Home » చచ్చినా, బ్రతికినా నాగార్జున సాగర్ కాలువలో గోదావరి నీరు పారించే చస్తా

చచ్చినా, బ్రతికినా నాగార్జున సాగర్ కాలువలో గోదావరి నీరు పారించే చస్తా

– దేవినేని ఉమా

చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తధ్యం.రాజమండ్రిలో జరగబోయే మహానాడు రాబోయే ఎన్నికల సంగ్రామానికి శంఖారావం. కుతంత్రాలతో దేవినేని ఉమాను ఒక్కసారి దెబ్బకొట్ట గలిగారు.. మైలవరం లో మళ్లీ తెలుగుదేశం జెండా ఎగురవేస్తా.4 వేల కోట్లు ఖర్చు పెట్టబడిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పడేశారు. తెదేపా హయంలో పెట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ నాశనం చేశారు.

చేతకాని ఎమ్మేల్యే 1000కోట్లు ఖర్చు పెడితే చింతలపూడి పూర్తి అయ్యేది.చంద్రబాబు ని ముఖ్య మంత్రిగా చేసుకొని చింతలపూడి పూర్తి చేసుకుందాం.పోలవరం డ్యామ్ బ్యారేజ్ చేశాడు.. 150 అడుగుల పోలవరం ఎత్తును 135 అడుగులకి తగ్గించారు.

పనికిమాలిన ఐపాక్ టీం వాళ్ళు వచ్చి చేయాల్సిన దుర్మార్గాలన్ని చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయించారు.ఆంధ్రుల ఆరాధ్య దైవం ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు కి భారతరత్న ఇవ్వాలి.

40 ఏళ్ల యువకుడు యువగళం పేరుతో నాలుగువేల కిలోమీటర్లకు పరుగులు తీస్తున్నాడు. 70 ఏళ్ల వయసులో నవ యువకుడుగా చంద్రబాబు నడుస్తున్నారు.

Leave a Reply