Suryaa.co.in

Andhra Pradesh

స్మార్ట్ మీటర్ల ముసుగులో జగన్ ప్రభుత్వ భారీ దోపిడీ

– మీటర్ల వ్యవహారంలో ఎలాంటి దోపిడీలేకపోతే, టెండర్ వివరాల్ని ప్రభుత్వం ఎందుకు ప్రజలముందు ఉంచడంలేదు?
• మూడురోజుల్లో జగన్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల టెండర్ల వివరాల్ని ప్రజల ముందు ఉంచాలి లేకపోతే వేలకోట్ల దోపిడీ నిజమేనని అంగీకరించాలి
• దేశమంతా స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తుంటే, జగన్ మాత్రం రూ.5వేలకోట్ల అప్పుకోసం రైతులమెడలకు ఉరితాళ్లు బిగించడానికి సిద్ధమయ్యాడు
• రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ రూ.4,800కోట్లు, గృహాలకు మీటర్లు బిగించి రూ.4వేలకోట్లు కొట్టేయడానికి ప్రణాళికలు వేశాడు
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి

స్మార్ట్ మీటర్లపేరుతో భారతదేశంలో ఎక్కడాలేనివిధంగా జగన్ ప్రభుత్వం పెద్ద కుంభకోణానికి తెరలేపిందని, పాలనలో పారదర్శకత, నిజాయితీ ఉండాలని పైకి చెప్పే ముఖ్యమంత్రి, రైతులమోటార్లకు, గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించే నెపంతో వేలకోట్లు కొట్టేయడానికి సిద్ధమయ్యాడని, దేశమంతా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకి స్తుంటే, వాటివల్ల మేలుజరుగుతుందని జగన్, అతనిప్రభుత్వంచెప్పడం సిగ్గుచేట ని టీడీపీ జాతీయఅధికారప్రతినిది జీ.వీ.రెడ్డి స్పష్టంచేశారు.
తన నివాసం నుంచి శనివారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …

“ బీజేపీపాలిత రాష్ట్రాలుకూడా నిర్మొహమాటంగా వ్యతిరేకించిన స్మార్ట్ మీటర్లు జగన్ కు ఎందుకు ముద్దుఅయ్యాయి? వ్యవసాయమోటార్లకు మీటర్లు పెడతాన ని చెప్పి, కేంద్రప్రభుత్వ అనుమతితో జగన్ ప్రభుత్వం రూ.5వేలకోట్ల అప్పుతెచ్చి ఆసొమ్ముని ఇష్టానుసారం దుబారాచేసింది. కేంద్రఒత్తిడితో ఇప్పుడు గత్యంతరం లేక రైతులు వినియోగించే విద్యుత్ కు లెక్కకట్టడానికి మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు.

రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వమే బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తుందని మాయమాటలుచెబుతూ, రైతుల్ని ఒప్పించేప్రయత్నాలు చేస్తు న్నారు. కానీ జగన్ ప్రభుత్వం చేస్తున్న కుట్రఏమిటంటే, రైతులకు ఉచితవిద్యుత్ లేకుండా చేయండం. దానికోసమే వ్యవసాయమోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి సిద్ధమయ్యారు.

రాష్ట్రంలోని వ్యవసాయమోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి అయ్యేఖర్చు రూ.2వేలకోట్లు, ప్రభుత్వం షిరిడీసాయి సంస్థ కోసం నిర్ణయించిన ధర రూ.6,800కోట్లు, మిగిలిన రూ.4,800కోట్లు జగన్ ఖజానాకి వెళ్తున్నాయా?
రాష్ట్రవ్యాప్తంగా 18,58,000 వ్యవసాయమోటార్లు ఉన్నాయి. వాటన్నింటికీ స్మార్ట్ మీటర్లు బిగించడంకోసం ప్రభుత్వం టెండర్లుపిలిచింది. టెండర్లలో ఎవరైతేఎక్కువ బిడ్ వేస్తారో వారికి టెండర్ కట్టబెడతారు? కానీ ఈ వ్యవహారంలో ఎల్ -1, ఎల్-2 ఎవరోతేల్చకుండా, పూర్తివివరాలు ప్రజలముందు ఉంచకుండా, ప్రభుత్వం ఏకప క్షంగా రూ.6,800కోట్లతో కడపకు చెందిన విశ్వేశ్వరెడ్డి సంస్థఅయిన షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు టెండర్లు ఖరారుచేశారు. ఆసంస్థ సామర్థ్యం, గతానుభవం ఏవీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

18,58,000 మీటర్లకు రూ.6,800కోట్లతో టెండర్ ఖరారుచేసిన ప్రభుత్వం ఒక్కోస్మార్ట్ మీటర్ ఖరీదు, మరియు నిర్వహణకు కలిపి రూ.37వేలధర నిర్ణయించింది. విద్యుత్ వాడకాన్ని లెక్కించే మీటర్ ధర ఎక్కడై నా ఇంతఉంటుందా? ఇదే మీటర్లధరను అనేకరాష్ట్రాలు రూ.10వేలు, అంతకంటే తక్కువకే నిర్ధారించాయి.

