Suryaa.co.in

Andhra Pradesh

బాలకోటయ్యను వెంటబడి హౌస్ అరెస్టు చేసిన పోలీసులు

గురువారం సాయంత్రం నుంచి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్యను అటు విజయవాడ, ఇటు కంచికచర్ల పోలీసులు వెంబడించారు. రాజధానిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ళ స్థలాల పంపిణీ సభ సందర్భంగా నల్ల జెండాలు, నల్ల బెలూన్లతో నిరసన తెలపాలని బహుజన ఐకాస పిలుపు నివ్వటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయనను రాత్రి ఒంటి గంటకు ఆయన స్వగ్రామమైన కంచికచర్లలో పోలీసులు చక్రబంధం చేశారు.

ప్రజల్ని కట్టడి చేసి సభలు నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం వైకాపా నే అని బాలకోటయ్య మండి పడ్డారు. అమరావతిలో ఆకు కదిలితే ముఖ్యమంత్రి భయపడుతున్నాడని, రాజధాని రైతుల్ని మోసం చేసినట్లే, నివేశనా స్థలాల పేరిట పేదల్ని మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ఆయన కలలు కన్న రాజధాని వినాసనాన్ని కనులారా చూసి ఆనందిస్తున్నట్లు చెప్పారు.

ఆఖరికి వెంకటాయపాలెం లో డ్యూటీ లో ప్రకాశం జిల్లా కు చెందిన పవన్ అనే కానిస్టేబుల్ కట్ల పాము కాటు కు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. రాజధానిలో కంప చెట్లు తొలగించేందుకు, గడ్డి పరక పని చేసేందుకు మనసు రాని ముఖ్యమంత్రి లబ్ధిదారుల పట్ల ప్రేమ చూపటం దుర్మార్గం అని ఆరోపించారు.

LEAVE A RESPONSE