– వికలాంగుల సంస్థ అధ్యక్షుడు ప్రకటన
– రాష్ట్ర పెరిక సంఘం నూతన అధ్యక్షుడిగా గటిక విజయ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెరిక కులస్థుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి 50 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య ప్రకటించారు. పెరికకుల కార్పొరేషన్ ద్వారా ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు పెరిక కార్పొరేషన్‌కు త్వరలోనే నూతన అధ్యక్షుడు నియామకం జరుగుతుందని చెప్పారు.
పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆదివారం ఎన్నికలు జరిగాయి. నూతన అధ్యక్షుడిగా డాక్టర్ గటిక విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే లు శ్రీరామ్ భద్రయ్య, బండి పుల్లయ్య, రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షులు మద్దా లింగయ్య, దాసరి మల్లేశం, శ్రీరామ్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని సమావేశం కోరింది. బీసీ కులాల అభ్యున్నతికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది