ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ & వెబ్‌సైట్ కమిటీ’ ఏప్రిల్ 28న విజయవాడలో, మే 20న విజయవాడలో నిర్వహించిన 2 సభలలో ఆవిష్కరించిన 3 గ్రంథాలు
1) నందమూరి తారకరామారావు శాసనసభ ప్రసంగాలు, 2) నందమూరి తారకరామారావు చారిత్రక ప్రసంగాలు, 3) శకపురుషుడు – వీటీపై సమగ్ర అవగాహన సదస్సు ‘సమాలోచన’ను 25 జూన్, 2023 ఉదయం 10గంటలకు గుంటూరులోని సూర్యదేవర కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నాము.
ఎన్టీఆర్ భావజాలం, సిద్ధాంతాలు, ఆచరణ – రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలపై అవి చూపించిన ప్రభావంపై ఇష్టాగోష్టి జరుగుతుంది. వక్తలు ఈ 3 గ్రంథాలలోని అంశాలపైన, అదేవిధంగా ఎన్.టి. రామారావు సినీ, రాజకీయ, సామాజిక జీవితానికి సంబంధించిన అంశాలపై ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమములో మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రివర్యులు మాకినేని పెదరత్తయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, ప్రముఖ రచయితలు డా॥ పాపినేని శివశంకర్, డా॥ బూసురుపల్లి వెంకటేశ్వర్లు, కావూరి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బాధ్యులు కోవెలమూడి రవీంద్ర (నాని), సీనియర్ జర్నలిస్టులు భగీరథ, విక్రమ్‌పూల, ఇంకాకాట్రగడ్డ రామకృష్ణప్రసాద్, పన్నాల సత్యనారాయణ మూర్తి పాల్గొంటారు.
దాదాపు 500మందికి పైగా పాల్గొనే ఈ కార్యక్రమం.. ఎన్టీఆర్ సిద్ధాంతాలు, ఆశయాలు, తెలుగుజాతికి ఆయన చేసిన విలువైన సేవలను తెలియపర్చడమే లక్ష్యంగా నిర్వహించడం జరుగుతున్నది.