-జమ్మలమడుగు జోష్ అదిరిపోయింది
-జగన్ అప్పుల అప్పారావు…మా చంద్రన్న సంపద సృష్టికర్త.
-జగన్ ది దొబ్బే గుణం…చంద్రన్న ది పెట్టే గుణం
-జగన్ ఆర్టీసీ టికెట్ ధర పెంచితే మీ చంద్రన్న టికెట్ లేకుండా చెయ్యాలని అనుకుంటున్నారు
-పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది
-సోలార్ పార్క్ యాజమాన్యాన్ని బెదిరించి యాక్టర్. సుధీర్ రెడ్డి కమిషన్ వసూలు చేస్తున్నాడు
-అంగన్వాడి పోస్టులు కూడా అమ్ముకున్నాడు యాక్టర్.సుధీర్ రెడ్డి
-లోకేష్ … భూపేష్ జోడీ అదిరిపోయింది కదూ?
-జమ్మలమడుగు బహిరంగ సభలో నారా లోకేష్
పెన్నా నది నీళ్లలోని పౌరుషం జమ్మలమడుగు ప్రజల్లో ఉంటుంది.
నారాపుర వెంకటేశ్వరస్వామి ఆలయం, కన్యకాపరమేశ్వరిదేవి ఆలయం, అంబా భవాని దేవాలయం ఉన్న పుణ్యభూమి జమ్మలమడుగు.
ఘన చరిత్ర ఉన్న గండి కోటని ఎవడూ టచ్ చెయ్యలేకపోయాడు, అలాగే జమ్మలమడుగు ప్రజల్ని టచ్ చేసే దమ్ము కూడా ఎవడికి లేదు.
ఫ్యాక్షన్ ప్రాంతంగా ముద్రపడిన జమ్మలమడుగులో స్వాతంత్య్ర సమరయోధుడు ఎద్దుల. ఈశ్వర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించారు. చేనేత వర్గానికి చెందిన కుండా రామయ్య గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు.
మూడు నదులు, మూడు జిల్లాలకు సెంటర్ జమ్మలమడుగు.
దమ్మున్న నేల జమ్మలమడుగులో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
యువగళం…మనగళం…ప్రజాబలం.
కష్టాలు చూసాను…కనీళ్లు తుడుస్తాను.
యువగళంలో నేను చూసిన ప్రజల కష్టాలను చంద్రన్న దృష్టికి తీసుకెళ్లాను.
మీరు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకొని మహానాడులో భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు మన చంద్రన్న.
మహానాడు మినీ మ్యానిఫెస్టో కే వైసిపి నాయకులు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు.
ఇక పూర్తి మ్యానిఫెస్టో వస్తే వైసిపి దుకాణం బంద్.
హామీలు అన్ని ఎలా అమలు చేస్తారని వైసిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. పేటిఎమ్ డాగ్స్ అన్ని రోడ్ల మీదకి వచ్చి అరుస్తున్నాయి.
జగన్ అప్పుల అప్పారావు…మా చంద్రన్న సంపద సృష్టికర్త.
జగన్ ది దొబ్బే గుణం…చంద్రన్న ది పెట్టే గుణం.
జగన్ మోసగాడు…చంద్రన్న మొనగాడు.
ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయని మోసగాడు జగన్. అందుకే పేరు మార్చి మోసగాడు జగన్ అని పేరు పెట్టాను.
మోసగాడు జగన్ మహిళల్ని నమ్మించి ముంచేసాడు.
సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. నిషేదం లేకపోగా బూమ్ బూమ్, గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్ లాంటి జే బ్రాండ్లు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు.
మీ కష్టాలు తెలుసుకున్న తరువాత మీ అన్న చంద్రన్న మహాశక్తి పథకం కింద పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు.
మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ ఆర్టీసీ టికెట్ ధర పెంచితే మీ చంద్రన్న టికెట్ లేకుండా చెయ్యాలని అనుకుంటున్నారు.
మోసగాడు జగన్ యువత ఎప్పటికీ పేదరికంలో ఉండాలని కోరుకుంటున్నాడు.
జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.
యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
మోసగాడు జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు.
నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జగన్ పాలనలో ఏపీ రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2 లో ఉంది.
పుండు మీద కారం జల్లినట్టు రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు.
రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి.
మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు.
రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.
మోసగాడు జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. టీచర్లను మద్యం దుకాణాల ముందు నిలబెట్టి అవమానించాడు.
వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు.
పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.
పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.
మోసగాడు జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నాడు.
నేను పేదవాడ్ని అంటూ ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్ పెడుతున్నాడు.
లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా?
