Suryaa.co.in

Andhra Pradesh

పేదల ఇళ్ళు వ్యర్థమా రామోజీ..?

వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్ సూటి ప్రశ్న

అమరావతిలో పేదల ఇళ్ళ నిర్మాణంపై రామోజీ ఏడుపు..? :
అబద్దాల అడ్డా ఈనాడు పత్రిక.. కొత్తగా దళితులపై ముసలి కన్నీరు కారుస్తోంది. ఒక పక్క ఎస్సీలు హత్యకు గురవుతున్నారు అని రాస్తాడు…మరో పక్క ఎస్సీ ఎస్టీలకు ఇళ్లు ఇవ్వొద్దంటూ ఆర్‌5 జోన్‌ గురించి రాస్తాడు. రామోజీరావుకు పెద్ద వయసు వచ్చినా సిగ్గు శరం లేదు. పేదలకు ఇళ్లు హడావుడిగా కట్టాల్సిన అవసరం ఏముంది..? కేంద్రం ఎందుకు హడావుడిగా అనుమతులిచ్చింది అని రాస్తాడు.. పేదవాడు బాగుపడుతుంటే.. చంద్రబాబు ఏడుస్తుంటాడు. అలాంటి వ్యక్తి చంద్రబాబు గురించి ఈనాడు వారు చాలా గొప్పగా రాయాలని, మా ప్రభుత్వంపై లేనిపోని అబద్ధాలన్నీ వండి వారుస్తున్నారు.

అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్లిస్తే రూ.750 కోట్లు కృష్ణలో పోసినట్లు అని రాతలు రాస్తున్నాడు. పేదవాళ్లకు ఇళ్లు నిర్మిస్తే, వారికోసం ఖర్చు చేస్తే వ్యర్థం అని వీరి భావన. ఎస్సీలకు మేలు జరిగితే ఏడ్చేది చంద్రబాబు అండ్‌ కో..ఈనాడు, టీవీ5, ఏబీఎన్‌. రామోజీరావు తాను నీతిగా బతికానని భావిస్తే.. రామోజీ ఫిల్మ్‌ సిటీలో అసైన్డ్‌ భూములు ఎన్నున్నాయో చెప్పాలి. ఏనాడైనా ఆ అస్సైన్డ్‌ భూములను ప్రజలకు అప్పజెప్పారా..? అక్రమంగా, దౌర్జన్యంగా మీరు ఎస్సీల భూములు లాక్కోలేదా..? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అసైన్డ్‌ భూములు ఆక్రమించి రామోజీ కంపెనీలు పెట్టుకున్నాడు.

అప్పుడు రామోజీ చెవిలో సీసం పోసుకున్నాడా..?:
ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తే కదా…
ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు రామోజీరావుకు వినిపించలేదా..?
ఆ మాటలు వినపడకుండా చెవిలో సీసం పోసుకున్నాడా..?
ఎస్సీల్లో ఎవరు పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అంటే..ఆయన మంత్రులు ఎస్సీలకు శుభ్రత లేదన్నారు.
వర్ల రామయ్య వీళ్లు చదువుకోరు అని మాట్లాడారు.
వీళ్లందరికీ ఎస్సీలంటే చిన్నచూపు. వీళ్లు ఇప్పుడు ఎస్సీలకు ఏదో కీడు జరుగుతోంది, వారు చనిపోతున్నారు అని రాస్తున్నారు.
యథేచ్ఛగా అబద్దాలు రాస్తూ జీవితాంతం చంద్రబాబుకు బాకా ఊదుకుంటూ గడిపేస్తున్నారు.
రాష్ట్ర రాజధానిలో ఎస్సీలు ఉండకూడదని, ఉంటే ఈ ప్రాంతం మురికి కూపాలుగా మారతాయని సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ చంద్రబాబు అడ్డుకున్నారు.
ఇప్పుడు వాళ్లంతా ఎస్సీలకు ఏదో జరిగిందని మాట్లాడుతున్నారు.
అలాంటి వారంతా ఇప్పుడు సిగ్గు శరం చీము నెత్తురు లేకుండా మాట్లాడుతున్నారు.
రాష్ట్రంలో ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని చూపే ప్రయత్నం చేస్తున్నారు.
టీడీపీ హయాంలో, వైఎస్సార్సీపీలో ఏం జరిగిందో క్రైం బ్యూరో నివేదికలు తీసుకుని చూడండి.
ఎక్కడ ఏది జరిగినా వైఎస్సార్సీపీకి అంటగడుతున్నారు
ఎక్కడో ఏదో జరిగితే దాన్ని తీసుకొచ్చి వైఎస్సార్సీపీకి అంటగట్టడం వీళ్ల పని.

