Suryaa.co.in

Andhra Pradesh

ప్రసన్నకుమార్ రెడ్డి .. నోరు, భాష అదుపులో పెట్టుకో!

-గ్రావెల్, ఇసుక అమ్ముకోకుండానే నాలుగేళ్లలో వంద లకోట్లు సంపాదించావా?
-నాకు ఇవ్వాల్సిన సీటుని నీకుఇచ్చిన తెలుగుదేశం పార్టీని దుర్భాషలాడతావా?
-రాజకీయజీవితం ఇచ్చిన వారిపై నోరుపారేసుకోవడా నికి సిగ్గు, పద్ధతి ఉండక్కర్లా?
-శ్రీనుమామ బహిరంగ సభల్లో ఎన్నిసార్లుమాట్లాడినా నీకులాగా సం స్కారం లేకుండా మాట్లాడలేదు
-రాజశేఖర్ రెడ్డి చెత్తనాయకుడు అన్న పదిహేనురోజులకే ప్రసన్నకుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పంచనచేరాడు
-లోకేష్ ప్రజల్లో స్టార్ హీరో అయ్యాడు
-యువగళం పాదయాత్ర ప్రదేశంలో (కోవూరు) టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ప్రసన్నకుమార్ రెడ్డి నోరు, భాష అదుపులో పెట్టుకో. నువ్వు అవినీతికి పాల్పడ్డావని లోకేశ్ అంటే ఎగిరెగిరిపడుతున్నావు..గతంలో మీనాయకుడు చంద్రబాబుని అన్నమాటలు మర్చిపోయావా? చంద్రబాబు రూ.6లక్షలకోట్ల అవినీతికి పాల్పడ్డాడన్న మీరు, అధికారంలోకి వచ్చాక ఏంపీకారు?

“ కోవూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా అతని పద్ధతి, ప్రవర్తన, మాటతీరు ఏదీమారలేదు. లోకేశ్ అతని అవినీతి దందా బయటపెట్టడంతో చెలరేగి మాట్లాడుతున్నాడు. ప్రసన్నకుమార్ రెడ్డి రూ.1500కోట్ల అవినీతికి పాల్పడ్డాడని లోకేశ్ చెప్పాడు. ఆయన చెప్పిన లెక్క తప్పు అయితే, తాను ఈ నాలుగేళ్లలో ఎంతతిన్నాడో ప్రసన్నకుమార్ రెడ్డే ప్రజ లకు చెప్పొచ్చుకదా ! నీకు రాజకీయజీవితం ఇచ్చిన నాయకుడి మనవడు.. కొడుకుని అరేయ్..తురేయ్ అనేస్థాయికి వచ్చావా ప్రసన్నకుమార్ రెడ్డి?

తన అవినీతి గురించి లోకేశ్ మాట్లాడాడని ఎగిరిపడుతున్న ప్రసన్నకుమార్ రెడ్డి కి గతంలో జగన్, చంద్రబాబుని అన్న మాటలు, ఆయనపైచేసిన అవినీతి ఆరోపణ లు గుర్తులేవా?
నీ అవినీతిగురించి లోకేశ్ మాట్లాడితే అంతఎగిరిపడుతున్నావు ప్రస్నన్న కుమార్ రెడ్డి… మరి మీనాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడిని అన్నమాటలకు మేమేంచేయాలి. రూ.6లక్షలకోట్ల అవినీ తికి పాల్పడ్డాడు చంద్రబాబు అని అవాస్తవాలతో పుస్తకం ముద్రించారు. ఇప్పుడు అధికారంలోకి నాలుగేళ్లయితే మీరుచేసిన ఆరోపణలపై ఏంపీకారు?
మీ నాయకు డు ప్రజలనుంచి కొట్టేసిన సొమ్ము రూ.43వేలకోట్లని సీబీఐ, ఈడీతేల్చాయి. 16 నెలలు జైల్లోఉండివచ్చిన వాడిపక్కనుండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుం టామనుకుంటున్నావా? లోకేశ్ లాంటి ఉన్నతవిద్యావంతుడిని, సంస్కారవంతు డిని నోటికొచ్చినట్టు మాటలంటావా? ప్రసన్నకుమార్ రెడ్డి నువ్వు గ్రావెల్, ఇసుక అమ్ముకోకుండానే నాలుగేళ్లలో వంద లకోట్లు సంపాదించావా? నాకు ఇవ్వాల్సిన సీటుని నీకుఇచ్చిన తెలుగుదేశం పార్టీని దుర్భాషలాడతావా? రాజకీయజీవితం ఇచ్చిన వారిపై నోరుపారేసుకోవడా నికి సిగ్గు, పద్ధతి ఉండక్కర్లా? ప్రసన్నకుమార్ రెడ్డి ఎందుకుఇంతలా దిగజారిమా ట్లాడుతున్నావు? నీ అవినీతి ఇంతని లోకేశ్ చెబితే, దానిలో ఎంతతప్పుందో చెప్పు.

