రాజ్యాంగ వ్యవస్థల పతనం

19

– ఏ అధో జగత్తు కో ఈ ప్రస్థానం?

4840 Sq.yards ఒక ఎకరానికి! లాండ్ పూలింగ్ కి ఇస్తే 1300 sq.y లాండ్ వస్తుంది.అందులో 1000 sq.y రెసిడెన్షియల్ ఏరియా లో,300 sq.y కమర్షియల్ ఏరియా లో!అలాగే పదేళ్లు ఏడాదికి 30,000 కౌలు వస్తుంది పదేళ్ల పాటు.

ఏడాదికి 2-3 లక్షల ఆదాయం వచ్చే ఎకరం పొలాన్ని ప్రభుత్వానికి ఫ్రీ గా ఇచ్చేసి,1300 గజాలు,30,000 కౌలు ఎవడైనా ఎందుకు తీసుకుంటాడు!?

ఆ 1300 గజాల విలువ తానిచ్చిన ఎకరం పొలం కన్నా ఎక్కువ అవుతుంది అన్న ఆలోచన, ముందు చూపు, ఆశ వుంటేనే కదా!?విలువ పెరగాలంటే అక్కడ ప్రామిస్ చేసిన స్థాయిలో రాజధాని అభివృద్ధి చెయ్యాలి కదా!?ఒప్పందం కూడా అదే కదా!?

అలా చెయ్యకుండా ప్రభుత్వానికి భూములు ఇచ్చేశారు, అవి మీవి కావు అనడం ఏంటి!?
ప్రభుత్వం ఎంత పరిహారం ఇచ్చి కొన్నది ఆ భూములని!?ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు!డెవలప్ చేసిన రిటర్న్ బుల్ ప్లాట్స్ ఇవ్వలేదు!!కొంత మందికి పేపర్ మీద చూపారు తప్ప గ్రౌండింగ్ చెయ్యలేదు!!

హై కోర్ట్ కి వెళ్ళే దారిలో వీధి దీపాలు వెయ్యడానికి 5 నెలలు టైం కోర్ట్ ని అడిగిన ప్రభుత్వం, పది రోజుల్లో యాభై వేల సెంటు ప్లాట్స్ కి 65 కోట్లు వెచ్చించడం ఖచ్చితంగా పేదల మీద ప్రేమ కన్నా రాజధాని రైతుల మీద కసి,పగ, ప్రతీకారం మాత్రమే కనిపిస్తాయి ఎవరికైనా!!

వాళ్ళు ఇచ్చిన, వాళ్ల పొలాల్లో అసెంబ్లీ కట్టి, అందులో బిల్ పాస్ చేయించి, సెక్రటేరియట్ కట్టి అందులో G.O లు తయారు చేసి,వాటిని వాళ్ళు ఇచ్చిన పొలాల్లో కట్టిన హైకోర్ట్ లో ఖరీదైన లాయర్స్ ని పెట్టి అతి తెలివి తో వాదింప చేసి అనుకూలంగా తీర్పు లు తెప్పించుకుని తర తరాల వారసత్వ భూములని పూలింగ్ కి ఇచ్చిన రైతులని అపహాస్యం చేస్తూ…..అధికారంలో వున్న వాళ్ళు ఆడుతున్న వికృతప్రతీకారరాజకీయక్రీడ కి ముగింపు ఎప్పుడో!?ఎక్కడో!?

వ్యక్తులస్థాయిలో విలువల పతనం చూసాం..ఇన్నాళ్లూ!!కానీ అంతకన్నా ఘోరంగా రాజ్యాంగ వ్యవస్థల పతనం చూస్తున్నాం!!ఏ అధొ జగత్తు కో ఈ ప్రస్థానం!!

– శ్రీ