– వాళ్లు దొంగలు.. మోసగాళ్ల కన్నా హానికరమైన వాళ్లు
మీ పేరు Aతో మొదలౌతుందా?
మీ పేరు Bతో మొదలౌతుందా?
అయితే మీరు ఇలా ఉంటారు, మీరు అలా ఉంటారు; అయితే మీకు ఇది జరుగుతుంది, మీకు అది జరుగుతుంది…
అంటూ ‘న్యూమరాలజి’ అంటే ఏమిటో తెలియని, చదువు లేని వాళ్లు చానళ్లలో మనకు తెలియ వస్తున్నారు. వాళ్లు దొంగలు, మోసగాళ్ల కన్నా హానికరమైన వాళ్లు!
అది ‘అజ్ఞానపు న్యూమరాలజి’; ఆపై ‘అపాయకరమైన న్యూమరాలజి’…
వద్దు వద్దు ఇలాంటి వాటిని నమ్మవద్దు.
ఈ పేలాపన అజ్ఞానం మాత్రమే కాదు న్యూమరాలజికి ఇది వక్రత; భ్రష్టత్వం.
ప్రజలారా మీకు అజ్ఞానపు న్యూమరాలజి, భ్రష్టత్వపు న్యూమరాలజి హానికరం.
న్యూమరాలజిస్టుకు సరైన చదువు ఉండాలి; చదువు సరిగ్గా ఉండాలి. అవి ఉన్న ఉన్నతమైన న్యూమరాలజిస్టులు చానళ్ల ద్వారా paid publicity చేయించుకోరు.
మీకు న్యూమరాలజి విషయంగా ఆసక్తి ఉంటే చానళ్లలో వచ్చే paid publicity న్యూమరాలజిస్టులు కాదు చదువు, అంతర్జాతీయ అధ్యయనం ఉన్న సరైన, మేలైన న్యూమరాలజిస్టులను సంప్రదించండి.
ప్రజలారా వికార న్యూమరాలజికి బలి అవకండి.
– రోచిష్మాన్
9444012278