సాయిబాబా అంటే?
సాఈ (సాయీ), బాబా… రెండు పదాలు. ఇందులో మొదటిది సాఈ లేదా సాయీ (సాయి కాదు). ఈ ‘సాఈ’ ఖడీబోలీ భాష పదం. (ఈ ఖడీబోలీ నుండే హిందీ, ఉర్దూ భాషలు ఉత్పన్నమయ్యాయి. సంస్కృతం భాషను ప్రధానంగా తీసుకుని హిందీ భాష రూపొందితే ఫార్సీ, అరబీ భాషల్ని ప్రధానంగా తీసుకుని ఉర్దూ భాష రూపొందింది) సాఈ ఫార్సీ భాష పదం కాదు. సాఈ పదం ఫార్సీ పదం అని ఎఐ (AI) తెలియజేస్తోంది. అది తప్పు. ఫార్సీలో సాయిస్, షాహీ, సాహీన్ వంటి పదాలున్నాయి. వాటికి వేరు వేరు అర్థాలున్నాయి. సాఈ అన్నది ఫార్సీ పదం కాదు. (‘జామై ఫార్సీ లుగాత్’ ఆధారంగా)
‘ఫకీర్’ అన్నది అరబీ మాట. ఇస్లామ్ సూఫీ పురుషుడిని ఫకీర్ అంటారు. కాలక్రమేణా దేశ దిమ్మరిని, పని పాటు, బాధ్యతలు, కుటుంబం వంటివి లేకుండా గాలికి బతికే వ్యక్తిని ఫకీర్ అనడం వాడుకలోకి వచ్చింది. ఫకీర్‌ను హిందీలో సాఈ (సాయీ) అంటారు. ఖడీబోలీ పదమైన సాఈ పదం హిందీలోకి వచ్చి హిందీ పదం అయిపోయింది.
ఇస్లామ్ సాధువును సంబోధించే మాట ఈ సాఈ. సాఈ పదానికి అంతర్జాలంలో ‘స్వామి’ అన్న అర్థం తెలియజెయ్యబడుతోంది. అది తప్పు. కబీర్ తన దోహాల్లో సాఈ పదం వాడాడు. కబీర్ ముస్లీమ్ దంపతుల పెంపుడు బిడ్డ. ఫార్సీ కవులు అత్తర్, సాదీ శిరాజ్, రూమీ, హాఫిజ్ వంటివాళ్ల ప్రభావం కబీర్‌పై గాఢంగా ఉంది.
కబీర్ తనపై ఉన్న ఫార్సీ, అరబీ భాషల ప్రభావంతోనే ‘స్వామి’ అనాల్సి వచ్చినప్పుడు ‘సాఈ’ అని అన్నాడు. కబీర్ ఇస్లామ్ ప్రభావంతో మనుగడ చేశాడు. కాబట్టే స్వామి అని కాకుండా సాఈ (సాయీ) అన్నాడు. కబీర్ తన దోహాలలో సాఈ పదం ప్రయోగించాడు. స్వామి అన్న అర్థంలో కబీర్ సాఈ పదాన్ని వాడాడని కొందరు ‘చదువు’లేని వాళ్లు వక్రార్థాన్ని తీస్తున్నారు.
సాఈ పదానికి స్వామి అన్న అర్థం లేదు. స్వామి అన్నది హైందవ అర్థాన్ని తెలియజేసే పదం. సాఈ లేదా సాయీ పదం హైందవేతర ఫకీర్ అన్న అర్థాన్ని తెలియజేస్తుంది. ఫకీర్ తరహాలో కనిపించాడు కాబట్టే సాయీ అంటూ సాయిబాబాను తొలిదశలో సంబోధించారు.
‘బాబా’ అన్నది ఫార్సీ మాట. తండ్రి, తాత, వృద్ధుడు ఈ అర్థాల్లో బాబా పదం వాడుకలో ఉంది. సాధువుల్ని సంబోధించే మాటగా కూడా బాబాను వాడతారు.