ఉత్తరప్రదేశ్ లో స్మార్ట్ మీటర్లు బిగించడానికి అదానీ సంస్థ టెండర్లువేసి ఒక్కో మీటర్ ధరను రూ.10వేలుగా కోట్ చేసింది. ఎక్కడ రూ.10వేలు..ఎక్కడ రూ.37వేలు? ఇంతవ్యత్యాసంతో ధరలునిర్ణయించి, రైతుల్ని గృహవినియోగదారుల్ని దోచుకోవడానికే జగన్ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఒక్కోమీటర్ ధర రూ.10వేలలెక్కన వేసినా రాష్ట్రంలోని వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే మొత్తంగా అయ్యేఖర్చు రూ.2వేలకోట్లు మాత్రమే. మరి ఈప్రభుత్వం రూ.6,800 కోట్లుగా టెండర్లు ఎందుకుఖరారుచేసింది? మిగిలిన రూ.4,800కోట్లు ముఖ్యమంత్రి ఖజానాకి వెళ్తున్నాయా..లేక ప్రభుత్వపెద్దల జేబుల్లోకి వెళ్తున్నాయా?

ప్రతిటెండర్ పై తమప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూ నిర్వహిస్తుందని చెబుతున్న ముఖ్యమంత్రి స్మార్ట్ మీటర్లటెండర్లలో ఆపనిఎందుకు చేయలేదు? ప్రివ్యూ నిర్వహిస్తే ఆ వివరాలుఎందుకు బయటపెట్టలేదు?
రైతుల మోటార్లకు మీటర్లుపెట్టడమే పెద్దతప్పుఅయితే, దానిలోకూడా మరలా వారికే శఠగోపంపెట్టేలా ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. ప్రభుత్వం రైతులకు గృహవినియోగదారులకు నిజంగా మేలుచేస్తే స్మార్ట్ మీటర్ల టెండర్ల వివరాల్ని ఎం దుకు బహిర్గతంచేయడంలేదు? ప్రతి టెండర్ పై జ్యుడీషియల్ రివ్యూ చేయిస్తామ న్న ముఖ్యమంత్రి, స్మార్ట్ మీటర్లటెండర్లపై ఎందుకు ఆ పనిచేయించలేదు? ఎల్-1 , ఎల్-2గా ఏసంస్థలు నిలిచాయో, ఏసంస్థ ఎంతధర కోట్ చేసిందనే వివరాల్ని ఎందుకు బయటపెట్టరు? ఇవేవీ చెప్పకుండా ప్రజలసొమ్ముని నేరుగా కొట్టేస్తారా?

పోలవరంవిషయంలో రివర్స్ టెండర్లు వేసి, ప్రభుత్వసొమ్ము మిగిల్చామంటున్న పెద్దలు, స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో ఎందుకు రివర్స్ టెండర్లు పిలవరు? ప్రతిప క్షాలు, ప్రజలుభావిస్తున్నట్టు స్మార్ట్ మీటర్ ధర, నిర్వహణకు రూ.37వేలుకాదు, అన్నిరాష్ట్రాలమాదిరే రూ.10వేలుఅంతకంటే తక్కువే అవుతుందని ముఖ్యమంత్రి ఎందుకు చెప్పరు? మేంలేవనెత్తే సందేహాలపై మీడియాముందుకొచ్చి ఎందుకు వాస్తవాలుచెప్పరు?

స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై పూర్తివాస్తవాలతో ప్రభుత్వం ఎం దుకు శ్వేతపత్రం విడుదలచేయదు? స్మార్ట్ మీటర్ల టెండర్లు రద్దుచేసి, మరలా టెండర్లుపిలిస్తే ఒక్కో మీటర్ని రూ.10వేలు, అంతకంటే తక్కువకే ఇవ్వడానికి చాలాసంస్థలు సిద్ధంగాఉన్నాయి.

గృహాలకు బిగించే స్మార్ట్ మీటర్లలో రూ.4వేలకోట్ల దోపిడీ.. స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ యజమాని విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రికి బంధువు
గృహవినియోగదారుల స్మార్ట్ మీటర్లకు సంబంధించి ప్రభుత్వం రూ.9వేలకోట్లకు టెండర్లు పిలిచింది, వాటిలో రూ.4వేలకోట్లవరకు ప్రభుత్వం కొట్టేయనుంది. గృహ వినియోగదారులనుంచి ప్రతినెలా రూ.130వరకు కాజేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే 8సార్లు విద్యుత్ ఛార్జీలుపెంచినప్రభుత్వం, మరలా ఒక్కోగృహవినియోగ దారుడినుంచి అదనంగా నెలకు రూ.130వసూలుచేయడం దారుణం కాదా?

స్మార్ట్ మీటర్ల టెండర్లు కట్టబెట్టిన షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ యజమాని విశ్వే శ్వర్ రెడ్డి ముఖ్యమంత్రికి బంధువు. అతనితో తనకుఎలాంటి బంధుత్వంలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? బంధువులకు మేలుచేయడంకోసం స్మార్ట్ మీటర్లపేరుతో ప్రజల్ని రాబందుల్లా దోచుకుంటారా? మేం చెప్పిందంతా అబద్ధమ ని ప్రభుత్వంభావిస్తే, తక్షణమే స్మార్ట్ మీటర్ల టెండర్లు, ఇతరవివరాల్ని 3 రోజుల్లో ప్రజల ముందుఉంచాలి.” అని జీ.వీ.రెడ్డి డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE