Suryaa.co.in

Andhra Pradesh

ఫీజు ఎక్కడ కంస మామ?

వాల్ పోస్టర్లు విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే, ఆలూరు ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ

విద్యా వ్యవస్థ ను సర్వ నాశనం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసమర్థ అనాలోచిత నిర్ణయాల వల్ల యావత్ ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులందరూ తమ విద్యను కొనసాగించలేక తమ ఫీజు లు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటు మధ్యలో విద్య కు దూరం అవుతున్న కూడా కాస్తైనా కనికరం లేకుండా చేస్తున్నందున ఫీజు ఎక్కడ కంస మామ అనే వాల్ పోస్టర్లు ను ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ విడుదల చేశారు.

రాష్ట్ర కార్యదర్శి వడ్డే పెద్దయ్య, ఆలూరు నియోజకవర్గం టి ఎన్ ఎస్ అధ్యక్షుడు తలారి సిద్ధప్ప, ఉప అధ్యక్షుడు తాలూకు ప్రధాన కార్యదర్శి మనోహర్ యాదవ్ రవితేజ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది.జీఓ 51 52 ద్వారా ఎయిడెడ్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేసేలా జీఓ లు వెనక్కి తీసుకోవాలి.జీఓ 71 ను రద్దు చేసి ఉన్నత విద్య ను అందించాలి.

పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లించాలి. అమ్మ ఒడి ద్వారా ఆర్హ్వులైన ప్రతి ఒక్కరికీ అందించాలి.
హాస్టల్ లో వసతులు సొంత భవనాలు మేస్ అండ్ కాస్మెటిక్ చార్జెస్ ను ఇవ్వాలి.

ఈ కార్యక్రమం లో ఆలూరు టి ఎన్ ఎస్ ఎఫ్, నాయకులు రాఘవేంద్ర మల్లికార్జున, తిప్పేస్వామి.కోట్ల యూత్ రాము యాదవ్, ఐటీడీపి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE