Suryaa.co.in

Telangana

విద్యుత్ సంస్థలకు వినియోగదారులే ఓనర్లు

-వారి పట్ల పాజిటివ్ దృక్పథం ఉండాలి
-ఆవేశకావేశాలకు లోనూ కావొద్దు
-కొత్తగా చేరేవారికి ప్రభాకర్ రావు,రఘుమా రెడ్డీలు రోల్ మోడల్ కావాలి
-విద్యుత్ శాఖలో 30 వేల ఉద్యోగ నియామకాలు
-విమర్శకులకు ఈ నియామకాలు చెంప పెట్టు లాంటివి
-విద్యుత్ శాఖలో నూతన ఏ ఈ ల నియామకాలు
-48 మందికి నియామకపు ఉత్తర్వులు
-ఉత్తర్వులు అంద జేసిన మంత్రి జగదీష్ రెడ్డి
-పాల్గొన్న ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు,టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి తదితరులు

విద్యుత్ సంస్థలకు వినియోగదారులే యజమానులు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సంస్థలో నూతనంగా ఉద్యోగంలో చేరేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవలన్నారు. అటువంటి వినియోగదారుల పట్ల పాజిటివ్ దృక్పథంతో వ్యవహరించ గలిగితే సంస్థాపరంగా అద్భుతమైన విజయాలు నమోదు చేసుకోవొచ్చని ఆయన తెలిపారు. టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ లో నూతనంగా నియమితులైన 48 అసిస్టెంట్ ఇంజినీరింగ్ ఉద్యోగులకు మింట్ కాంపౌండ్ లోని టి ఎస్ ఎస్ పి పి డి సి ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియామకపు ఉత్తర్వులను మంత్రి జగదీష్ రెడ్డి అంద జేశారు.టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ చేసే పనిని యిష్టంగా చేయగలిగినప్పుడు మాత్రమే ఆ పని కష్టం అనిపించదన్నారు.విద్యుత్ ఉద్యోగులు విధి నిర్వహణలో వినియోగదారుల పట్ల అనుచితంగా ప్రదర్శించ రాదని ఆయన హితవు పలికారు. విద్యుత్ సంస్థలో నూతనంగా చేరే వారికి సి యం డి లు ప్రభాకర్ రావు,రఘుమా రెడ్డి లు రోల్ మోడల్ కావాలని ఆయన ఉద్బోధించారు.50 సంవత్సరాలు ఒకే సంస్థలో పని చేసిన రికార్డ్ ప్రభాకర్ రావు నమోదు చేసుకున్నారన్నారు.

జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఆఫర్ చేసినా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఉన్న విశ్వాసంతో తొమ్మిది సంవత్సరాలు గా ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థలను సంస్కరిస్తున్నారన్నారు.అదే సమయంలో టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమా రెడ్డి విద్యుత్ సంస్థను ఇల్లు అనుకుని సంస్థలో పనిచేసే సిబ్బందిని కుటుంబం అనుకుని తనకున్న అపార అనుభవంతో పారదర్శకంగా సంస్థను నడిపిస్తున్నారన్నారు.

కొత్తగా ఉద్యోగంలో చేరే వారు వీరిద్దరిని రోల్ మోడల్ గా ఎంచుకుంటే భవిష్యత్ మొత్తం మీదే నని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఒక్క విద్యుత్ సంస్థ లొనే 30 వేల ఉద్యోగ నియామకాలు జరిగాయన్నారు. అందులో 22 వేలు క్రమబద్దీజారించుకున్న విషయాన్ని ఆయన తెలిపారు. ఉద్యోగ నియామకాలు జరగ లేదు అనే వారికి కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు చెంప చెల్లు మనిపించేలా సమాధానం చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE