Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో బీసీలు ఉండకూడదా జగన్ రెడ్డి?

– వైసీపీనేతలు, కార్యకర్తలు అహంకారంతో బీసీలపై దాడిచేస్తుంటే, వారిపై తప్పుడుకేసులు పెట్టించి, వేధిస్తుంటే ముఖ్యమంత్రి మాట్లాడడేం?
• పోలీసుల చేతగానితనం వల్లే బీసీలపై దాడులు, వేధింపులు
• విజయవాడలో చేనేతకార్మికుడిని బట్టలూడదీసి కొట్టిన వైసీపీనేత అవినాశ్ గుప్తా, అతని మిత్రులు శశి, ఆనంద్ లపై పోలీసులు ఏంకేసులు పెట్టారు?
• బట్టలుకొన్న డబ్బులు ఇవ్వమని అడిగితే దుర్మార్గంగా దాడిచేసి కొడతారా?
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

రాష్ట్రంలో బీసీలు ఉండకూడదన్నట్టు ముఖ్యమంత్రి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని, ధర్మవరం చేనేత కార్మికుడి బట్టలూడదీసి, కొట్టి హింసించి, ఆ దృశ్యాలను వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టిన వైసీపీనేత అవినాశ్ గుప్తా, అతని సహచరులు శశి, ఆనంద్ ల దుశ్చర్యపై జగన్మోహన్ రెడ్డి ఏంచర్యలు తీసుకుంటాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కొల్లురవీంద్ర ప్రశ్నించారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

“ పోలీసులచేతగానితనం వల్లే దళితులు, బీసీలపై రోజూ దాడులు జరుగుతున్నాయి. బట్టలతాలూకా డబ్బు అడిగిన చేనేతకార్మికుడిని కొట్టి, బట్టలూడదీసి, వీడియోలు తీస్తే పోలీసులు తాత్కాలికంగా కేసులుకట్టడం ఏమిటి? బాపట్ల జిల్లాలో బాలుడిపై పెట్రోల్ పోసి తలగబెడితే ప్రభుత్వం, పోలీసుల్లో చలనంలేదు. రాష్ట్రంలో పట్టపగలే బీసీలపై దారుణాలు జరుగుతుంటే డీజీపీ ఏంచేస్తున్నారు.

జగన్ ప్రభుత్వంలో చేనేతకార్మికుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. ఉపాధిలేక, నేతవస్త్రాలు అమ్ముడుపోక కుటుంబపోషణ భారమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
బతకలేక, వ్యాపారాల్లో వచ్చేనష్టాలతో జగన్ ప్రభుత్వంలో ఇప్పటివరకు 60మంది చేనేతకార్మికులు చనిపోయారు. వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ఏంన్యాయంచేశాడో సమాధానంచెప్పాలి. పొద్దుటూరులో నందంసుబ్బయ్యనే చేనేతకార్మికుడు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాడన్న అక్కసుతో నడిరోడ్డుపై కిరాతకంగా చంపేశారు. పనిలేక, చేనేతవస్త్రాలు అమ్ముడుపోక, బతుకుభారమై నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడు తున్నారు. ఆప్కోవ్యవస్థను ముఖ్యమంత్రి నిర్వీర్యంచేశాడు. రాష్ట్రంలో 5లక్షలమంది చేనేతకార్మికులుంటే, ముఖ్యమంత్రి తలాతోక లేని నిబంధనలుపెట్టి, వారిలో కొద్దిమంది కే ఆర్థికసహాయం అందిస్తున్నాడు.

నేతకార్మికుల్లో వివిధరకాల పనులుచేసుకొని బతి కే వారుంటే, వారిలో కొందరినే అర్హులుగా ఎలా నిర్ణయిస్తారు? టీడీపీప్రభుత్వంలో నేత కార్మికులకు యార్న్ (వస్త్రాలు తయారుచేసేదారం) పై సబ్సిడీ అందించాము. యార్న్ కాట్స్ అందించి, వర్క్ షెడ్లు నిర్మించాము. టీడీపీప్రభుత్వం అందించిన సహాయంతో ఎంతోమంది చేనేతకార్మికులు నెలకు రూ.50వేలనుంచి రూ.లక్షవరకు సంపాదించు కున్నారు.

టీడీపీప్రభుత్వం నేతకార్మికులకు అందించిన పథకాలన్నీ రద్దుచేసిన జగన్ రెడ్డి, కేవలం ఏడాదికి రూ.24వేలు, అదీ కొద్దిమందికే ఇస్తే, వారు ఎలాబతుకుతారు? జగన్ ప్రభుత్వం చేనేతకార్మికుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో అసలు నేతవృత్తి ఉంటుందా.. ఉండదా అన్న సందేహం కలుగు తోంది.

జగన్ రెడ్డి అండతో బీసీలపై తప్పుడుకేసులుపెట్టి, వారిని హింసించే పోలీసు అధికారు లకు టీడీపీప్రభుత్వం రాగానే బుద్ధిచెబుతాం
తాను ముఖ్యమంత్రి అయ్యాక దారుణంగా, కిరాతకంగా 27మంది బీసీనేతల్ని జగన్ పొట్టనపెట్టుకున్నాడు. బీసీలను చంపుతున్నా.. వారి ఆస్తులు ధ్వంసంచేస్తున్నా, వా రి ఇళ్లు నేలకూలుస్తున్నా ప్రభుత్వానికి పట్టదు. శ్రీకాళహస్తిలో మునిరాజమ్మ అనే మహిళ దుకాణాన్ని నేలమట్టంచేసి, ఆమెను దుర్భాషలాడి, ఆమెపైనేతప్పుడు కేసు లు పెట్టారు. ముఖ్యమంత్రి బీసీలపై పెట్టే తప్పుడుకేసులన్నింటినీ టీడీపీప్రభుత్వం రాగానే తొలగిస్తాం. జగన్మోహన్ రెడ్డి అండతో బీసీలను హింసిస్తూ, వారిపై తప్పుడు కే సులుపెట్టే ప్రతి పోలీస్ అధికారికి భవిష్యత్ లో తగినవిధంగా బుద్ధిచెబుతాం.

బీసీలద్రోహి జగన్ ను రాష్ట్రంనుంచి తరిమికొట్టేవరకు బీసీలు ఎవరూ విశ్రమించరు
బీసీలపై ముఖ్యమంత్రి సాధిస్తున్న కక్షసాధింపులు నిలువరించడానికి, వారికి అండగా నిలవడానికే చంద్రబాబు బడుగు, బలహీనవర్గాలవారికోసం ప్రత్యేకరక్షణచట్టం తీసుకొస్తామని చెప్పారు.బీసీల ద్రోహి అయిన జగన్ ను రాష్ట్రంనుంచి తరిమితరిమి కొట్టేవరకు బీసీలు ఎవరూ విశ్రమించరు. వైసీపీనేతదాడిలో గాయపడిన చేనేత సోదరులకు అండగా ఉంటాం. మరోసారి ఇదేవిధంగా బీసీలపై దాడులుజరిగితే, కచ్చితంగా డీజీపీ కార్యాలయా న్ని ముట్టడించి మాసత్తాఏంటో చూపిస్తాం.” అని రవీంద్ర హెచ్చరించారు.

LEAVE A RESPONSE