ఎస్సీలకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చిద్దామా:
ఎస్సీలకు జగన్‌ ప్రభుత్వంలో ఏం జరిగింది..చంద్రబాబు హయాంలో ఏం కీడు జరిగిందో చర్చిద్దాం.
చంద్రబాబు ఎస్సీల్లో ఎవరు పుట్టాలనుకుంటారు అంటుంటే..జగన్‌ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్నారు.
అసలు కులవివక్ష అనేది ఒక్క చంద్రబాబు వద్దే ఉంది.
చంద్రబాబు హయాంలో జరిగిన దాడులు, అఘాయిత్యాల గురించి రాయబోయి ఈనాడు రామోజీ, మా ప్రభుత్వంపై అభాండాలు వేసినట్టు ఉన్నాడు.
చంద్రబాబు చరిత్ర అందరికీ తెలిసిందే కదా..
చంద్రబాబును నమ్ముకున్న వ్యక్తి ఏ ఒక్కడైనా బాగుపడ్డాడో చూపించండి.
జగన్‌ గారిని నమ్ముకున్న వ్యక్తి ఎవరు మోసపోయారో చూపించండి..
చంద్రబాబుతో నేను చర్చకు సిద్ధం..ఆయన చర్చకు వస్తే ఇదే సీఆర్‌డీఏ ప్రాంతంలో ఎస్సీలను ఏ రకంగా అవమానపరిచాడో వివరిస్తా.
తన సామాజికవర్గం వారికి పట్టు వస్త్రాలు పెట్టి.. ఎస్సీల ఇళ్ళ వద్ద పోలీసులతో కాపలా పెట్టిన వ్యక్తి చంద్రబాబు
దమ్ముంటే చర్చకు రా..లేదంటే చేతగాని చవటలా సర్ధుకో.
అంతేకానీ… నీ ఎల్లో మీడియాలో పిచ్చిరాతలు రాపిస్తే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
దళితుల పాలిట ద్రోహులైన మీకు.. అకస్మాత్తుగా ఎస్సీలపై ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా..?
ఎస్సీలంతా జగన్‌ వెంట ఉన్నారు కాబట్టి ఏదో ఒక రకంగా వారి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నాడు.
ఆ గొడవలను జగన్‌పై రుద్ది లబ్ధిపొందాలని చూస్తున్నాడు.

