– ఏపి ఫైబర్ నెట్ ఉద్యోగులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్‌లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగించింది. సూర్య ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి ఔట్ అవనున్నారు. ఇక ముందు ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ఉద్యోగులంతా కూడా ఫైబర్ నెట్ కార్యాలయానికి రాకుండా జీతాలు తీసుకున్న పరిస్థితి. దీనిపై దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం దాదాపు 500 మందిని ఫైబర్ నెట్ నుంచి తొలగించింది.