Suryaa.co.in

Andhra Pradesh

గొంతులు కోయడంలో జగన్ రెడ్డిని, అనిల్ కుమార్ ను మించినవారు ప్రపంచంలోనే లేరు

– సొంతబాబాయ్ ని చంపింది ఒకరైతే, తనబాబాయ్ రాజకీయభవిష్యత్ చంపేసింది మరొకరు
• మా పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడే ముందు మీ నాయకుడు తల్లికి, చెల్లికి ఏంన్యాయంచేశాడో చెప్పు అనిల్ కుమార్. తండ్రిని, తల్లిని, చెల్లిని దూషించినవారికి మంత్రిపదవులిచ్చి పక్కనపెట్టుకున్నాడు
• ప్రసన్నకుమార్ రెడ్డి హద్దులుమీరిన భాషే అతన్ని వచ్చేఎన్నికల్లో ఓడిస్తుంది
– యువగళం పాదయాత్ర ప్రదేశంలో (కావలి) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్

“ యువగళం పాదయాత్ర దెబ్బతో వైసీపీనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఓటమి భయంపట్టుకుంది. మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ రోజుకో సవాల్ విసురుతున్నాడు. దమ్ముంటే తనపై పోటీకి రావాలని కనిపించినవారినల్లా రెచ్చ గొడుతున్నాడు. లోకేశ్ కు సవాల్ విసిరే స్థాయి, సత్తా అనిల్ కుమార్ కు లేవు. లోకేశ్ ను నెల్లూరుసిటీ నియోజకవర్గంనుంచి పోటీచేయాలంటున్న అనిల్ కుమార్, ముందు జగన్మోహన్ రెడ్డిని అక్కడపోటీకి నిలిపాలి.

జగన్ నెల్లూరు సిటీ నుంచి బరిలో దిగితే, అతనిపై పోటీచేయడానికి టీడీపీ కార్యకర్తచాలు..శిఖరం లాంటి లోకేశ్ అక్కడఅవసరంలేదు. రూ.200కోట్లు ఖర్చుపెట్టి, నన్నుఓడించడా నికి తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నారని అనిల్ కుమార్ వగలమారి ఏడు పులు ఏడుస్తున్నాడు. గతంలో నారాయణను ఓడించానని ప్రగల్భాలు పలికిన అనిల్, ఇప్పుడెందుకు అదే నారాయణపై పోటీకి భయపడుతున్నాడు?

వచ్చే ఎన్నికల్లో గెలవడానికి, మాజీమంత్రి నారాయణ కంటే ఎక్కువఖర్చు పెట్టగల స్తోమత అనిల్ కుమార్ కు ఉందని ఇప్పటికే నెల్లూరుసిటీ నియోజకవర్గ ప్రజల కు అర్థమైంది. వైసీపీనేతలు, కార్యకర్తలే అనిల్ కుమార్ నుంచి తమకు విముక్తి కల్పించాలని లోకేశ్ కు లేఖలరూపంలో మొరపెట్టుకుంటున్నారు.

గొంతులుకోయడంలో జగన్ రెడ్డి, వైసీపీనేతల్ని మించినవారు లేరు. దేవుళ్ల ముందు ఉత్తుత్తిప్రమాణాలతో అనిల్ కుమార్ ప్రజల్ని నమ్మించే ప్రయ త్నం చేస్తున్నాడు. అనిల్ కుమార్ ను తాము బలహీనుడిగా చూడటంలేదు. వచ్చేఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికంటే పదింతలు ఎక్కువఖర్చుపెట్టే అనిల్ కుమార్ బలాన్ని తాము గుర్తించాము. టీడీపీనేత అజీజ్ కు నష్టంకలిగింద ని, అతనికి అన్యాయంచేశారని అనిల్ కుమార్ మాట్లాడటం సిగ్గుచేటు.

గతంలో అజీజ్ మేయర్ గా వైసీపీనుంచి గెలిస్తే, ఆపార్టీనేతల పోరుపడలేక అతను టీడీపీలో చేరాడని ఖురాన్ పేరుతో అవమానించారు. టీడీపీలోచేరిన అజీజ్ ను తాము గౌరవించాము. పార్టీపరంగా పదవులిచ్చి, అతనిమాటకు విలువిచ్చి నడుచుకున్నాం. అజీజ్ కు ఎలాన్యాయంచేయాలో మాపార్టీ చూసుకుంటుంది అనిల్ కుమా ర్. నువ్వు అతనిగురించి ఆలోచించకుండా ముందు మీ బాబాయ్ కు ఎలా న్యాయం చేయాలో ఆలోచించు. గొంతులు కోయడంలో జగన్ రెడ్డి, వైసీపీనేతలే నిష్ణా తులని తెలుసుకో అనిల్ కుమార్.