బెంగుళూరులో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నవాడు పేదవాడా?
సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నవాడు పేదవాడా?
పేదలు పడుతున్న బాధలు యువగళం లో చూసాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదాయాన్ని రెట్టింపు చేసి పేదరికం లేని రాష్ట్రం చేస్తాం.
మోసగాడు జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా.
మోసగాడు జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్.
బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది.
అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. మోసగాడు జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి.
మోసగాడు జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను.
అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్.
100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ మోసగాడు జగన్.
మోసగాడు జగన్ ఏకంగా సొంత బాబాయ్ నే లేపేసాడు.
ఇప్పుడు సీబీఐ మోసగాడు జగన్ అండ్ కో బండారం బయటపెట్టింది.
రహస్య సాక్ష్యం తో వణికిపోయి జగన్ ఢిల్లీ పరిగెత్తాడు.
బాబాయ్ మర్డర్ కేసు లో అరెస్ట్ కాకుండా కాపాడాలని ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నాడు అంట.
ఎన్ని కాళ్లు పట్టుకున్నా బాబాయ్ ఆత్మ నిన్ను వెంటాడుతుంది మోసగాడు జగన్.
బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు మోసగాడు జగన్.
పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు.
బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. బీసీల కష్టాలు తెలుసుకున్నాం. అందుకే బీసీల భద్రత కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం.
బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం.
మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం.అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం.
దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం.
మోసగాడు జగన్ దళిత ద్రోహి.
డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది.
ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు.
ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికి శిక్ష పడిందా?
సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు.
వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు.
దళితులకు ఇవ్వాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసాడు జగన్. టిడిపి గెలిచిన వెంటనే దళితుల 27 సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం.
మైనారిటీలను మోసం చేసాడు మోసగాడు జగన్.
దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు.
మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు.
ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు.
మోసగాడు జగన్ సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకూ దోషులకు శిక్షపడలేదు.
నంద్యాల లో ఆర్టీఓ వేధింపులు తట్టుకోలేక కరిముల్లా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.ముగ్గురు పిల్లలతో కరిముల్లా భార్య పడుతున్న బాధలు జగన్ కి కనపడవు. ఇప్పటి వరకూ దోషులకు శిక్ష పడలేదు.
ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు.
పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లి బేగంబీ కి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. ఇప్పటికీ ఆ తల్లికి న్యాయం జరగలేదు.
ఈ కుటుంబాలకు న్యాయం చెయ్యాలి అని పోరాటం చేసింది టీడీపీ.
టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిని అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల సంక్షేమం కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.
రెడ్డి సోదరులు కూడా ఆలోచించండి. మీరు కోట్లు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు.
మీకు ఇప్పుడు వైసిపి లో కనీస గౌరవం దక్కుతుందా. ఒక్క టిడిపి లోనే అందరికి గౌరవం దక్కుతుంది.
2019 ఎన్నికల్లో జమ్మలమడుగు జాతకం మార్చేస్తాడు అని భారీ మెజారిటీ తో మూలె. సుధీర్ రెడ్డి గారిని గెలిపించారు.
సుధీర్ రెడ్డి గారి జాతకం మారింది కానీ జమ్మలమడుగు జాతకం మారలేదు.
సుధీర్ రెడ్డి ఉదయం రెండు సూట్ కేసులతో బయటకి వెళ్తాడు. ఒకటి ఖాళీ సూట్ కేసు, రెండోవది బీర్ కేసు. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి బీర్ కేసు ఖాళీ అవుతుంది, సూట్ కేసు ఫుల్ అవుతుంది.
ఎన్నికల ముందు వేసుకున్న చొక్కా, బనియన్ నాది కాదు, నేను ఒక చిన్న డాక్టర్ ని అని చెప్పిన సుధీర్ రెడ్డి మాట మార్చాడు. ఇప్పుడు మాది జమిందారీ కుటుంబం అంటున్నాడు. ఇన్ని కోట్ల ఆస్తి సడన్ గా ఎలా వచ్చింది.
బాబాయ్ మర్డర్ కేసులో నిందితులకు డబ్బులు ఇవ్వడం దగ్గర నుండి ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, పరిశ్రమల నుండి నెలనెలా కమిషన్, వెంచర్లు వేసే వారి దగ్గర కమిషన్లు, ఉద్యోగస్తుల ట్రాన్సఫర్లలో కమిషన్, ఆఖరికి చీప్ గా చికెన్ షాపులు, మినరల్ వాటర్ ప్లాంట్ల దగ్గర కూడా కమిషన్లు.
