– దళితులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ముందు క్షమాపణలు చెప్పండి
– దళిత మహిళను బూటుకాలితో తొక్కిన అచ్చెన్నను చెప్పుతో కొట్టి మాట్లాడండి.
– కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
– దళితులకు కనీసం క్షమాపణలు చెప్పకుండా తిరగడానికి సిగ్గుండాలి
– మంత్రి ఆదిమూలపు సురేష్
రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:
కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య:
– ఉన్నట్లుండి టీడీపీ నేతలకు, చంద్రబాబుకు కులాల సమావేశాలు ఎందుకు గుర్తొచ్చాయని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
– చంద్రబాబుకు తన వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు ఎన్నడూ పట్టవు.
– ఇప్పటికిప్పుడు ఆయనకు కులాల ప్రస్థావన గుర్తుకువస్తోందంటే ఎన్నికల కోసమే అనేది సుస్పష్టం.
– కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.
– దళిత పేదవర్గాలను చిన్నచూపు చూసి, వారిని వాడుకుని వదిలేసిన వ్యక్తి చంద్రబాబు.
– ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు ఆయనకు అట్టడుగు వర్గాలపై ప్రేమ పుట్టుకొస్తుంది.
– టీడీపీ వారికి దళితుల పట్ల ఉన్న అభిప్రాయం ఎలాంటిదో గతంలో వారు మాట్లాడిన మాటలే నిదర్శనం.
– కానీ వారికి మాత్రం సిగ్గనిపించడం లేదు. గతంలో వారు మాట్లాడిన మాటలు ప్రజలు మర్చిపోలేదు.
– డప్పు పట్టుకుని మాదిగ సామాజికవర్గాన్ని మేలుకొల్పాలని ఆత్మీయ సమ్మేళనం పెట్టి మాట్లాడుతున్న వారు.. గతంలో మాదిగలపై ఏం మాట్లాడారో గుర్తుకు చేసుకోవాలి.
దళితులకు కనీసం క్షమాపణలు చెప్పకుండా తిరగడానికి సిగ్గుండాలి:
– చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని మాట్లాడాడు.
– అప్పటి చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులు సరిగ్గా చదవరు.. శుభ్రంగా ఉండరని మాట్లాడారు.
– మీకెందుకురా పిచ్చోళ్లారా రాజకీయాలు..రాజకీయాలు పదవులు మా కోసం అంటూ చింతమనేని ప్రభాకర్ మాట్లాడింది వాస్తవం కాదా..?
– నిన్న డప్పు కొట్టిన వర్లరామయ్య మాదిగ నాకొడుకులకు చదువురాదు అంటూ గతంలో మాట్లాడాడు.
– ఒక దళిత మహిళ గొంతుమీద బూట్ కాలు పెట్టి తొక్కి అవమానపరిచిన అచ్చెన్నాయుడు ఈ రోజు దళితులంటూ డప్పు కొట్టడం విడ్డూరంగా ఉంది.
– ఇలాంటి దళిత ద్రోహులంతా నేడు మా నాయకుడిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.
– మీరు మాట్లాడిన మాటలకు కనీసం క్షమాపణ చెప్పకుండా రాష్ట్రంలో తిరుగుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలో అర్ధం కావడం లేదు.
– దళితులను రెచ్చగొట్టే విధంగా మాదిగలు, మాలల సమావేశాలు పెట్టడానికి మీకు సిగ్గనిపించడం లేదా..?
మీరు దళితులను అవమానిస్తే..జగన్ గారు అందలం ఎక్కించారు:
– మీరు దళితులను అసహ్యించుకుంటే మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్ వారిని అక్కున చేర్చుకుని అందలం ఎక్కించారు.
– జగనన్న మా మాదిగలకు పదవుల్లో అగ్ర పీఠం, పథకాల్లో అగ్రస్థానం ఇచ్చారు.
