• ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ లపై ప్రతాపం చూపిన ముఖ్యమంత్రి తక్షణమే వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి
• గ్రామపంచాయతీలకు ఇవ్వాల్సిన రూ.8,700కోట్ల నిధుల్ని తక్షణమే విడుదల చేయాలి
– మాజీ మంత్రి కే.ఎస్.జవహర్
దేశానికి పట్టుగొమ్మలుగా నిలవాల్సిన పల్లెలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధికి దూరమయ్యాయని, ప్రజలుఎన్నుకున్న సర్పంచ్ లపై ముఖ్యమంత్రి దాడిచేస్తున్న తీరు జగన్ శాడిస్ట్ వైఖరికి నిదర్శమని, చెక్ పవర్ ఉన్నసర్పంచ్ లను పోలీసులతో కొట్టించడం, తప్పుడు కేసులతో వేధించడం ఈ ముఖ్యమంత్రికే చెల్లిందని టీడీపీ సీనియ ర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ చెప్పారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …
“ ప్రభుత్వం తరపున గ్రామాలకు ఇవ్వాల్సిన నిధుల్ని జగన్ రెడ్డి పూర్తిగా నిలిపేశాడు. దాంతో నిధులులేక గ్రామాల్లో జరగాల్సిన పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. 14, 15వ ఆర్థికసంఘానికి సంబంధించి దాదాపు రూ.8,660కోట్లు పూర్తిగా దారిమళ్లించి, పంచాయతీలకు ఇవ్వకుండా నేరుగా జగన్ రెడ్డి డ్రాచేసుకోవడం దుర్మార్గం. ముఖ్యమంత్రి నిర్వాకంతో సర్పంచ్ లు ఆఖరికిగ్రామాల్లో చెత్తనుకూడా సేకరించలేకపోతున్నారు. ప్రజలకనీస అవసరాలైన తాగునీరు, విద్య, వైద్యం వంటివాటిని కూడా అందించలేని దుస్థితిలో సర్పంచ్ లు ఉన్నారంటే అందుకుకారణం జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలే.
ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ లను రోడ్లపాలుచేసిన జగన్ రెడ్డి, నిధులు నిలిపేసి వారి ప్రాణాలు బలిగొంటున్నాడు
రాష్ట్రంలో సర్పంచ్ లు బలవన్మరణాలకు పాల్పడుతున్నారంటే అందుకుప్రధాన కార ణం ముఖ్యమంత్రే. గుంటూరుజిల్లా ప్రత్తిపాడుమండలం వట్టిచెరుకూరు సర్పంచ్ కూర గాయలు విక్రయిస్తుంటే, ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో, పనులు చేసిన వారికి సమాధానంచెప్పలేక మహిళా సర్పంచ్ ధనలక్ష్మి చనిపోయింది. అనకా పల్లి జిల్లా ఎస్వీపట్నం సర్పంచ్ లోకవరపు సత్యనారాయణ తానేస్వయంగా మురుగు కాలువల్లో బురదతీస్తున్నాడు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఓదళితసర్పంచ్ పొట్టకూటికోసం కూరగాయలు విక్రయిస్తోంది. రాజమహేంద్రవరం పార్లమెంట్ నిడదవోలు, కోరుమల్లే గ్రామసర్పంచ్ కూలిపనులు చేసుకుంటోంది.
అల్లూరు సీతారామరాజు జిల్లాలో వైసీపీసర్పంచ్ కుటుంబపోషణకోసం ఆటో నడుపుకుంటు న్నారు. వైసీపీకి ఓటేసి, జగన్ ను ముఖ్యమంత్రి నిచేసి తప్పుచేశానని, ప్రకాశంజిల్లా చినగానిపల్లి సర్పంచ్ చెప్పుతో తననుతానే కొట్టుకుంటున్నాడు. ఇలాంటిదారుణాలు ఎన్నిజరుగుతున్నా ముఖ్యమంత్రిలో చలనం లేదు. గ్రామప్రథమపౌరుల్ని ఇలాంటి దుస్థితికి తీసుకొచ్చిన ఘనత జగన్ రెడ్డిది. గ్రామసీమల అభివృద్ధికి కేటాయించిన నిధుల్ని వాటికోసం కేటాయించకుండా, సర్పంచ్ లకు చెక్ పవర్ లేకుండాచేసి, ఆ నిధుల్ని తనసొంతానికి వాడుకుంటున్న ముఖ్యమంత్రిని ఇప్పుడేచూస్తున్నాం.