సుధీర్ రెడ్డి చరిత్ర తెలుసుకున్న తరువాత ఆయన పేరు మార్చాను. ఆయన డాక్టర్. సుధీర్ రెడ్డి కాదు యాక్టర్. సుధీర్ రెడ్డి.
ఎన్నికల్లో అయిన ఖర్చు మొదటి నెలలోనే నియోజకవర్గంలో ఉన్న సిమెంట్, సోలార్ కంపెనీల నుండి వసూలు చేసాడు యాక్టర్. సుధీర్ రెడ్డి.
మున్సిపల్ వర్క్స్ అన్ని యాక్టర్ సుధీర్ తన బినామీలకు ఇప్పించుకొని భారీగా ప్రజాధనం లూటీ చేస్తున్నాడు.
నియోజకవర్గంలోని క్వారీలు, గ్రానైట్ పరిశ్రమల నుండి ప్రతి నెలా కప్పం కట్టించుకుంటున్నాడు యాక్టర్. సుధీర్ రెడ్డి.
మైలవరం మండలంలోని సోలార్ పార్క్ యాజమాన్యాన్ని బెదిరించి యాక్టర్. సుధీర్ రెడ్డి కమిషన్ వసూలు చేస్తున్నాడు.
అంగన్వాడి పోస్టులు కూడా అమ్ముకున్నాడు యాక్టర్.సుధీర్ రెడ్డి.
యాక్టర్.సుధీర్ రెడ్డి దోపిడీ డిఫరెంట్ ఏకంగా లంచాన్ని అకౌంట్ లో ట్రాన్స్ ఫర్ చేయించుకున్న ఘనుడు.
యాక్టర్.సుధీర్ రెడ్డి దోపిడీకి భయపడి ఎన్నో కంపెనీలు పారిపోయాయి.
సోలార్ ఎనర్జీకి సంబంధించి స్ప్రింగ్ ఎనర్జీ కంపెనీ, అయానా కంపెనీ, సాఫ్ట్ బ్యాంక్ కంపెనీ.
గండికోట అడిషనల్ లిఫ్ట్ ప్రాజెక్టు నిర్మించే కంపెనీ పారిపోయింది.
గండికోట టూరిజం రోప్ వే ప్రాజెక్ట్ ఏర్పాటు చెయ్యాల్సిన కంపెనీ పారిపోయింది.
నియోజకవర్గంలో పెన్నా నది ఇసుక, గ్రావెల్, ఫ్లైయాష్ ని దోపిడీ చేస్తున్నారు. యాక్టర్.సుధీర్ రెడ్డి ఎంత కక్కుర్తి వాడంటే ఆఖరికి ట్రాన్స్ పోర్ట్ కి వాడే టిప్పర్లు కూడా ఆయనవే వాడాలి అంట.
చికెన్ షాపులు, మినరల్ వాటర్ ప్లాంట్లు నిర్వహించే వాళ్లు కూడా యాక్టర్.సుధీర్ రెడ్డికి కప్పం కట్టాలట.
పేదలు, అనాధల కోసం ఏర్పాటు చేసిన నైట్ సెంటర్ ఆశ్రమంలో ఒక్కరికి కూడా భోజనం పెట్టకుండా లక్షల్లో బిల్లులు డ్రా చేసుకుంటున్నారు యాక్టర్.సుధీర్ రెడ్డి, ఆయన అనుచరులు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు యాక్టర్.సుధీర్ రెడ్డి.
నియోజకవర్గంలో మట్కా, క్రికెట్ బెట్టింగ్ నడిపిస్తుంది ఎవరు? యాక్టర్.సుధీర్ రెడ్డి అనుచరులు.
బాబాయ్ హత్య కేసులో నిందితులకు డబ్బులు, షెల్టర్ యాక్టర్.సుధీర్ రెడ్డి ఇచ్చినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి.
జమ్మలమడుగు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు జగన్ అనేక హామీలు ఇచ్చాడు.
గండికోట రిజర్వాయర్ బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానని హామీ ఇచ్చాడు. మౌలికవసతులు కల్పిస్తానని హామీ ఇచ్చి మోసం చేసాడు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పునరావాస కాలనీల్లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి పక్కాగా అమలు చేస్తాం. సిసి రోడ్లు, గుడి,బడి, త్రాగునీరు, కుటీర పరిశ్రమలు, పాడి పరిశ్రమ ఇలా అన్ని వసతులు కల్పిస్తాం.
ప్రభుత్వం వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ కడతానని హామీ ఇచ్చాడు. రెండు సార్లు శంకుస్థాపన చేసాడే తప్ప పని ముందుకు సాగడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తాం.
