ముందు జాగ్రత్త పడే స్వామివారు మనకి ఆ అవకాశం ఇచ్చి ఉండరు

3

జాతి మత కుల ఛాందస భావాలు మనలో కరడుగట్టిన కారణంగా విశాల ప్రపంచాన్ని విశాలనేత్రాలతో చూడలేక పోతున్నాము. ఒక ముస్లిం కమ్యూనిటీ శ్రీ వేంకటేశ్వర స్వామిని “బావ”గా భావించి కొలవడం, ఈ ముస్లిం యువకుడు పుట్టిన పిల్లలకు స్వామి వారి పేరు పెట్టుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. వీటికి మించి వీరిలో ఉన్న కట్టుబాటు అన్ని వర్గాలకూ మార్గదర్శకం. బీబీ నాంచారమ్మని అక్కగా భావించినందు వల్ల స్వామివారు బావగారు అయ్యారు. మనం పద్మావతీ అమ్మవారిని అమ్మ అనడంవల్ల స్వామి వారు తండ్రి అయ్యారు. ముందు జాగ్రత్త పడే స్వామివారు మనకి ఆ అవకాశం ఇచ్చి ఉండరు. ఎందుకంటే, అక్క బావ అనగానే మనకు మరదలు గుర్తుకొస్తుంది.

– ముద్దు పద్మినీదేవి