బీజేపీ జాతీయ సంఘటనా మహామంత్రి బీఎల్ సంతోష్జీని, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని మర్యాద పూర్వకంగా కలిశారు. వీరిద్దరి భేటీలో ఏపీ రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగింది. ఇప్పటికే జగన్ సర్కారు అక్రమాలపై చార్జిషీట్ వేసిన బీజేపీ, తాజాగా వైసీపీ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దా, హోంమంత్రి అమిత్షా పర్యటనలో జగన్ పాలనపై మాటలదాడి చేసిన తర్వాత, రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. జాతీయ నాయకత్వం ఆదేశాలతో త్వరలో, మరిన్ని ఆందోళనా కార్యక్రమాలకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఎల్-సుజనా భేటీ ఆసక్తికలిగిస్తోంది. రాష్ట్ర రాజకీయాలు, వైసీపీ పాలన, ఏపీలో బీజేపీ బలోపేతం వంటి అంశాలపై వారిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వం ఏపీ బీజేపీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోందన్న వార్తల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి సహజంగానే ప్రాధాన్యం ఏర్పడింది.