– డప్పు కళాకారులకు, చర్మకళాకారులకు పింఛన్ మేమిచ్చాం అని చెప్పుకుంటున్నారు.
– మీరు చెప్పే మాటల్లో వాస్తవాలెంతో ప్రజలంతా గమనించాలి.
– 2018 జూన్‌లో అంటే ఎన్నికలు మరో ఆరు నెలలు ఉండగా డప్పు కళాకారులకు పింఛన్ కోసం జీవో ఇచ్చారు.
– దాన్ని జనవరి 2019 నాడు అంటే ఎన్నికలు మూడు నెలల ముందు అమలు చేయడం మొదలు పెట్టారు.
– కేవలం 6600 మందికి రూ.1500 చొప్పున ఎన్నికల ముందు మూడు నెలలు ఇచ్చారు.
– వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019–20లో ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున 31వేల మందికి ఇచ్చాం.
– 2020–21లో 43 వేల మందికి, 2021–22లో 49 వేల మంది, 2022–23లో 56 వేల మందికి అందిస్తున్నాం.
– మీరిచ్చిన 6 వేల పింఛన్లు ఎక్కడ..? మేమీరోజు ఇస్తున్న 56 వేల పింఛన్లు ఎక్కడ..?
– మీరిచ్చిన రూ.1500 ఎక్కడ..? మేమిచ్చే రూ.3000 ఎక్కడ..?
– మీరు ఆ మూడు నెలల్లో కేవలం రూ.30 కోట్లు ఇస్తే..మేం ఏటా దాదాపు రూ.150 కోట్లు ఇస్తున్నాం.
– చర్మకారుల విషయానికి వస్తే 2018 నవంబర్‌లో ప్రవేశపెట్టారు. రూ. 1000 చొప్పున 6వేల మందికి ఇవ్వాలని జీవో నెంబర్ 191 ఇచ్చారు.
– ఇది కూడా ఎన్నికలకు మూడు నెలలు మందు అమలు చేసి మూన్నాళ్ల ముచ్చట చేశారు.
– వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్మకారుల పింఛన్ రూ. 2వేలు చేశాం.
– 2019–20లో 21 వేల మందికి, 2020–21లో 31,280 మంది, 21–22లో 35వేల మంది, 22–23లో 40వేల మందికి, 23–24లో 41 వేల మందికి ఇస్తున్నాం.
– వృద్ధాప్య పింఛన్‌ను ఏ విధంగా పెంచుకుంటూ వెళ్తున్నామో ఈ చర్మకారుల ఫించన్‌ను కూడా పెంచుతూనే ఉన్నాం.
– ప్రస్తుతం చర్మకారులు రూ. 2750 పింఛన్ పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది కూడా రూ.3వేలు అవుతుంది.
– ఈ పింఛన్ల కోసం 19–20లో రూ38 కోట్లు, 20–21లో రూ. 67 కోట్లు, 21–22లో రూ. 85 కోట్లు, 22–23లో రూ.119 కోట్లు ఇచ్చాం.
– ఇప్పటి వరకూ డప్పు కళాకారులకు రూ.600 కోట్లు, చర్మకారులకు రూ. 350 కోట్లు పింఛన్ కోసం ఇచ్చాం.
– మీరిచ్చిన దానికి మేం పదిరెట్లు ఎక్కువగా ఇచ్చాం..మీరా మమ్మల్ని ప్రశ్నించేది..?
వైఎస్ జగన్ వచ్చాకే దళితులకు రాజకీయ సాధికారత:
– మాదిగ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, రాజకీయంగా సాధికారిత కల్పించే దిశగా మేం అడుగులు వేశాం.
– దళితుల్లో మూడు ప్రధాన ఉపకులాలకు ఆర్ధికంగా వెసులుబాటు, సాధికారత కల్పించాలని ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.
– జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ముగ్గుర్ని ఎస్పీ కమిషన్ మెంబర్లుగా నియమించాం.
