– డీకే శివకుమార్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
బెంగళూరు: అందరు కలిసి పని చేస్తే.. కర్ణాటకలో గెలిచినట్లుగా తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ బెంగుళూరులో డీకే శివకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరూ దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తెలంగాణలో టికెట్ల కేటాయింపు, సర్వేలు, గెలుపు గుర్రాల ఎంపిక, షర్మిల పార్టీలో చేరడం తదితర అంశాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. షర్మిలను వైఎస్ఆర్ బిడ్డగా, తెలంగాణ కోడలిగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని డీకే శివకుమార్ సూచించినట్లు సమాచారం.