంగల్ సభ పెడుతున్నట్టు ప్రకటన వచ్చిన వెంటనే, పాత పద్దతిలో పంట కొనుగోళ్లు ప్రారంభించారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వాళ్ళ రైతుల నుంచి మిల్లర్లు ఎక్కువ తరుగు తీస్తున్నారు. రెండు నుంచి మూడు కిలోలు తరుగు తీస్తున్నట్లు రైతులు చెబుతున్నారని అన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మూడు సార్లు రైతు బందు ఎగ్గొట్టారు.వ్యవసాయానికి కరెంటు సరిగ్గా ఇవ్వలేదు..యూరియా ఇవ్వలేదు.. ఐన కష్టపడి పంట పండిస్తే కనీసం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు.
అరకొర కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎత్తి వేసిండ్రు. మిల్లుల వద్దకు రైతులు వచ్చిన మిల్లర్లు చాలా చోట్ల కొనుగోలు చేయడం లేదు. ప్రైవేట్ వ్యాపారాలు 40 కేజీలకు 3 నుంచి 4 కిలోల తరుగు తీస్తున్నారు. ప్రభుత్వం సరిగ్గా కొనకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్లాల వద్ద వడ్లు కొనుగోలు చేసాము.. తడిసిన ధాన్యం కూడా కొన్నాం .సమయానికి డబ్బులు వేసాము
కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రైతు వారోత్సవాలు చేస్తుందో చెప్పాలి. రైతుల వడ్లు కొననందుకా ? రైతులకు యూరియా ఇవ్వనందుకా? కరెంటు ఇవ్వనందుకా? పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయనందుకు వారోత్సవాలు చేస్తున్నారా సమాధానం చెప్పాలి. ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా నాయకులను డబ్బులతో కొనాలని చూస్తున్నారు.ఇది మంచి పద్ధతి కాదు. రైతులు..ప్రజలు..విద్యార్థులను డబ్బులతో కొనలేరు. ప్రజలు ఎదుర్కొంటున ప్రతి సమస్య మీద పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి వాటికీ పరిష్కారం కల్పిస్తాం.