సాయిబాబా అనడం ఎంత మాత్రమూ సనాతనం లేదా కాదు; సాయిబాబా అనడం ఎంత మాత్రమూ వైదికం కాదు; మన సంస్కృతి, సాహిత్యం, పురాణాలు, ఇతిహాసాల నుంచి వచ్చింది కానేకాదు సాయిబాబా. సాయిబాబా అనడంలో ఎంత మాత్రమూ భారతీయ సాంప్రదాయికత లేదు. సాయిబాబా పదానికి సనాతనం లేదా హైందవంలో మూలూలు లేవు. ‘సాయిబాబా అన్నది భాష, భావనల పరంగా ఇస్లామ్‌కు చెందినది’. ఇది చదువు; ఇది తెలివిడి. ఇది నిర్వివాదం.
ఆలోచిద్దాం… మనం సాయిబాబా పేరుతో ఎంత భ్రష్టుపట్టామో? మనకు మనమే ఎంత హాని చేసుకున్నామో? సావధానంగా ఆలోచిద్దాం… సాయిబాబా అంటూ, సాయిబాబాను మనకు మనమే ఆపాదించుకుంటూ మనల్ని మనమే ఎందుకు భ్రష్టుపట్టించుకుంటున్నాం?
లక్ష్మీ, సరస్వతి, పార్వతి వంటి హిందూ దేవతలకు ఫకీర్ అనే అర్థం ఉన్న సాయిని కలిపేసి మన ఆడపిల్లలకు, మన మహిళలకు పేర్లు పెట్టుకున్నాం. సాయీ అన్నది పుంలింగ శబ్దం. ఆడవాళ్లకు పుంలింగ శబ్దంతో పేర్లు ఉండడం ఏమిటి? సాయి అనే శబ్దంతో మన దేవతల, దేవుళ్లను మనమే మలినం చేసుకోవడం ఏమిటి?
సాయిలక్ష్మి అనే పేరుకు ‘ఫకీర్ లక్ష్మి’ అని అర్థం. సాయిలక్ష్మి అని అంటూ ఒక హిందూ కుటుంబ స్త్రీని ముస్లీమ్ ఫకీర్‌ను చేసేస్తున్నాం. బాధాకరమైన పరిస్థితి ఇది. మన హిందూ ఆడపిల్లలను మనమే ఫకీర్లను చేసేశాం. మన ఇంటి దీపాలను ఫకీర్లని మనమే అంటున్నాం. ఆవేదన కలిగిస్తోంది ఈ వికృతం.
ఒక్కసారి ఆలోచించండి ఈ భ్రష్టత్వం, ఈ వికృతం, ఈ దారుణం మనకు ఎందుకు? సాయిబాబా అన్నది ఇస్లామ్ పేరే అయినా ముస్లిమ్‌లు సాయిబాబా పేరును పెట్టుకోరు. ఎందుకంటే ముస్లిమ్‌లు తమ ‘మతం పట్టు’ వీడరు. అది సరైన విధానం. మరి మనమెందుకు భ్రష్టుపడుతున్నాం? హిందువులం మనం మాత్రమే ఎందుకు వేలం వెఱ్ఱిగా సాయి, సాయిబాబా, సాయిరాం, సాయి కిషోర్, సాయిలక్ష్మి, సాయిపార్వతి అని పెట్టుకుంటున్నాం? మనకు ఈ దుస్థితి, ఈ దుర్గతి ఎందుకు?
సాయిబాబా విషయంలో మన తప్పు తెలుసుకుందాం; మన తప్పును చదువుతో, తెలివిడితో, సరైన చింతనతో మనం ఇకనైనా దిద్దుకుందాం.
“సాయిబాబా భ్రష్టత్వం మనకు వద్దు; వద్దు; వద్దు;
సాయిబాబా భ్రష్టత్వంతో మనం హైందవాన్ని కోల్పోవద్దు”
(సాయిబాబాపై అవగాహన వ్యాసాలలో నా తదుపరి వ్యాసం 3 మంగళవారం నాటి సంచికలో))
– రోచిష్మాన్
9444012279