-కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు
-కమిషన్ల కోసమే ప్రాజెక్టు నిర్మాణాలు
-తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత
మహిళా సమస్యలు పరిష్కరించలేని కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు క్షమాపణ చెప్పాలి. రాజధాని నగరం, పరిసర ప్రాంతాల్లో కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మహిళలకు చంపి డ్రైనేజీలో వేస్తున్నారు. పట్టపగలు ఉన్మాదులు కత్తులతో చంపుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలో తెలంగాణ లో మళ్లీ టీడీపీ ఎగురవేడం ఖాయం.
10 సంవత్సరాల తెలంగాణ లో ఎంత మంది సంతోషంగా ఉన్నారు? కేసీఆర్ కుటుంబం కోసం సంబరాలు చేసుకుంటున్నారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారి గురించి పట్టించుకున్నారా?కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుంటోంది. చంద్రబాబు చేసిన అభివృద్ధి మాత్రమే హైదరాబాద్ లో కనిపిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం మహిళలు ఏమి చేసింది?
గురుకుల పాఠశాలలో బాలికల పరిస్థితి అద్వాన్నంగా ఉంది.తెలంగాణ ప్రజల గురించి ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కొలగొట్టడం, కట్టడం తప్ప ఏమి చేయలేదు.. ఏమి చేసినా కేసీఆర్ కుటుంబం కోసం చేసుకున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసం కట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బిఅరెస్ కు తగిన బుద్ధి చెబుతారు.