21.05.1964 విడుదల
తెలిసాయిలే..తెలిసాయిలే..
నెలరాజ నీ రూపులు తెలిసాయిలే..
ఒక్క ఎన్టీవోడే తెరకి అందం
ఇద్దరుంటే మరీ నిండు..
కనులు పండు..
వాల్మీకి రాముడు..
భారతంలో భీముడు..
ప్యాంటు..చొక్కా తొడిగి
ఒకరు అమాయకంగా
ఇంకొకరు కాలర్ రాసుకుంటూ
అదరగొట్టేశారు(?)!
ఒకేలా ఉండే ఇద్దరు హీరోలు
ఒకరి ఇంట్లోకి ఇంకొకరు..
ఇలాంటి ఎన్నో సినిమాలకు
అక్కినేని ఇద్దరుమిత్రులు
నందమూరి రామారావు
రాముడు భీముడు…
ఈ రెండు ఓ ట్రెండు..!
నచ్చని రాముడు..
మెచ్చిన భీముడు..
ఎస్వీఆర్..జమున
గందరగోళం..
బాత్రూం భాగవతార్
అంటూ భీముడికి కితాబు
అలక్కాని..
పెద్దాయన ఊతపదం..
డైనింగ్ టేబుల్ వద్ద
ఎన్టీఆర్ వేస్తాం..వేస్తాం..
అంటూ మాంగారింట్లో మకాం!
రాజనాలకి ఎన్టీఆర్
పిలుపు మామా..
ఈ సినిమాలో ఆ ఇద్దరి మధ్య హై డ్రామా..
రామయ్యకు
ఆయనంటే భయం..
భీమయ్యతో
దెబ్బలు ఖాయం..
చివర్లో కితకితలతో
విబేధాలు మాయం!
ఉందిలే..మంచికాలం ముందుముందూనా..
అందరూ సుఖపడాలి
నందానందానా..
అభ్యుదయ గీతంతో
సినిమాకి శ్రీకారం..
దేశమ్ము మారిందోయ్…
కాలమ్ము మారిందోయ్..
మరో అద్భుత గీతం..
మొదటిది శ్రీశ్రీ పిలుపు..
మరొకటి కొసరాజు మెరుపు..
నాగార్జునసాగర్
నిర్మాణ వేదిక…
నాడే ఎన్టీఆర్
ముందు చూపు సూచిక!
అదే..అదే..వింత నేను తెలుసుకున్నది..
ఓ మెలోడీ…
తగునా ఇది మామా..
తమరే ఇటు పల్కనగుట
తగునా ఇది మామా..
రేలంగి…రెడ్డి.. గిరిజ
మధ్య ఓ కామెడీ ట్రాజెడీ..
సరదా సరదా సిగరెట్టు
అది మరీ హిట్టు..!
ధర్మారావు కొడుకు
చాణక్య తాపీ..
ఈ సినిమాతో
రామానాయుడు సో హ్యాపీ
దగ్గుబాటి వారబ్బాయి
నిర్మాణ జైత్రయాత్రకు
పడింది బోణీ..
ఈ సినిమా మొదలు
వరస హిట్లే కారంచేడు సోగ్గాడి బాణీ!
అన్నట్టు..అప్పట్లో కైకాల
ఎన్టీఆర్ షేపు…
ఈ బొమ్మలో
పెద్దాయనకు సత్తెన్నే డూపు!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286