– నాలుగు మున్సిపాలిటీలకు చైర్పర్సన్లుగా మాదిగలకు ఇచ్చాం.
– గుంటూరు జడ్పీ ఛైర్ పర్సన్‌గా క్రిస్టినాకు ఇవ్వడం జరిగింది.
– డీసీఎంస్ ఛైర్ పర్సన్లుగా మరో ఇద్దరు మాదిగలకు ఇవ్వడం జరిగింది.
– మరో ఇద్దరు జిల్లా పరిషత్ వైస్ ఛైర్పర్సన్లు, డిప్యూటీ మేయర్లు ఇద్దరు, 46 మంది జడ్పీటీసీలు, 55 మంది ఎంపీపీలు, 13 మంది మున్సిపల్ వైస్ ఛైర్మన్లు కూడా మాదిగ సామాజిక వర్గం వారే.
– హెచ్ఆర్సీ సభ్యునిగా అత్యున్నత స్థాయి పదవిలో గొట్టిపోతుల శ్రీనివాసరావును నియమించుకున్నాం.
– మంత్రివర్గంలో నాతో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ తానేటి వనితను హోం మంత్రిగా ఉన్నారు.
– ఇద్దరు ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, బొమ్మి ఇజ్రాయేల్‌లను నియామకం చేశారు.
– తూర్పు గోదావరి జిల్లాలో మొట్టమొదటి సారిగా మాదిగ సామాజికవర్గానికి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం ఇచ్చిన ఘనత జగన్‌గారిదే.
– అవకాశం దొరికితే.. ఆ అవకాశాన్ని దళితులకు ఇవ్వాలనే తపన జగన్మోహన్రెడ్డి గారిది.
ముందు మీరు క్షమాపణలు చెప్పి మాట్లాడండి:
– ఎస్సీ కార్పొరేషన్లో గతంలో ఉన్న పథకాలు ఇప్పుడు లేవంటున్నారు..
– వాళ్లు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పడానికి వైఎస్సార్సీపీలో ఉన్న ప్రతి ఒక్క మాదిగ ప్రతినిధి సిద్ధంగా ఉన్నాడు.
– వేదిక, సమయం మీరే చెప్పమని సవాల్ విసురుతున్నా.
– అసెంబ్లీ సాక్షిగా రండి వీటిపై చర్చిద్దాం..లేదంటే మీ నాయకుడిని పంపండి.
– దళిత మహిళను బూటు కాలితో తొక్కారో ఆ అచ్చెన్నాయుడును చెప్పుతో కొట్టి మాట్లాడండి.
– దళితులపై కామెంట్స్ చేసిన వారంతా క్షమాపణలు చెప్పి చర్చకు రండి.
– ఈ నాలుగేళ్లలో మేము ఏమేమి చేశామో అప్పుడు చర్చిండానికి సిద్ధం.
– మీరు క్షమాపణలు చెప్పకుండా మాట్లాడటానికి అర్హతే లేదు.
ప్రతి పథకంలో దామాషాకు మించి దళితులకు వాటా..:
– చంద్రబాబు ఎప్పుడైనా 45 ఏళ్లు దాటిన మహిళలకు సాయం అందించాలనే ప్రయత్నం చేశాడా..?
– మేం వారికి ఇస్తున్న చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.
– 28 పైచిలుకు సంక్షేమ పథకాల ద్వారా రూ. 2.16 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేసిన నేత శ్రీ వైఎస్ జగన్.
– వీటిలో దళితుల వాటా అగ్రభాగంలో ఉంది.
– అమ్మఒడిలో 44 లక్షల మంది తల్లులకు ఇస్తుంటే.. 8 లక్షల మంది ఎస్సీ సామాజిక వర్గం వారే ఉన్నారు. 20 శాతం నిధులు వారికే వెళ్తున్నాయి.