నీ తండ్రి (సోమిరెడ్డికి మేనమామ) శ్రీనివాసురెడ్డి, నీకులాగా సంస్కారం లేకుండా ఎప్పుడూ మాట్లాడలేదు
1978లో మా మేనమామ శ్రీనివాసులు రెడ్డి (ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి) ఎమ్మె ల్యేగా గెలిస్తే, చిన్నమంత్రి పదవి ఇచ్చారు. చెన్నారెడ్డి రాగానే అదీపీకేశారు. శ్రీనివాసరెడ్డి (శ్రీనుమామ) తెలుగు దేశంపార్టీ వచ్చాక రాష్ట్రస్థాయిలో ఒకవెలుగు వెలిగాడు. శ్రీనుమామ బహిరంగ సభల్లో ఎన్నిసార్లుమాట్లాడినా నీకులాగా సం స్కారం లేకుండా మాట్లాడలేదు. ప్రసన్నకుమార్ రెడ్డి నువ్వు అనేదానికంటే ప దింతలు మేం అనగలం…జాగ్రత్తగా మాట్లాడు.

రాజకీయాల్లో నీతి, నిజాయితీతో ప్రజలకోసం బతకాలి. అలా బతకడం ప్రసన్నకుమార్ రెడ్డికి చేతగాదని అర్థమైంది. చంద్రబాబు మహానాయకుడు.. రాజశేఖర్ రెడ్డి చెత్తనాయకుడు అన్న పదిహేనురోజులకే ప్రసన్నకుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పంచనచేరాడు.

బుచ్చిరెడ్డిపాలెంలో లోకేశ్ బహిరంగసభచూశాక ప్రసన్నకుమార్ రెడ్డికి నిద్ర పట్ట లేదు. లోకేశ్ ప్రజల్లో స్టార్ హీరో అయ్యాడు. లోకేశ్ కు లభిస్తున్నప్రజాదరణ చూసి మతిభ్రమించే పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నాడు. 2009లో ఎమ్మెల్యే అయ్యి చంద్రబాబులాంటి మహానాయకుడు.. రాజశేఖర్ రెడ్డి లాంటి చెత్తనాయకుడు లేడన్నావు.

కరెక్ట్ గా పదిహేనురోజుల తర్వాత రాజశేఖర్ రెడ్డితో కండువా కప్పించుకొని చంద్రబాబునిఅన్నావు. రాజకీయాల్లో గెలుపోటము లు ముఖ్యం కాదు. జనంకోసం ఎలా బతికారు…ఎంత నీతి నిజాయితీగా బతికారన్నదే ముఖ్యం. నీకు, మీ నాయకుడికి అలా బతకడం చేతగాదని అర్థమైంది ప్రసన్నకుమార్ రెడ్డి.”

LEAVE A RESPONSE