గ్రామాల్లోని ప్రజలకు తాగునీరులేక, ఇబ్బందులుపడుతుంటే, వారిబాధలుచూడలేక సొంతడబ్బుతో బోర్లువేయించిన వారిపై అక్రమ కేసులుపెట్టిస్తున్నారు. ఆ వార్తల్ని పత్రికల్లో రాసిన విలేకరుల్ని, పోలీసులతో బెదిరిస్తున్నారు. ఇదీ జగన్ పాలనలో రాష్ట్రం లోని గ్రామపంచాయతీల దుస్థితి.
చంద్రబాబు హయాంలో గ్రామాభివృద్ధిలో రాష్ట్రం దేశంలో 5వస్థానంలో నిలిస్తే, జగన్ ఏలుబడిలో 18వ స్థానానికి పడిపోయింది
చంద్రబాబు ప్రభుత్వంలో 2018లో గ్రామాలఅభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే 5వస్థానంలో నిలిచింది. జగన్ రెడ్డి దయవల్ల 18వస్థానానికి పడిపోయింది. జలజీవన్ మిషన్ పథ కంలో (గ్రామాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేప్రాజెక్ట్) భాగంగా తాగునీ టి కొళాయికనెక్షన్ కు రూ.500చెల్లించాల్సి ఉండగా, జగన్ ప్రభుత్వం దాన్ని రూ.125 0 కు పెంచింది. ఈ విధంగా దాదాపు రూ.100కోట్లు ప్రజలనుంచి కొట్టేసి, జగన్ తన పార్టీవారికి దోచిపెట్టాడు.
టీడీపీప్రభుత్వం గ్రామాల్లో తాగునీటికోసం నిర్మించిన ఎన్టీఆర్ జలసిరి వాటర్ ప్లాంట్లను జగన్ పూర్తిగా మూసేయించాడు. గతంలో మీసేవా కేంద్రాల ద్వారా పల్లెటూళ్లలో ప్రజలు తమకు అవసరమైన పత్రాలు, సేవల్ని నిర్ణీతరుసుముతో పొందేవారు. మీసేవా కేంద్రాల్ని నిర్వీర్యంచేసిన జగన్ రెడ్డి ఒక్కో అర్జీపై ప్రజలనుంచి రూ.30లువసూలుచేయిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3కోట్లప్రజలు అర్జీలు పెట్టుకున్నా, ఒక్కొక్కరినుంచి రూ.30లచొప్పున ఎంతవసూలుచేస్తున్నారో అర్థం చేసుకోండి. చంద్రబాబుహాయాంలో చెత్తసేకరణ ద్వారా విద్యుత్ ఉత్పత్తి తయారుచేసే కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగింది.
తడిచెత్త, పొడిచెత్త సేకరణకోసం దళితులకు రిక్షాలుఇచ్చి, వారికిజీతమిచ్చింది. ఇళ్లనుంచి సేకరించే చెత్తకు కిలోకు ఇంతని ప్రభు త్వం డబ్బుచెల్లించింది. టీడీపీప్రభుత్వం నిర్మించిన డంపింగ్ యార్డ్ లు మూత పడ్డాయి. ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ పథకంకింద ఉపాధికావాలని కోరినప్రతిఒక్కరికీ పని కల్పించాల్సిన ముఖ్యమంత్రి, కూలీలకు జాబ్ కార్డులు ఇవ్వడాన్ని పూర్తిగా నిలిపేశాడు. సర్పంచ్ వ్యవస్థను జగన్ రెడ్డి ఎందుకూపనికిరాని వ్యవస్థగామార్చాడు. గ్రామ సర్పంచ్ లు మండలకేంద్రాలకు వెళ్తే, వారిగోడు వినేవారు లేకుండాపోయారు. సర్పంచ్ వ్యవస్థకు సమాంతరంగా జగన్ తీసుకొచ్చిన వ్యవస్థ అటుఅధికారుల్ని, ఇటుప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతోంది.
గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిధులు ఇవ్వమని అడిగిన సర్పంచ్ లపై పోలీసులతో దాడిచేయించిన జగన్ రెడ్డి తక్షణమే వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి
జగన్ ప్రభుత్వం పల్లెల్లో ఎక్కడా ఒక్కరోడ్డు వేసిందిలేదు. 73, 74 రాజ్యాంగసవరణల ద్వారా గ్రామాలఅభివృద్ధికి నిధులుకేటాయించాలనిచెబితే, జగన్ రెడ్డి రాజ్యాంగాన్నే ధిక్కరిస్తూ నిధులు ఆపేశాడు. గ్రామాలకు అవసరమైన నిధులుఇవ్వకుండా, నిధులు ఉన్నా వాటిని ఇతరత్రా పనులుకు వినియోగించడానికి వీల్లేకుండా సర్పంచ్ లను జగన్ రెడ్డి డమ్మీలను చేశాడు. ప్రజలఓట్లతో గెలిచిన సర్పంచ్ లు ప్రజలపక్షాన, గ్రామాలఅభివృద్ధికోసం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రశ్నించకూడదా? నిధులు ఇవ్వమని అడగకూడదా?
రాష్ట్రంలోని సర్పంచ్ లు కూలీలుగా, కూరగాయలు అమ్ము కునేవారిగా, చెత్తఎత్తేవారిగా, పూడికతీసేవారిగా, బతుకుదెరువుకోసం వలసకూలీలు గా మారడానికి జగన్ రెడ్డే కారణం. పంచాయతీలకు చెల్లించాల్సిన రూ.8,700కోట్ల నిధుల్ని జగన్ ఏంచేశాడో, ఎటుమళ్లించాడో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. సర్పం చ్ లు ఆత్మహత్యలుచేసుకుంటున్నారంటే దానికి కారణం జగన్ రెడ్డి దోపిడీవిధానమే. ముఖ్యమంత్రి తక్షణమే సర్పంచ్ లకు ఇవ్వాల్సిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలి.
వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుధ్యంసరిగా లేకపోతే వ్యాధులుప్రబలే అవకాశం ఉంటుం ది. దాంతో ప్రజలు రోగాలపాలై ప్రాణాలుకోల్పోయేప్రమాదముంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పల్లెల్ని నిర్లక్ష్యం చేయకుండా, వాటి బాగుకోసం ప్రజలఆరోగ్యం కోసం వెం టనే సర్పంచ్ లకు ఇవ్వాల్సిన నిధులిస్తే, వారువాటితో గ్రామాల్ని అభివృద్ధిచేసుకుంటా రు. ప్రజలప్రాణాలతో చెలగాటమాడే చర్యలకు ముఖ్యమంత్రి తక్షణమే స్వస్తిచెప్పాలి. నిన్న తాడేపల్లికి రావాలనుకున్న సర్పంచ్ లపై ముఖ్యమంత్రి దాడిచేయించడం క్షమిం చరాని నేరం.
జరిగినదానికి జగన్ రెడ్డి తక్షణమే గ్రామప్రథమ పౌరులకు బహిరంగక్ష మాపణ చెప్పాలి. నిధులులేకుండా పల్లెల్లో అభివృద్ధిజరగదనే వాస్తవాన్ని గ్రహించి, ముఖ్యమంత్రి పంచాయతీలకు తక్షణమే నిధులు విడుదల చేయాలి. జగన్ రెడ్డి నిర్వాకంతో వైసీపీ సర్పంచ్ లు రోడ్డునపడ్డారు. కరోనాసమయంలో ఉపాధ్యాయుల్ని ఇబ్బందిపెట్టిన జగన్ రెడ్డి, అదేపద్ధతిలో తనను ప్రశ్నిస్తున్న సర్పంచ్ లను కూడా వేధింపులకు గురిచేస్తున్నాడు.” అని జవహర్ స్పష్టంచేశారు.