– చేయూతలో 24 శాతం, వైఎస్సార్ ఆసరాలో 21 శాతం దళితులకే అందుతున్నాయి.
– పేదలకు ఇళ్ల పట్టాల కింద 30 లక్షలు అందిస్తే ఎస్సీ సామాజికవర్గానికి 6,36,732 పట్టాలు వారికి అందిస్తున్నాం. ఇది 21 శాతం.
– దళితులకు రావాల్సిన వాటాను దామాషా ప్రకారం మేం అందిస్తూనే రాజకీయంగానూ వారిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నాం.
– చంద్రబాబు హయాంలో దళితులు దేవాలయాల్లోకి ప్రవేశించే పరిస్థితి లేదు.
– జగన్ అధికారంలో వచ్చాక దేవాలయ బోర్డుల్లో దళితులకు స్థానం కల్పించిన ఘనత జగనన్నదే.
దళితులను అవమానించి ఇప్పుడు డప్పు కొడుతున్నారా..?:
– రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పనలో సచివాలయ వ్యవస్థ ద్వారా 1.30 లక్షల మందిలో 28,486 మంది దళితులే ఉన్నారు.
– వాలంటీర్ వ్యవస్థలో మరో 70 వేల మంది ఉన్నారు.
– మొత్తంగా 3.83 లక్షల ఉద్యోగాలు కల్పించగా… దానిలో మూడో వంతు ఎస్సీ సామాజిక వర్గానికి అందించిన ఘనత జగన్ గారిదే.
– చంద్రబాబు అధికారంలో ఉండగా నోట్లోంచి ఏనాడైనా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలనే పదాలు వచ్చిన సందర్భాలే లేవు.
– ప్రతి వేదికపై కూడా నా ఎస్సీ, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ మమ్మల్ని జగన్ గారు అక్కున చేర్చుకున్నారు.
– మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
– దళితులకు రాజకీయాలెందుకు, శుభ్రంగా ఉండరంటూ మమ్మల్ని కించపరుస్తున్న వ్యక్తులా ఈ రోజు డప్పులు కొడుతున్నారు..?
– డప్పు పట్టుకోవాలంటే దానికో అర్హత ఉండాలి..
– దండోరా వేయించే వ్యక్తులుగా మా సామాజిక వర్గాన్ని ఎన్నుకోవడానికి కారణం మా నిజాయితీ.
– విశ్వనీయతకు, నిబద్ధతకు…ఇచ్చిన మాటకు ఎంత దూరమైన వెళ్లే నాయకుడు శ్రీ వైఎస్ జగన్.
– ఎస్సీల్లోని 37 ఉపకులాలు అన్నీ కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఉండాలి అనుకుంటుంటే చంద్రబాబుకి మాత్రం అది నచ్చడం లేదు.
– ఏదో ఒక విధంగా మమ్మల్ని చీల్చాలి..గ్రామాల్లో చిచ్చుపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు.
– ఏదో ఒక విధంగా వారిని ఎన్నికల ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తున్నాడు.
– అలాంటి వారు నేడు చేస్తున్న ప్రయత్నాలు, మాట్లాడుతున్న మాటలు మాదిగలెవరూ నమ్మరు.
– ఈ ఎల్లో తోడేళ్ల గుంపులో దయచేసి దళితులెవ్వరూ భాగస్వామ్యం కావద్దు.
– టీడీపీ చెప్పే పథకాలన్నీ మూన్నెళ్ల ముచ్చటే. ఎన్నికలు అయ్యాక వాటి గురించి మర్చిపోతారు.
– ఇవన్నీ ఎన్నికల కోసం, ఓట్ల కోసం చేసే జిమ్మిక్కులు చంద్రబాబుకే సాధ్యం.
– నీకో పెద్ద దండం బాబూ..అంటూ రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకున్నారు.
– రానున్న రోజుల్లో సరైన విధంగా బుద్ధి చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు.