– రేవంత్ రెడ్డికి సిగ్గు ఉందా?
– రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపైనర్ కాదు.. స్టార్ డిస్ట్రిబ్యూటర్
– సివిల్ సప్లైస్ స్కామ్ లో మంత్రులు
– చేతకాని దద్దమ్మలు మాత్రమే కేసులు పెడతారు
– బిచ్చగాళ్లకు వేసినట్లు రైతు బంధు వేస్తున్నారు.
– కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,మంత్రులు ఐ.కె.పి.సెంటర్ల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడాలి
– బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ రాక్షస రాజ్యం నడుపుతోంది. రైతుల పక్షాన వరంగల్ లో కేటీఆర్ ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అమలు చేయకపోతే రైతులకు క్షమాపణ చెప్పాలి. చేతకాని దద్దమ్మలు మాత్రమే కేసులు పెడతారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,మంత్రులు ఐ.కె.పి.సెంటర్ల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడాలి. రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ ప్రకటించారు.
రైతులను కాపాడుకోవడానికి ఎన్ని కేసులకైనా కేటీఆర్ సిద్దం. తెలంగాణ ద్రోహులపై దురంధరుడు కేటీఆర్ పోరాటం చేస్తున్నారు. కేటీఆర్ రైతు సంగ్రామ సదస్సులో 20 వేల మంది పాల్గొన్నారు. కాంగ్రెస్ రైతు మేళాలో 2వేల మంది రాలేదు. నువ్వు కేసు పెడితే కేటీఆర్ భయపడతారా? బిఆర్ఎస్ పార్టీ పేరు చెప్తే కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
2024లో ఎకరానికి 15 వేలు ఎగ్గొట్టారు. 2025లో 7 వేలు ఎగ్గొట్టారు. ఇప్పుడు బిచ్చగాళ్లకు వేసినట్లు రైతు బంధు వేస్తున్నారు. అన్ని పంటలకు బోనస్ అని ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దిగజారింది. రాష్ట్రంలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఐ.కె.పి సెంటర్లు,మార్క్ ఫెడ్ సెంటర్లలో పరిస్థితి దారుణంగా ఉంది. మొక్కజొన్నలో క్వింటాల్ కు రైతు 900 రూపాయలు నష్ట పోతున్నారు.
రేవంత్ రెడ్డి గజినీలా ప్రవర్తిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఒళ్ళు అంతా పచ్చబొట్లు పొడవాలి. రైతులు మీ పాలనలో వలసలు వెళ్లారు. కేసీఆర్ సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని సంక్షేమం వైపుకు తీసుకువెళ్లారు. రేవంత్ రెడ్డికి సిగ్గు ఉందా? సివిల్ సప్లైస్ లో పెద్ద స్కామ్ జరిగింది. మంత్రులు సివిల్ సప్లైస్ స్కామ్ లో ఉన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అవినీతి అక్కడ ఉంటుంది. తెలంగాణ ఖజానాను ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారు.
రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపైనర్ కాదు స్టార్ డిస్ట్రిబ్యూటర్. ఎన్ని కేసులు పెట్టినా,జైలుకు పంపానా భయపడం. మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టండి కానీ రైతుల జోలికి పోవద్దు. వరి ధాన్యాల కల్లాల్లో చనిపోతున్న రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీపై ఎన్ని కేసులు పెట్టాలి.