మా పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడేముందు, సొంత తండ్రిని, తల్లిని, చెల్లిని తిట్టినవారికి మంత్రిపదవులిచ్చి, పక్కనకూర్చోబెట్టుకున్న జగన్ రెడ్డి బాగోతంపై మాట్లాడు అనిల్ కుమార్
మాపార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడుతున్న అనిల్ కుమార్ ముందు జగన్ నిర్వాకాలపై సమాధానంచెప్పాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏంఅర్హత ఉందని జగ న్ అతనికి రాజ్యసభ ఇచ్చాడు. గతంలో జగన్ ను తిట్టాడని, ప్రభాకర్ రెడ్డిని అని ల్ కుమార్ వైసీపీలో చేర్పించాడా? యల్లసిరి గోపాల్ రెడ్డిని కాదని, వేమిరెడ్డికి రాజ్యసభ ఇచ్చింది మీస్వార్థంకోసం కాదా? ఆదాలప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్ల మెంట్ ఇన్ ఛార్జ్ గా ఉంటే, అతన్ని పక్కనపెట్టి, వేమిరెడ్డిని అందలం ఎక్కించారు .

నెల్లూరురూరల్ నియోజకవర్గ బాధ్యతలు ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఎందు కు ఇవ్వలేదో సమాధానంచెప్పు అనిల్ కుమార్. బీదమస్తాన్ రావుకి రాజ్యసభ ఇవ్వడానికి, జగన్ రెడ్డి ఎందరి గొంతులుకోశాడో సమాధానంచెప్పు అనిల్ కుమా ర్. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరితే చారిత్రాత్మక నిర్ణయమన్నారు. టీడీపీలోకి వస్తే తప్పంటున్నారు.

జగన్ పాదయాత్రసమయంలో మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి, అతనివెంటనడిచాడు. కాకాణి గోవర్థన్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ఎవరూ ఆనాడు జగన్ తో లేరు. అనిల్ కుమార్, జగన్మోహన్ రెడ్డిల రెండునాల్కల ధోరణి ప్రజలకు అర్థమైంది. వై.ఎస్.విజయమ్మను పార్టీ గౌరవాధ్య క్షురాలి పదవినుంచి జగన్ఎందుకు తప్పించాడో సమాధానంచెప్పు అనిల్ కుమా ర్. తన తల్లిని, తండ్రిని, చెల్లిని తిట్టినవారికి మంత్రిపదవులిచ్చి, వారిని చెరోపక్క న పెట్టుకొని జగన్ సిగ్గులేకుండా రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. సొంతబాబాయ్ ని చంపిన జగన్, తనబాబాయ్ ని రాజకీయంగా హత్యచేసిన అనిల్ కుమార్ కు టీడీపీ అంతర్గత విషయాలగురించి మాట్లాడే అర్హతలేదు.

ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడే భాషే అతన్ని వచ్చేఎన్నికల్లో ఓడిస్తుంది. 5 కోట్ల ఆంధ్రులు తమ భవిష్యత్ నాయకుడు లోకేశ్ అని నమ్మేలా చేసినందుకు జగన్ ను, అతని నీలిమీడియాను అభినందిస్తున్నాం
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గతంలో రాజశేఖర్ రెడ్డిని బూతులు మాట్లాడారు. రక్తం తాగుతున్న రాజశేఖర్ రెడ్డి అని, నరమాంస భక్షకుడని ఎవరినైతే అన్నావో, తరువాత అతనిపంచనే ప్రసన్నకుమార్ రెడ్డిచేరాడు. తరువాత చంద్రబాబుని చెట్టుకుకట్టేసి కొట్టిస్తానుఅన్న నిన్ను, ప్రజలు ఎన్నికలబ్యాలెట్ కు కట్టేసి చావ గొట్టారు. ప్రసన్నకుమార్ రెడ్డి నీ బాగోతం, నీ దోపిడీ అంతా ప్రజలకు అర్థమైంది.

ఇప్పుడు నువ్వు మాట్లాడే భాషే 2024 ఎన్నికల్లో నిన్నుఓడిస్తుంది. వైసీపీ నేత లు, ఆపార్టీ నీలిమీడియాకు నిజంగా ధన్యవాదాలు చెబుతున్నాం. 5 కోట్ల ఆంధ్రులంతా తమ భవిష్యత్ నాయకుడు లోకేశ్ అని గుర్తించేలా చేసినందుకు ధన్యవా దాలు చెబుతున్నాం. లోకేశ్ సత్తా, సమర్థత తెలుసుకొని ఇప్పుడు ఆయనపై మీరుచేస్తున్న ఎదురుదాడితో ఆయన మరింత రాటుదేలుతున్నాడు. యువగళం పాదయాత్ర ముగిసేలోపు ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి, జగన్ కు అంతిమ వీడ్కోలు పలకడం ఖాయం.”

LEAVE A RESPONSE