– ఆమెతో ఏపీలో కాంగ్రెస్‌కు చాలా లాభం
– తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే కీలక వ్యాఖ్యలు
అనుకున్నదే జరుగుతోంది. అంతా ఊహించినట్లే రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ైవె ఎస్ బిడ్డ, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అడుగులు, కాంగ్రెస్ వైపు శరవేగంగా పడుతున్నాయి. ఆమెతో కాంగ్రెస్ నాయకత్వం టచ్‌లోనే ఉంది. ఇదంతా ఎవరో చెబితే కొట్టిపారేయవచ్చు. కానీ చెప్పినాయన కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి ఠాక్రే. అటు కర్నాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ కూడా, షర్మిలను కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని తనను కలిసిన, ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సూచించారు. ఇదంతా చూస్తుంటే ఇక షర్మిల కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేననిపిస్తుంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం?
తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరడం ఖాయమైంది. ఈక్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్ చీఫ్డీకే శివకుమార్‌ను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిసిన సంగతి తెలిసిందే. దీంతో హస్తం పార్టీలో షర్మిల పార్టీ విలీనం అంటూ వార్తలొచ్చాయి. ఈ వార్తలకు బలాన్నిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలతో కాంగ్రెస్ అధిష్టానం టచ్‌లో ఉందని.. ఆమె వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీకి చాలా లాభమని మాణిక్‌రావు థాక్రే వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను రెండు విడతలుగా ముందుగానే ప్రకటిస్తామన్నారు.
బీఆర్ఎస్ – బీజేపీ ఒకటే అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పార్టీ కోసం గట్టిగా పోరాడుతున్నారని కొనియాడారు. భట్టి విక్రమార్క వాహనం అనేది ఎక్కకుండా వంద రోజులుగా 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని.. ఇది పార్టీకి చాలా దోహదం చేస్తుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్లోని కీలక నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాగా, రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.