Suryaa.co.in

Telangana

ల్యాండ్ పార్సెల్ కు మస్తు డిమాండ్

-మూడు జిల్లాల్లో అమ్మకానికి 34 ల్యాండ్ పార్సెల్స్
-మంగళవారం రంగారెడ్డి జిల్లా 16 ల్యాండ్ పార్సెల్స్ ప్రీ బిడ్ సమావేశానికి మంచి స్పందన
-బుధవారం నాడు 8 ల్యాండ్ పార్సిల్స్ పై మేడ్చల్ కలెక్టరేట్ లో జరుగనున్న ప్రీ బిడ్ మీటింగ్
-గురువారం సంగారెడ్డి జిల్లా లోని 10 ల్యాండ్ పార్సెల్స్ పై గీతం యూనివర్సిటీలో ప్రీ బిడ్ సమావేశం

హైదరాబాద్ : రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 34 ల్యాండ్ పార్సెల్ (స్ట్రే బిట్స్) కు మంచి డిమాండ్ నెలకొంది.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి రంగారెడ్డి జిల్లాలోని ఆరు(6) మండలాల పరిధిలోని 16 ల్యాండ్ పార్సెల్స్, సంగారెడ్డి జిల్లాలోని మూడు(3) మండలాల పరిధిలోని 10 ల్యాండ్ పార్సెల్స్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నాలుగు(4) మండలాల పరిధిలోని 8 ల్యాండ్ పార్సెల్ ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఈ నెల 22వ తేదీన ఆన్ లైన్ వేలం(ఈ-అక్షన్) ద్వారా విక్రయించనున్నది. ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిధిలోని 16 ల్యాండ్ పార్సిల్స్ అమ్మకాలపై హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో బేగంపేట్ టూరిజం ప్లాజా హోటల్ లో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి మంచి ఆదరణ లభించింది.

హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ (ఈఓ) బి.కిషన్ రావు ప్రీ బిడ్ మీటింగ్ కు హాజరైన బిడర్లు, డెవలపర్లకు ల్యాండ్ పార్సెల్స్(స్ట్రే బిట్స్) విక్రయానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ప్రతినిధి అనురాగ్ ఆన్ లైన్ వేలం పద్ధతులను, నియమ నిబంధనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు.

వేలం ద్వారా కొనుగోలు చేసిన ల్యాండ్ పార్సిల్స్ కు వారి ఆర్థిక అంశాలకు లోబడి రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్యాంకర్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ప్రీ బిడ్ సమావేశంలో ల్యాండ్ పార్సెల్స్ పై ఔత్సాహిక వేత్తలు అడిగిన ప్రశ్నలకు హెచ్ఎండిఏ ప్లానింగ్, ఇంజనీరింగ్, అకౌంట్స్ అధికారులు సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు.

LEAVE A RESPONSE