ఆర్టిపిపి లో కార్మికులను రెగ్యూలరైజ్ చేస్తామని హామీ ఇచ్చాడు. జీతాలు పెంచుతాం అని హామీ ఇచ్చాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తాం.
జమ్మలమడుగులో పుట్టా, మా నాన్న ఇక్కడే డాక్టర్ గా పనిచేసారు, పులివెందులకు ధీటుగా జమ్మలమడుగుని అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చి గుండు సున్నా చేసాడు. పులివెందుల లో బస్ స్టాండ్ కట్టలేని వాడు జమ్మలమడుగుని ఎం అభివృద్ధి చేస్తాడు.
రాజోలు ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ గాల్లో కలిసిపోయింది.
మైలవరంలోని టెక్స్ టైల్స్ పార్క్ ని తెరిపిస్తానని హామీ ఇచ్చి మోసం చేసాడు.
అధికారంలోకి వచ్చిన వెంటనే శనగ రైతులను ఆదుకుంటాం అని హామీ ఇచ్చాడు. క్వింటాకి రూ.6500 ఇచ్చి ప్రతి గింజా కొంటాం అని చెప్పి మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శనగ రైతుల్ని ఆదుకుంటాం, పత్తి, మిరప రైతులకు పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర ఇస్తాం.
జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. గ్రామాల్లో సిసి.రోడ్లు, పేదలకు టిడ్కో ఇళ్లు, తాగు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది టిడిపి. పెద్ద ఎత్తున పరిశ్రమలు తెచ్చింది టిడిపి.
పేదల కోసం 1500 ఇళ్లు కడితే మిగిలిన 10 శాతం పనులు పూర్తిచేసి లబ్ది దారులకు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం జగన్ ది. టిడిపి గెలిచిన వెంటనే టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు ఇస్తాం.
మైలవరం లో మెగా సోలార్ పార్క్ తెచ్చింది టిడిపి.
గండికోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది టిడిపి.
కొండాపురం మండలంలోని గండికోట పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించింది టిడిపి.
సంకేపల్లి బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించింది టిడిపి. ఆ పనులు నిలిపేసింది వైసిపి.
ఎర్రగుంట్ల లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం, అభివృద్ధి కోసం టిడిపి హయాంలో 109 కోట్లు మంజూరు చేస్తే ఆ పనులు నిలిపేసింది వైసిపి ప్రభుత్వం.
ముద్దనూరు లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల కోసం నిధులు కేటాయిస్తే ఆ పనులు ఆపేసారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తాం.
సిమెంట్ కంపెనీలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం.
చేనేత పై జీఎస్టీ భారం లేకుండా చేస్తాం. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. గతంలో ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం.
రాజోలి ఆనకట్ట ముంపు బాధితులకు న్యాయం చేస్తాం.
యువగళం లో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలు చూసాను. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత వాటర్ గ్రిడ్ పధకం ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం.
మోసగాడు జగన్ అమ్మ ని బయటకు గెంటేసాడు.. అమ్మ లాంటి కడప జిల్లాని మోసం చేసాడు.
సాగునీటి ప్రాజక్టులు, పరిశ్రమలు తీసుకొచ్చి ఉమ్మడి కడప జిల్లాని అభివృద్ధి చేసింది టిడిపి. పులివెందులకు నీళ్లు ఇచ్చిన దమ్మున్న నాయకుడు మన చంద్రన్న.
కానీ మీరు ఏమి చేసారు పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చారు.
2019 ఎన్నికల్లో అన్ని సీట్లు వైసిపి కి ఇచ్చారు. జగన్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
ఉన్న ప్రాజెక్టులు నాశనం చేసాడు. జగన్ నిర్లక్ష్యం వలనే అన్నమయ్య ప్రాజక్టు కొట్టుకుపోయింది
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను ఆదుకోలేని చెత్త సీఎం జగన్.
కడప జిల్లా ప్రజలు ఆలోచించాలి అని కోరుతున్నా. టిడిపి కి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం.
టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించారు, కొంత మందిని దారుణంగా చంపారు. ఇబ్బంది పెట్టిన వాళ్లు కడప లో ఉన్నా కంబోడియా పారిపోయినా వదిలిపెట్టను. పట్టుకొచ్చి లోపలేస్తా.
కడప జిల్లా లోకి అడుగుపెట్టకముందే వైసిపి నాయకులు నన్ను అడ్డుకుంటాం అని సవాల్ చేశారు.
వారికి ఒకటే చెబుతున్నా భయం నా బయోడేటా లో లేదు.
సహకరిస్తే పాదయాత్ర…అడ్డుకుంటే దండయాత్ర.