– సీబీఐ కోర్టు ఆమోదం
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ తరఫు న్యాయవాదికి సునీత తరఫు న్యాయవాది సాయం చేయడానికి సీబీఐ కోర్టు ఆమోదం తెలిపింది. ఈమేరకు సునీత తరఫు న్యాయవాది వేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు అనుమతించింది. సునీత లేదా ఆమె తరఫు న్యాయవాదులు సీబీఐ పీపీలతో కలిసి పని చేయనున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సీబీఐ కోర్టు సునీతకు స్పష్టం చేసింది..