జగన్‌కు వై.ఎస్.షర్మిలారెడ్డి లేఖ
రాష్ట్రంలో మద్య నిషేధంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి మరో ‘‘నవ సందేహాలు’’ పేరుతో లేఖ రాశారు. మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ ఎక్కడ? పాక్షికంగా అయినా అమలు అవుతుందా? మూడు దశల్లో మద్య నిషేధం అన్నారు… నిషేధం అమలు చేశాకే మళ్లీ ఓటు అడుగుతా అన్నారు ఏమైంది? మద్యం అమ్మకాల్లో 20 వేల కోట్ల నుంచి 30 వేల కోట్లకు ఆదాయం పెంచుకున్నారు..అంటే అమ్మకాల్లో అభివృద్ధి చెందినట్లు కాదా? మద్యం ద్వారా ఆదాయం అంటే…ప్రజల రక్తమాంసాలు మీద వ్యాపారం అన్నారు..మరి మీరు చేస్తున్నది ఏంటి? ఎక్కడా దొరకని బ్రాండ్లు ఇక్కడే అమ్ముతూ ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు? బెవరేజేస్ కార్పొరేషన్‌ను చేయూత, ఆసరా, అమ్మఒడి అమలు బాధ్యత అప్పగించడాన్ని ఎలా సమర్థిస్తారు? బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 11 వేల కోట్లు రుణాలు ఎందుకు సేకరించాలని అనుకున్నారు? మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానం ఎందుకు ఉంది? రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు అంటే మీ వైఫల్యం కాదా? వీటికి సమాధానం చెప్పాలని కోరారు.