– ఎస్టీలకు వ్యవసాయ భూములు కేటాయించాం
– మత్స్యకారులుగా జీవిస్తున్న యానాదుల పొట్టకొట్టాడు జగన్.
– పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చాం
– ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం కల్లూరు క్యాంప్ సైట్ వద్ద యానాది సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్.
జగన్ పాలనలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు.యానాదుల గ్రామాల్లో కనీసం రోడ్లు, త్రాగునీరు సౌకర్యం కూడా లేదు. కరెంట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం.కమ్యూనిటీ భవనాలు, స్మశానాలు లేక ఇబ్బంది పడుతున్నాం.45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని జగన్ ఎస్టీ మహిళల్ని మోసం చేసాడు.యానాది యువతకి ఉద్యోగాలు రావడం లేదు.
జగన్ ప్రభుత్వం వచ్చిన గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకున్నారు.గెలిస్తే బోర్లు వేసి సాగు కి నీరు అందిస్తాం అని జగన్ మోసం చేసాడు.
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో యానాది సామాజికవర్గం ప్రతినిధులు
ఈ సందర్భంగా వారి సమస్తలపై స్పందిస్తూ లోకేష్ ఏమన్నారంటే..
యానాదులు కూడా జగన్ బాధితులే. ఒక్క ఛాన్స్ అన్న జగన్ అందరినీ ముంచేసాడు. యానాదులు కష్ట జీవులు. కష్టాన్ని నమ్ముకున్నారు.మత్స్యకారులుగా, కూలీలు గా, కౌలు రైతులుగా జీవనం సాగిస్తున్నారు.పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాండాలను అభివృద్ది చేసాను. తాండాల్లో మౌలిక వసతులు, రోడ్లు, త్రాగునీరు సౌకర్యం కల్పించాను.ఐటిడిఏ లు ఏర్పాటు చేసిన ఘనత టిడిపి ది. 500 జనాభా ఉన్న తాండాలను పంచాయతీలుగా గుర్తించింది టిడిపి.
ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి.ఎస్టీలకు వ్యవసాయ భూములు కేటాయించాం. పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యానాదులకు పక్కా ఇళ్లు కట్టిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు, స్మశానాలు ఏర్పాటు చేస్తాం.యానాదుల కాలనీల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సిసి రోడ్లు మంజూరు చేస్తాం.ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం.కరెంట్ లేని తాండా , గూడెం లకు కరెంట్ సౌకర్యం కల్పిస్తాం.45 ఏళ్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానని జగన్ మోసం చేసాడు.మహిళల్ని ఆదుకోవడం కోసం మహాశక్తి పథకాన్ని ప్రకటించాం.18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తాం. 5 ఏళ్లలో 90 వేలు. ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆర్టీసి బస్సు ప్రయాణం ఉచితం, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు ఇస్తాం.
టిడిపి పాలనలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి అని వైసిపి ప్రభుత్వం మండలి సాక్షిగా అధికారికంగా ప్రకటించింది.యానాది యువతకి ఉద్యోగాలు , ఉపాధి కల్పించే బాధ్యత నాది.టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.నిరుద్యోగ యువతకు రూ.3 వేల ఆర్ధిక సాయం అందిస్తాం.
జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్టీలకి వచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది. నిధులు, విధులు లేని కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.జగన్ ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించింది.
జిఓ.217 తీసుకొచ్చి మత్స్యకారులుగా జీవిస్తున్న యానాదుల పొట్టకొట్టాడు జగన్. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెత్త జీఓ ని రద్దు చేసి చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి యానాదులకు అవకాశం కల్పిస్తాం.టిడిపి హయాంలో యానాదులకు ఇచ్చిన భూముల్లో పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం.జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత అటవీ భూములు అంటూ కొన్ని చోట్ల భూములు వెనక్కి లాక్కున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ భూములు డినోటిఫై చేసి యానాదులకు కేటాయిస్తాం.యానాదుల వ్యవసాయ భూముల్లో బోర్లు వేసి సోలార్ మోటార్లు ఏర్పాటు చేస్తాం.
టిడిపి ఇంఛార్జ్ కురుగోండ్ల రామకృష్ణ యానాదుల సమస్యలు తెలుసుకోవడానికి లోకేష్ సమావేశం ఏర్పాటు చేశారు. టిడిపి హయాంలోనే ఎస్టీలను ఆదుకున్నాం. ఇళ్లు, మౌలిక సదుపాయాలు కల్పించింది టిడిపి.