ఎస్సీలపై ప్రేమ ఉంటే ఫిల్మ్‌ సిటీలో అసైన్డ్‌ భూములన్నీ పంచేయండి:
రామోజీ, చంద్రబాబు కాటికి కాళ్లు చాపుతున్నారు.. ఇంకా వారి కుట్రలు మాత్రం ఆగటం లేదు.
మీ మాటలు, మే చేష్టలు, రాతలు చూస్తుంటే.. మీకు అసలు సిగ్గు శరం లేదని ప్రజలు ఉమ్మేస్తున్నారు.
పేదలు ఇంగ్లీష్‌ మీడియం చదవకూడదని కోర్టులకెళ్లిన వ్యక్తులు వీళ్లు..
రామోజీరావు వృత్తే చంద్రబాబు ఏది చెబితే అది రాసుకోవడం. ఈనాడు.. టీడీపీ పత్రిక.
నిస్సిగ్గుగా ఒక పక్క ఎస్సీలకు ఆర్‌5 జోన్‌లో భూములు ఇవ్వడానికి వీళ్లేదని రాస్తూ..మరో పక్క ఎస్సీలకు ఏదో జరిగిపోతుందంటూ రాస్తున్నారు.
రామోజీరావుకు సిగ్గుంటే.. అన్నమే తింటుంటే ఫిల్మ్‌ సిటీలో ఉన్న అసైన్డ్‌ భూములు బయటకు తీయండి.
మీకు నిజంగా ఎస్సీలపై ప్రేమ ఉంటే ఆ భూములన్నీ పంచేయండి.
అమరావతి ప్రాంతంలో చంద్రబాబు దాయాదులు పేదల్ని, దళితుల్ని భయపెట్టి భూములు కొనుగోలు చేసి ఆ డాక్యుమెంట్లు దాచుకున్నారు.
అవి ఇప్పటికీ బయటకు రావడం లేదంటే ఎవరికి ఎస్సీలపై ప్రేమ ఉన్నట్టు..?
మీరు రాసిన వార్తల్లో నిజాలు ఉంటే చర్చకు నేను సిద్ధం…
చంద్రబాబు, లోకేశ్‌ ఎవరైనా సరే.. దమ్ముంటే రండి..
ఎవరు మేలు చేశారో నేను నిరూపిస్తాను.
కాస్త కాకపోతే కాస్తన్నా సిగ్గనపించాలి. రెండు నాల్కల దోరణితో రాతలు రాస్తున్నావు.
మనిషి అన్న తర్వాత ఎంతో కొంత నీతిగా బతకాలి.
అవన్నీ వదిలేసి చంద్రబాబు, రామోజీ అండ్‌ టీం బతుకుతున్నారు.
జగన్‌ గారి వల్ల దళితులకు ఎక్కడ ఇబ్బంది జరిగిందో నిరూపించే దమ్ము మీకుందా..?
ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలతో సహా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించుకున్నారు.
ఓసీల్లో కూడా పేదలకు మేలు చేస్తున్న నాయకుడు జగన్‌ .
అణగారిన వర్గాలకు మేలు చేయాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ .
మీరు ఒక సామాజికవర్గాన్ని పట్టుకుని రియల్‌ ఎస్టేట్‌ దందా చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుని సంపద అంతా మీ చేతిలో పెట్టుకున్నారు.
చంద్రబాబుకు అంత ప్రేమే ఉంటే దోచుకున్న సంపద అంతా పంచమనండి.
రాజధాని ప్రాంతంలో అసైన్డ్‌ భూములు పూలింగ్‌కి తీసుకునేటప్పుడు అప్పటి మంత్రి పుల్లారావు రైతుల్ని అవమానకరంగా మాట్లాడాడు.
మావి అసైన్డ్‌ భూములు కదా మాకూ ప్యాకేజీ ఇస్తారా అని అడిగితే ఊరికే లాక్కుంటాం అన్నాడు.
రోడ్డేసేటప్పుడు చీమలు, దోమలు, కప్పలు చచ్చిపోతాయ్‌.. రాజధాని కట్టేటప్పుడు కూడా అంతే అని రైతులను అవమానించారు.
ఇలాంటి వ్యక్తులు ఎస్సీల గురించి మాట్లాడతారా..? కాస్తన్నా సిగ్గు ఉండాలి కదా మాట్లాడటానికి..?
జగన్‌ హయాంలో ఏ ఒక్క చిన్నతప్పూ జరగలేదు. యాదృచ్ఛికంగా ఏదైనా జరిగితే జగన్‌ సహించరు. వెంటనే అరెస్టు చేయిస్తారు.. ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడరు.
చంద్రబాబు హయాంలో రాజమండ్రి పుష్కరాల్లో 29 మందిని పొట్టనపెట్టుకుని ఈనాటికి తప్పు అయిపోయిందన్న మాట అనలేదు.
ఇంత మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు రాష్ట్రాన్ని వృద్ధి చేస్తాడట.

LEAVE A RESPONSE